Delhi blast: తిరుపతిలో పోలీసుల అలర్ట్..
x

Delhi blast: తిరుపతిలో పోలీసుల అలర్ట్..

అలిపిరి, తిరుమలలో ముమ్మరంగా తనిఖీలు.


ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల సంఘటనతో పోలీసులు అలర్ట్ అయ్యారు. తిరుపతి, తిరుమలతో పాటు రాయలసీమలోని కీలక ప్రదేశాల్లో తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు.

తిరుమల శ్రీవారి క్షేత్రానికి వెళ్లడానికి ప్రధాన ద్వారం గా ఉన్న అలిపిరి వద్ద బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బందిని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు రంగం లోకి దించారు.

తిరుపతి జిల్లా పరిధిలోని సూళ్లూరుపేట వద్ద ఉన్న శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం వద్ద కూడా సిఐఎస్ఎఫ్ (Central industrial security force) మరింత అప్రమత్తమైంది. తిరుపతిలో నిత్యం యాత్రికులతో రద్దీగా ఉండే ప్రదేశాల్లో మెటల్ డిటెక్టర్ తో పాటు బాంబు స్క్వాడ్, వీరుడు పదార్థాలను పసిగట్టగలిగిన సామర్థ్యం ఉన్న డాగ్స్ కార్డును కూడా రంగం లోకి దించారు.
రాయలసీమలో ప్రధానంగా చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గం పుత్తూరు, ఉమ్మడి కడప జిల్లా రాయచోటి, అనంతపురం జిల్లాలోని అనేక ప్రదేశాల్లో నిషేధిత తీవ్రవాద కళాభాల సాగించే ఉగ్రవాదులకు స్లీపర్ సెల్స్ ను తమిళనాడు, ఢిల్లీ నుంచి వచ్చిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (Anti terrorist squad Ats) అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
కడప జిల్లా రాయచోటిలో పట్టుబడిన ఇద్దరు తమిళనాడు ఉగ్రవాదుల సమాచారం ఆధారంగా జరిగిన దాడుల్లో ఇంకొందరు తెరపైకి వచ్చారని పోలీసు వర్గాల సమాచారం. ఇదిలా ఉండగా,
ఢిల్లీ పేలుళ్లతో..
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో సోమవారం రాత్రి ఎర్రకోటకు సమీపంలోని రైల్వే స్టేషన్ వద్ద జరిగిన పేలుళ్లతో రాయలసీమలో కూడా పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రధానంగా తిరుపతిలో తనిఖీలు ముమ్మరం చేశారు. తిరుమలకు వెళ్లడానికి ప్రధాన ద్వారంగా ఉన్న అలిపిరి చెక్ పాయింట్ వద్ద టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి తోడుగా సివిల్ పోలీసులు అందులో బాంబు స్క్వాడ్, డాగ్స్ వాడుతూ రంగంలోకి దిగారు.

యాత్రికులు ప్రయాణిస్తున్న ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ ప్రాంతాన్ని పూర్తిగా పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. వాహనాలతోపాటు అందులో ప్రయాణిస్తున్న యాత్రికుల లగేజీని ఏమాత్రం వదలకుండా తనిఖీ చేసిన తర్వాతే తిరుమలకు వెళ్లడానికి అనుమతిస్తున్నారు. ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల సమాచారం తెలియని చాలామంది యాత్రికులు ఈ తనిఖీలతో ఆందోళన గురయ్యారు.
"శ్రీవారి దర్శనం కోసం వెళుతున్న యాత్రికులకు పోలీసులు ధైర్యం చెప్పి మరి తిరుమల కు పంపిస్తున్నారు. తనిఖీలకు సహకారం అందించాలని కూడా కోరుతున్నారు"

అలిపిరికి సమీపంలోనే కాకుండా తిరుమలలో కూడా పోలీసులు తనిఖీలు చేపట్టారు. యాత్రికులను భయాందోళన గురి కాకుండా వారికి ఆత్మస్థైర్యం కల్పించే దిశగా తనిఖీలు సాగిస్తున్న తీరును కూడా పోలీసులు వివరించి సహకారం తీసుకుంటున్నారు.


Read More
Next Story