శ్రీవారి ఆలయంలో  దీపావళి సంబురం
x
తిరుమల ఆలయంలోకి వస్త్రాలు తీసుకుని వస్తున్న జీయర్ స్వాములు

శ్రీవారి ఆలయంలో దీపావళి సంబురం

తిరుమల శ్రీవారి సన్నిధిలో దీపావళి ఆస్థానం.


దీపావళి పండుగ ఇళ్లలోనే కాదు. తిరుమల ఆలయంలో కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. తిరుమల ఆలయంలో నిర్వహించే విశిష్ట కార్యక్రమాల్లో దీపావళి ఆస్థానం కూడా ఒకటి.

శ్రీవారి ఆలయంలో సోమవారం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆగమోక్తంగా జరిగిన ఈ ఆస్థానంలో ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్ స్వాములు, టిటిడి బోర్డు సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆలయంలో ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించారు.

తిరుమల శ్రీవారి జీయర్ స్వాములు మఠం నుంచి కొత్తవస్త్రాలు మంగళవాయిద్యాల మధ్య ఆలయంలోకి తీసుకుని వచ్చారు. అనంతరం శ్రీదేవి,భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి, విష్వక్సేనుల వారి ఉత్సవ మూర్తులను సర్వభూపాల వాహనంలో ఊరేగింపుగా తీసుకుని వచ్చారు. బంగారువాకిలికి సమీపంలోని ఘంగా మండపంలో గరుడాళ్లారుకు అభిముఖంగా వేంచేపు చేశారు. శ్రీవారి సేనాధిపతి శ్రీవిష్వక్సేనులవారినికి స్వామివారికి ఎడక పక్కన మరోపీఠంపై ఆశీనులను చేశారు. ఆ తరువాత స్వామివారికి ప్రత్యేక పూజలు, హారతి ప్రసాదాలు నివేదించారు. ఉత్సవమూర్తులకు కొత్త పట్టువస్త్రాలు అలంకరించారు. ఆలయంలోని శ్రీవేంకటేశ్వరస్వామివారి మూలవిరాట్టుకు కూడా నూతన వస్త్రాన్ని అలంకరించారు. రూపాయి హారత, ప్రత్యేక హారతులు నివేదించారు. తద్వారా దీపావళి ఆస్థానం పూర్తి చేశారు. అనంతరం తీర్థం, శఠారి మర్యాదలతో ఆలయ అధికారులను అర్చకులు ఆశీర్వదించారు.


Read More
Next Story