మొంథా తుపాను.. ప్రాజెక్టుల కరువు తీర్చింది...
x
తంబళ్లపల్లె సమీపంలో పెద్దేరు ప్రాజెక్టు

మొంథా తుపాను.. ప్రాజెక్టుల కరువు తీర్చింది...

అత్యవసర సేవలకు సర్వ సంసిద్ధంగా ఉన్న జిల్లా యంత్రాంగం.


మొంథా తుపాను వల్ల నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ ఫ్లాష్ ఫ్లడ్ (Flash Flood) తోపాటు ఎల్లో అలెర్ట్ (Yellow Alert) హెచ్చరిక జారీ చేసింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తీవ్ర ప్రభావం కనిపించలేదు.

మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మైనర్, మేజర్ నీటి ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. కరువుకు నిలయమైన మదనపల్లె, తంబళ్లపల్లె, కడప జిల్లా రాయచోటిలోని మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి.


మదనపల్లె డివిజన్ లోని తంబళ్లపల్లె దశాబ్దాల కాలంగా కరువుకు నిలయంగా ఉంది. అలాంటి ప్రదేశంలో నిర్మించిన పెద్దేరు డ్యాం నిండుకుండలా మారింది. గేట్లు ఎత్తివేయడం వల్ల దిగువకు ప్రవహిస్తున్న నీటిని చూస్తున్న ఆ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మొంథా తుపాను తీరం దాటే సమయంలో 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు, కుంభవృష్టి వర్షాలు కురిసే అవకాశం ఉందనే వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికారులను సమన్వయం చేయడానికి ప్రత్యేక అధికారులను కూడా నియమించారు.

జలశయాలను స్వయంగా పరిశీలిస్తున్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వెంకటేశ్వర్

తిరుపతి జిల్లాలో ప్రధానంగా సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాల్లోని తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ సూచనలు జారీ చేశారు. చేపలవేటకు వెళ్లవద్దని జాలర్లకు సూచించాురు. తుఫాను సహాయ చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం తిరుపతి జిల్లాకు ప్రత్యేకంగా కోటి రూపాయలు నిధులు కేటాయించిందని కలెక్టర్ వెంకటేశ్వర చెప్పారు.

తిరుపతి జిల్లా బంగాళాఖాతానికి సమీపంలో అంటే చెన్నై తో పాటు నెల్లూరు తీర ప్రాంతానికి సమీపంలో ఉండడం వల్ల తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో 28 29వ తేదీల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. సహాయక చర్యలు, పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి అన్ని శాఖలను అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు చెప్పారు.
"తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాల్లోని తీరప్రాంతాల వద్ద నిఘా ఉంది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళకండి" అని కలెక్టర్ వెంకటేశ్వర్ సూచించారు.
కంట్రోల్ రూంల ఏర్పాటు
తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం: 0877-2236007
తిరుపతి ఆర్డీవో కార్యాలయం: 7032157040
శ్రీకాళహస్తి ఆర్డీవో కార్యాలయం, శ్రీ కాళహస్తి: 8555003504
గూడూరు ఆర్డీవో కార్యాలయం: 08624-252807,8500008279
సూళ్ళూరుపేట ఆర్డీవో కార్యాలయం: 08623295345
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణలో 24/7 పనిచేసే టోల్ ఫ్రీ నెంబర్లు : 112, 1070, 1800 425 0101 లకు కాల్ చేయవచ్చని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వెంకటేశ్వర్ సూచించారు.
తిరుపతి జిల్లాలో ప్రధానమైన వాటిలో స్వర్ణముఖి నదికి దిగువ భాగంలో గూడూరు రెవెన్యూ డివిజన్ వాకాడ వద్ద ఉన్న బ్యారేజీని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పరిశీలించారు. వరదనీటి ప్రవాహం ఇన్ఫ్లో అవుట్ లో వివరాలను నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షించారు. వాకాడు మండలం బాలిరెడ్డి పాలెం వద్ద గతంలో దెబ్బతిన్న చెరువు కట్ట కూడా పరిశీలించిన కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులకు ప్రత్యేకంగా సూచనలు జారీ చేశారు. చెరువుకట్ట వల్ల గ్రామాలకు ఇబ్బంది లేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు
గతం నేర్పిన పాఠాలతో..
2020 లో కూడా జిల్లాలో భారీ వర్షాలు బలమైన గాలుల కారణంగా చెట్లు నేలకూలాయి. విద్యుత్ అంతరాయం ఏర్పడింది. వాగులో వంకలు పొంగి ప్రవహించడంతో రాకపోకలు కూడా స్తంభించాయి
2023 లో వచ్చిన నిజాం తుఫాను కారణంగా చిత్తూరు జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాలు కురిసాయి. గూడూరు వద్ద రైల్వే ట్రాక్ కొట్టుకుపోయిన నేపథ్యంలో రైళ్లు కూడా రద్దయ్యాయి. తిరుపతి జిల్లాలో ప్రవహించే స్వర్ణముఖి నదికి భారీ వరద నీరు రావడం వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆ రోజుల్లో వచ్చిన తుఫానుకు దీటుగా మొంథా తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, రాయలసీమలో 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమయ్యారు.
తిరుపతి నగరంలో కూడా నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య విస్తృతంగా పర్యటిస్తున్నారు. కాలువల్లో చెత్తాచెదారాలను తొలగించడంతోపాటు తిరుమలగిరుల నుంచి వచ్చే నీటి ప్రవాహం వల్ల నగర ప్రజలకు ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. నగరంలో లోతట్టు ప్రాంతాలుగా ఉన్న గొల్లవాని గుంట కొరమీను గుంట పూలమాని గుంట, అప్పన్న కాలనీ తోపాటు ఇతర అనేక ప్రాంతాలను పరిశీలించారు.
"తుఫాన్ వల్ల ఎలాంటి వాళ్ళు ఎదురైనా ఎదుర్కోవడానికి యంత్రాంగం సిద్ధంగా ఉంది. బాధితులకు అండగా నిలవడానికి కేంద్రాలు ఏర్పాటు చేశాం. నీరు ఆహారం వసతి ఏర్పాట్లకు సమస్య లేదు" అని నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య చెప్పారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ఆమె చెప్పారు.
తిరుపతి ప్రజలకు ఎలాంటి అత్యవసర సేవలు అవసరమైన 0877 2256766, 90008 22909 నంబర్లకు ఫోన్ చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య సూచించారు.
మేము సైతం..
తుపాను కారణంగా ప్రజలకు అత్యవసర సేవలు అందించడానికి పోలీస్ శాఖ కూడా సిద్ధంగా ఉందని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు చెప్పారు.
"అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప వర్షంలో బయటికి రావద్దు. ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోండి. వాగులో వంకల వద్దకు పిల్లలు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించండి_ అని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు సూచించారు. ఈత కోసం వెళ్లి నలుగురు బాలురు స్వర్ణముఖి నది ప్రవాహంలో కొట్టుకుపోయి మరణించిన సంఘటనను ఆయన గుర్తు చేశారు.
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలం అరగొండ గ్రామం వద్ద బహుద నదిలో నీటి ఉధృతికి వంతెన కొట్టుకుపోయింది. దీంతో ఐదు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ జిల్లా కలెక్టర్ తో మాట్లాడడం ద్వారా తాత్కాలికంగా వంతెన ఏర్పాటు చేసి జనజీవన రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు.
ప్రాజెక్టులకు జలకళ.. గేట్లు ఎత్తివేత

తిరుమల గోగర్భం డ్యాం వద్ద జలపూజ చేస్తున్న టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు

వంట తుఫాను కారణంగా రాయలసీమలోని అనేక సేద్యపు నేటి ప్రాజెక్టులు జలకల సంతరించుకున్నాయి. దీంతో నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రధానంగా తిరుమలలో యాత్రికుల నిత్యావసరాలు తీర్చే నాలుగు డ్యాములు వర్షపు నీటితో తొణికిసలాడుతున్నాయి.

"రానున్న వేసవికి కూడా తాగునీటికి ఇబ్బంది ఉండదు" అని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు చెప్పారు. తిరుమ‌ల‌కు 215 రోజుల తాగునీటి అవ‌స‌రాల‌కు స‌రిపోతాయని తెలిపారు.
తిరుమలలో పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి. ఐదు జలాశయాల్లోకి నీరు చేరుకుంటోంది. గోగర్భం డ్యామ్ పూర్తిగా నిండిపోవడంతో ఒక గేటును తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు.
1) పాపవినాశనం డ్యాం
Full reservoir level (FRL ) 697.14 మీటర్లు
నీటి నిలువ 696.05 మీటర్లకు చేరింది.
నిల్వ సామ‌ర్థ్యం : 5240.00 ల‌క్ష‌ల గ్యాలన్లు
ప్ర‌స్తుత నిల్వ : 4890.65 ల‌క్ష‌ల‌ గ్యాలన్లు
2) గోగర్భం డ్యాం
FRL :- 2894.00 అడుగులు
ప్రస్తుతం: 2893.80 అడుగులు
నిల్వ సామ‌ర్థ్యం : 2833.00 ల‌క్ష‌ల గ్యాలన్లు
ప్ర‌స్తుత నిల్వ :- 2804.89 ల‌క్ష‌ల‌ గ్యాలన్లు
3) ఆకాశగంగ డ్యాం:
FRL :- 865.00 మీటర్లు
863.10 మీటర్లు
నిల్వ సామ‌ర్థ్యం:685.00 ల‌క్ష‌ల‌ గ్యాలన్లు
ప్ర‌స్తుత నిల్వ:537.00 ల‌క్ష‌ల‌ గ్యాలన్లు
4) కుమారధార డ్యాం
FRL :- 898.24మీటర్లు
ప్రస్తుత 896.15 మీటర్లు
నిల్వ సామ‌ర్థ్యం :4258.98 ల‌క్ష‌ల‌ గ్యాలన్లు
ప్ర‌స్తుత నిల్వ :- 3739.05 ల‌క్ష‌ల‌ గ్యాలన్లు
5) పసుపుధార డ్యాం
FRL :- 898.24 మీటర్లు
ప్రస్తుతం 893.20 మీటర్లు
నిల్వ సామ‌ర్థ్యం:1287.51 ల‌క్ష‌ల గ్యాలన్లు
ప్ర‌స్తుత నిల్వ :- 548.16 ల‌క్ష‌ల గ్యాలన్లు
చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గంలో 26 చెరువులు నిండాయి. జిల్లా ప్రత్యేకాధికారి పీఎస్. గిరీషా, జిల్ల కలెక్టర్ సుమీత్ కుమార్ పరిశీలించారు. ఆత్మకూరు చెరువు మొరవ పటిష్టం చేయడానికి 20 లక్షల నుంచి 25 లక్షల రూపాయలు అవసరం అవుతాయని ఇంజినీర్ ఆనందరెడ్డి కలెక్టర్ కు వివరించారు.

ఆరణియార్ లో జలసవ్వడి..


తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని పిచ్చాటూరు మండలం వద్ద ఉన్న అరణియార్ ప్రాజెక్టు నుంచి రెండు క్రస్టు గేట్లు ఎత్తి, 400 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు నీటి సామర్థ్యం 31 అడుగులకు ప్రస్తుతం 28.6 అడుగులకు తగ్గకుండా నీటిపారుదల శాఖ జాగ్రత్తలు తీసుకుంటున్నామని డి ఈ శ్రీనివాసులు తెలిపారు.

"ఈ సంవత్సరం కూడా ప్రాజెక్టు నిండింది. గేట్లు ఒక అడుగు మాత్రమే తెరిచాం. ప్రమాదాలు ఆస్కారం లేకుండా పర్యవేక్షిస్తున్నాం" అని నీటిపారుదల డీఈ శ్రీనివాసులు స్పష్టం చేశారు.
కరువుపల్లెల్లో ఆనందం..
చిత్తూరు జిల్లా (అన్నమయ్య జిల్లా)లోని కరువు ప్రాంతాలకు నిలయంగా ఉన్న మదనపల్లె, తంబళ్లపల్లె నియోజవర్గాలను మొంథా తుపాను కాస్త కరుణించింది. రెండు ప్రధాన మైనర్ ప్రాజెక్టులు నిండాయి. చెరువులకు జీవం వచ్చింది. మినహా తుపాను ప్రభావ కనిపించలేదు.

మదనపల్లె నియోజకవర్గం నిమ్మనపల్లెకు సమీపంలోని బాహుదా డ్యాం సామర్థం 398.6 ఎంటీఎఫ్టీలు. ఇది గరిష్ట స్థాయికి నీరు చేరింది. దీంతో 100 క్యాసెక్కులు ఇన్ ఫ్టో ఉంటే, అడుగు మేర రెండు గేట్లు తెరవడం ద్వారా వంద క్యెసెక్యులు దిగువకు వదులుతున్నారు. ఎగువప్రాంతం నుంచి వస్తున్న వరదనీటిని నిలపడం సాధ్యం కావడం లేదు.
అన్నమయ్య జిల్లా గాలివీడు మండల సమీపంలోని వెలిగల్లు జలాశయం కూడా నిండింది. జలాశయం సామర్థ్యం 4.64 టీఎంసీలకు ప్రస్తుతం 3.74 టీఎంసీలు నీరు నిలువ ఉంది. ఎగువ నుంచి 800 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో ఉంది. ఒక గేటు తెరవడం ద్వారా 729 క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
అన్నమయ్య జిల్లా రాయచోటి సమీపంలోని పింఛా డ్యాం నుంచి 3,200 క్యూసెక్కుల నీటిని దిగువ భాగంలోని చెయ్యేరు నదిలోకి విడుదల చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటల పరిస్థితిని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పి.చంగల్ రాయుడు వెల్లడించారు.
"ప్రాజెక్టుకు దిగువన ఉన్న 12 గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండండి. పుకార్లు నమ్మవద్దు" అని ఏఈ చంగల్ రాయుడు సూచించారు.
"పింఛా డ్యాం సామర్థ్యం 4,113 క్యూసెక్కులు. మొదటి గేటు రెండు అడుగులు ఎత్తి 2,520 క్యూసెక్కులు, మూడో గేటు 1.75 అడుగుల మేరకు తెరవడం ద్వారా 2,210 క్యూసెక్కులతో కలిపి మొత్తం అవుట్ ఫ్లో 4730 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నాం" అని నీటిపారుదల శాఖ ఏఈ చంగల్ రాయుడు చెప్పారు.
Read More
Next Story