కలియుగ వైకుంఠంలో తెరుచుకున్న ద్వారాలు..
x
తిరుమల శ్రీవారి ఆలయానికి పుష్పాలతో వైకుంఠ శోభ

కలియుగ 'వైకుంఠం'లో తెరుచుకున్న 'ద్వారాలు'..

తిరుమలలో ప్రశాంతంగా ప్రారంభమైన దర్శనాలు.


తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రాన్ని కలియుగ వైకుంఠంగా భావిస్తారు. తొలి మంచుతెరలు తెలిగే వేళ బ్రహ్మముహూర్తంలో వైకుంఠద్వారాలు తెరుచుకున్నాయి. మంగళవారం వేకువజామున1.30 గంటలకు శ్రీవారి సన్నిధిలోని వైకుంఠ ద్వారాలు తెరిచని వెంటనే ప్రముఖులకు మొదట దర్శనాలు కల్పించడంలో టీటీడీ అన్ని జాగ్రత్తలు తీసుకుంది.

టోకెన్లు లేని వారిని కొండపైకి అనుమతించని స్థితిలో అఖిలాండం వద్ద కనీసం టెంకాయ కొట్టే అవకాశం లేకుండా చేశారని సామాన్య యాత్రికులు వేదనకు గురయ్యారు.


తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తోపాటు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో మంత్రులు, ప్రముఖులు శ్రీవారిని దర్శించుకుని, వైకుంఠ ద్వార ప్రవేశం చేశారు. దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, కర్ణాటక తో పాటు అనేక రాష్ట్రాల నుంచి రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న ప్రముఖులు, చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులతో తిరుమల, శ్రీవారి ఆలయం కిటకిటలాడింది.


తిరుమలతో వైకుంఠ ద్వారాలు తెరిచిన తరువాత నాలుగు గంటలపాటు ప్రొటోకాల్ దర్శనాలకు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి వెంట రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, కే. అచ్చన్నాయుడు వెంట ఉన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తరహా పద్ధతిని అనుసరిస్తూ, వైకుంఠం 1 క్యూ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి ఆలయంలోకి వెళ్లారు. ఆయన తోపాటు కేంద్ర మంత్రి కే. రామ్మోహన్ నాయుడు, నిమ్మల రామానాయుడు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కొల్లు రవీంద్ర కుటుంబసభ్యుల తోపాటు అనేకమంది రాజకీయ ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. చిత్రపరిశ్రమ నుంచి మెగాస్టార్ కొణిదెల చిరంజీవి భార్య సురేఖ ఆయన కుటుంబీకులు, రాజేంద్రప్రసాద్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తమ్ముడు కొడుకు నారా రోహిత్ ఇంకా అనేక మంత్రి రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. క్రికెటర్ తిలక్ వర్మ కూడా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. వారితో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మంత్రులు, న్యాయమూర్తులతో శ్రీవారి ఆలయం రద్దీగా మారింది.

ప్రశాంతంగా దర్శనాలు
తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రముఖుల దర్శనం తరువాత ఈ డిప్ ( E Dip) టోకెన్లు ఉన్న యాత్రికులను తెల్లవారుజామున ఐదు గంటల నుంచి దర్శనాలకు అనుమతించారు. దీంతో తోపులాట, తొక్కిసలాటకు ఆస్కారం లేకుంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, టీటీడీ విజిలెన్స్ విభాగం తీసుకున్న చర్యలు ప్రతిఫలించాయి.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంగళవారం (డిసెంబర్ 30వ తేదీ నుంచి 2026 జనవరి రెండో తేదీ వరకు) నుంచి మూడు రోజుల పాటు 1.76 లక్షల మందికి దర్శనాలు కల్పించడానికి టీటీడీ ఈ డిప్ ద్వారా టోకెన్లు కేటాయించింది. అంటే రోజుకు సరాసరిగా 60 వేల మందికి మాత్రమే పరిమితం సంఖ్యలో టోకెన్లు ఇవ్వడం వల్ల ప్రశాంతంగా దర్శనాలు కల్పించడానికి ఆస్కారం ఏర్పడింది.

తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వెంకటేశ్వర్ కుటుంబం

తిరుమలలో కూడా యాత్రికులకు ఇబ్బంది లేకుండా దర్శనాలు కల్పించాలనే తమ ప్రయత్నాలు సఫలం అయ్యాయని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ సంతృప్తి వ్యక్తం చేశారు.
"జనవరి రెండో తేదీ నుంచి ఏడు రోజులు కూడా సామాన్య యాత్రికులకు ఇబ్బంది లేకుండా దర్శనాలు కల్పించడానికి పోలీసులు, టీటీడీ విజిలెన్స్, సిబ్బంది సహకారంతో సమన్వయంతో పనిచేస్తాం" అని ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు.
తిరుమలలో క్యూలోకి వచ్చే యాత్రికులకు సదుపాయాలు, సేవలు అందించడానికి ప్రత్యేక యంత్రాంగం సంసిద్ధంగా ఉందని టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి చెప్పారు
పోలీసులు అప్రమత్తం...
తిరుమలకు వెళ్లే మార్గాలతో పాటు, అలిపిరి, జిల్లా సరిహద్దుల్లో పోలీసులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. యాత్రికుల కదలికలపై దృష్టి సారించారు. టోకెన్లు లేకుండా వాహనాల్లో వస్తున్న వారిని తిరుపతికి అనుమతించలేదు. ఈ డిప్ టోకెన్లు ఉన్నావారిని మాత్రమే అలిపిరి నుంచి తిరుమలకు అనుమతించారు.
యాత్రికులకు నిరాశ
తిరుమలలో గతానికి భిన్నంగా టీటీడీ అధికారులు వ్యవహరించారు. ఈ సంవత్సరం జనవరిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్లు లేని వారు తిరుమలకు వెళ్లి, అఖిలాండం వద్ద కొబ్బరికాయ కొట్టే అవకాశం లేకుండా పోతోందనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read More
Next Story