భూమన మత విద్వేషాలు రెచ్చగొట్టారా?
x

భూమన మత విద్వేషాలు రెచ్చగొట్టారా?

 &

తిరుమలలో టీటీడీ మాజీ చైర్మన్ బీ. కరుణాకరరెడ్డిపై తిరుమల పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు, మత విద్వేషాలు రెచ్చగొట్టారనే అభియోగాలు మోపారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

"తిరుమల శ్రీవారి లడ్డూప్రసాదం తయారీలో వాడిన నెయ్యిలో కల్తీ జరిగింది" అని సీఎం ఎన్. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై గత ఆరు రోజులుగా రాజకీయ దుమారం చెలరేగుతూనే ఉంది. "తిరుమలలో అపచారం జరగడానికి వైసీపీ ప్రభుత్వం, వైఎస్. జగన్, టీటీడీ పాలక మండలి చైర్మన్లుగా పనిచేసిన వైవీ. సుబ్బారెడ్డి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కారణం" అని కూడా సీఎం చంద్రబాబు ఆరోపణలు సంధించారు. దీంతో ఈ వ్యవహారంపై రాష్ట్రంలోనే కాకుండా, దేశవ్యాపితంగా ఆరనిచిచ్చులా మారింది.
సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ అధికార ప్రతినిధి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే బీ. కరుణాకరరెడ్డి ఖండించారు. "ఈ వ్యవహారంపై సీబీఐ లేదా సుప్రీం కోర్టు జడ్జితో విచారణ జరిపించండి" అని డిమాండ్ చేశారు. అయితే,

అనూహ్యంగా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అంతరంగికులకు కూడా చెప్పకుండా తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తితో పాటు తన కొడుకు, భూమన అభినయరెడ్డి, పరిమిత సంఖ్యలో అనుయాయులతో సోమవారం మధ్యాహ్నం తరువాత తిరుమలకు చేరుకున్నారు.

"రాజకీయ ప్రసంగాలు చేయకూడదు" అని పోలీసులు టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకరరెడ్డికి ముందస్తు నోటీసు కూడా ఇచ్చారు. వాటన్నింటికి సరే అని చెప్పిన కరుణాకరరెడ్డి "వరాహస్వామి ఆలయం సమీపంలోని శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేసి, ఆలయం ఎదుట ఉన్న బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఉన్న అఖిలాండం వద్ద సత్యప్రమాణం" చేశారు. ఆ కార్యక్రమం ముగింపు వచ్చాక ఆయనను పోటీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటటపై పోలీసులు కేసు నమోదు చేశారు. "టీటీడీ మాజీ చైర్మన్ బీ. కరుణాకరరెడ్డి నిబంధనలు ఉల్లంఘించారు. అని ఐదు సెక్షన్ల కింద తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఇందులో ప్రధానంగా "భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. కులమతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారు" అని సెక్షన్లు వర్తించే విధంగా కేసులు నమోదు చేశారు.
Read More
Next Story