Daddy Foundation | యాచకులు 'ఆనందం'గా ఉండాలి.. వారిలో మేముండాలి...
అందరూ పెద్దలను కలవడానికి వెళుతున్నారు. నెల్లూరు 'డాడీ ఫౌండేషన్' పేదల మధ్య గడిపి, వినూత్నంగా వ్యవహరించింది.
కొత్త లేదు. పాత లేదు. కనిపించిన వారందరూ హ్యాపీ న్యూయర్ చెప్పుకుంటున్నారు. రాజకీయ నేతలు, అధికారుల నివాసాలు సందడి ఉన్నాయి. నెల్లూరు నగర వీధుల్లో బుధవారం ఉదయం నుంచి ఓ కారు ఆగుతోంది. భార్య, చిన్నపాపతో వెళుతున్న ఆ వ్యక్తి కనిపించిన బిచ్చగాళ్లకు దుప్పటితో సన్మానించడం. వెంట ఉన్న చిన్నపాపతో వారికి భోజనం డబ్బా. నీళ్ల సాసీ ఇప్పించడం. అందరూ దండంపెట్టి, శుభాకాంక్షలు చెబుతున్న ఫోటోలు వాట్సప్ గ్రూప్ లో చక్కర్లు కొడుతున్నాయి.
ఇవి సాధారణంగా కనిపిస్తుంటాయి.
ఫోన్ చేస్తే, పోలేదా? కాదంటే కొన్ని నిమిషాలు వృథా అవుతాయి. అని అనుకుని వాట్పప్ గ్రూపులో వచ్చిన నంబర్ వ్యక్తితో మాట్లాడా. ఆనందరావు తన ప్రస్ధానం వివరించారు. ఈ సంగతి తెలుసుకుందామని నెల్లూరు నగరంలో నాకు తెలిసిన సీనియర్ జర్నలిస్టు గయాజ్ తో మాట్లాడా. "దిక్కు మొక్కు లేని వారికి వ్యక్తగత సంపాదన నుంచి ఆ కుటుబం తమకు సాధ్యమైనంత సేవ చేస్తుంటుంది" అనేది గయాజ్ చెప్పిన సమాధానం. చాలా ఆశ్యర్యం కలిగింది. సీనియర్ జర్నలిస్టు గయాజ్ చెప్పిన మాటలతో ఆనందరావు మంచిపని చేస్తున్నారనే విషయం స్పష్టమైంది.
"అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి" అనే మాటను ఓ వ్యక్తం సార్ధకం చేస్తున్నారు
న్యూ ఇయర్ అంటే షేక్ హ్యాండ్లు. పార్టీలు చేసుకోవడం. వరకే పరిమితం అవుతాం. నాయకులను కలిసి కేక్ కట్ చేయడం. వారికి పూలహారాలు వేయడం. శాలువలతో సన్మానం మాత్రమే మనం చూస్తుంటాం. అభాగ్యుల కళ్లలో దైన్యాన్ని గమనించం. నెల్లూరు పట్టణంలో "డాడీ ఫౌండేషన్ " వ్యవస్థాపకుడు ఆ పని చేశారు.
పేదరికం పునాదుల పైనుంచి వచ్చి, వీధుల్లో టిఫిన్ బండి నడిపే నిర్వహించే ఓ వ్యక్తి వీధి బిచ్చగాళ్లకు అయిన వాడయ్యారు. భార్య నాగమణి, ఆమె అక్క మనవరాలు, కొడుకుతో కలిసి ఫుట్ పాత్, వీధుల్లో పడుకున్న వారికి బుధవారం మంచి భోజనం పెట్టడమే కాదు. మంచినీళ్ల సీసా, చలికి ఇబ్బంది పడకుండా దుప్పట్లు కూడా అందించి, వారికి నమస్కారం చేసిన ఆయన నూతన సంవత్సర వేడుకను పేదలతోనే కలిసి పంచుకున్నారు.
ఈ విషయంపై ఆనందరావు 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో మాట్లాడుతూ, "మేము ముగ్గురు అన్నదమ్ములం. మాది పేద కుటుంబం. మా నాయన కష్టపడి సాగాడు" అని నెల్లూరుకు సమీపంలోని తాటిపత్రి గ్రామానికి చెందిన ఆనందరావు తన కుటుంబ వివరాలు చెప్పారు. "నేను ఏడో తరగతి చదవిను అనిపించుకున్నాజీవనం కోసం నెల్లూరు నగరానికి వచ్చా. నాకు మంచి స్నేహితులు దొరికారు. బీ.టెక్ చదివిన నా కొడుకు వెంకట శివసాయి కుమార్ సహకారం. కరోనా నేర్పిన పాఠాలతో "డాడీ ఫౌండేషన్" ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
"కలిగిన వారందరూ ఉన్నవారికే చూసుకుంటారు. పేదరికం నుంచి వచ్చిన నాకు ఆ బాధ తెలుసు" అందుకే దిక్కుమొక్కు లేని జనం కోసం ఫాస్ట్ ఫుడ్ బండిపై సంపాదించిన సొమ్ములో ప్రత్యేక రోజుల్లో సేవలు నిర్వహించడం ఓ అలవాటుగా మార్చుకున్నా" అని ఆనందరావు ఫౌండేషన్ ఏర్పాటు చేయడానికి, సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి దారితీసిన పరిస్థితులను వివరించారు. "న్యూ ఇయర్ రోజు దాదాపు 50 మందికి దుప్పట్లు పంపిణీ చేశా. మంచి భోజనం డబ్బాలు కూడా అందించడం" సంతృప్తిగా ఉందన్నారు.
అలా ఫోన్ లో మాట్లాడుకుంటూ వెళ్లిన ఆనందరావు తన స్నేహితుడు, బిర్యానీకి నెల్లూరును బ్రాండ్ గా మార్చిన రియాజ్ భాయ్ కి ఫోన్ ఇచ్చారు.
"ఆనందరావు చాలా కష్టపడి వచ్చారు సార్. తోపుడుబండిపై ఫాస్ట్ ఫుడ్ వ్యాపారం చేస్తారు. ఆ సొమ్ము నుంచే సేవ కోసం కొంత వినియోగిస్తారు" అని రియాజ్ భాయ్ చెప్పారు. పేదలకు సాయం చేయడం అంటే అల్లాకు చేసినట్లే కదా. మా స్నేహితుడు ఆనందరావు అదే చేస్తున్నారని సంబర పడ్డారు. అదే సమయంలో నేను..
ఏసీబీ దివంగత డీఎస్పీ షేక అల్లాబక్షుతో కలిసి ఆయన హోటల్లో బిర్యానీ రుచి చూసిన సందర్భాన్ని గుర్తు చేయగానే...
"అవును సార్, అల్లాబక్షు మా హోటల్ గా చాలాసార్లు వచ్చారు. మంచి వ్యక్తి. మేము బాగా గౌరవిస్తాం. వద్దన్నా వినడు. బిల్లు చెల్లించి వెళ్లేవారు" అని రియాజ్ భాయ్ అల్లాబక్షును గుర్తు చేసుకుంటూ, స్ట్రోక్ తో పోయారని తరువాత తెలిసింది. ఆయన ఆత్మ శాంతించాలి అని అల్లాను దువా కోరారు. పోనీలే సర్
కరోనా సమయంలో రియాజ్ భాయ్ సహకారంతో పేదల ఆకలి తీర్చిన విషయాన్ని కూడా "డాడీ ఫౌండేషన్" వ్యవస్థాపకుడు ఆనందరావు వివరించారు. రియాజ్ భాయ్ హోటల్లో ఆహార పదార్థాలు తయారు చేయడం, నా కొడుకుతో కలిసి వీధుల్లోకి వెళ్లి పంచిన రోజులను గుర్తు చేసుకున్నారు.
"పేదవాళ్లం కావడం వల్ల చదువునే పరిస్థితి లేకపోయింది. నా కొడుకు వెంకట శివసాయికుమార్ ను బీ.టెక్ చదివించా. ఇప్పుడు సెల్ ఫోన్ సర్వీసింగ్ సెంటర్ నడుపుతున్నాడు. నా భార్యతో కలిసి సంచార ఫాస్టుఫుడ్ నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిర్వహిస్తున్నా" అని ఆనందరావు వివరించారు.
ఈ తరహా సేవపై ఆనందరావు కొడుకు వెంకట శివసాయికుమార్ ఏమంటున్నారంటే..
" పెంచి, పెద్ద చేసిన తల్లిదండ్రులను కొడుకులు దూరం పెడుతున్నారు. ఇది చాలా తప్పు" అని కుమార్ వ్యాఖ్యానించారు. "అలాంటి వారికి బాధ్యతలు గుర్తు చేయాలి. అందుకే మా ఫౌండేషన్ పేరుకు ముందు 'డాడీ' అనే పదం చేర్చాలనే ఆలోచన వచ్చింది" అని కుమార్ వివరించారు. "ఇప్పటి వరకు మేము ఎవరి వద్ద చందాలు వసూలు చేయలేదు. చేయము కూడా. కనీసం అకౌంట్ తెరవలేదు. ఆ ఆలోచన లేదు" అని కుమార్ తేల్చిచెప్పారు.
Next Story