
కడప రిమ్స్ జనరల్ ఆస్పత్రి (ఫైల్)
Covid-3 |కడప:రిమ్స్ ఆస్పత్రిలో 'కోవిడ్ వార్డు"
కడపలో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
కరోనా మహమ్మారి మూడోసారి ప్రారంభమైంది. కడప జిల్లాలో ఓ పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులు అప్రమత్తం అయ్యారు. అందుకు ప్రధానంగా...
నంద్యాల జిల్లా చాగలమర్రి కి చెందిన ఓ మహిళ జ్వరంతో బాధపడుతూ కడప రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ఒళ్ళు నొప్పులు అధికంగా ఉండడంతో ఆమెకు అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఆమెకు కోవిడ్ పాజిటివ్ ఉందని నిర్ధారణ కావడంతో ప్రత్యేక వైద్యం అందించడంతో పాటు ఆస్పత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా,
రాయలసీమలోనీ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రులలో కరోనా పరీక్షలు నిర్వహించడంతోపాటు ఇది మరింత విస్తృతం కాకుండా ఉండే విధంగా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. ప్రభుత్వాసుపత్రిలో ప్రత్యేక వార్డులు కూడా ఏర్పాటు చేస్తున్నారు.
అప్రమత్తం చేసిన ఆరోగ్య శాఖ
ముందుగానే అప్రమత్తమైన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముందస్తు జాగ్రత్తలకు సిద్ధమైంది. కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని కుటుంబ సంక్షేమం, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ రెండు రోజుల కిందటే ఆదేశాలు జారీ చేశారు. కరోనా ప్రబలకుండా ముందుగానే ఏర్పాటు చేసుకోవాలని కూడా అందులో ఆదేశించారు. ప్రజలు కూడా వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ సూచనలు కూడా చారి చేశారు.
అప్రమత్తమైన కడప రిమ్స్ వైద్యులు జ్వరం, ఒళ్ళు నొప్పులతో బాధపడుతూ చికిత్స కోసం వచ్చిన చాగలమర్రి కి చెందిన మహిళకు kovid పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆసుపత్రి వైద్యులు అప్రమత్తమయ్యారు.
ప్రత్యేక వార్డు..
కరోనా కేసు నమోదు కావడంతో కడప రిమ్స్ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. ఆ మేరకు కడప రిమ్స్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెండ్ డాక్టర్ రమాదేవి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేేక వార్డులో పని చేయడానికి అవసరమైన సిబ్బందిని కూడా సంక్షిప్తం చేసినట్లు రిమ్స్ వైద్యాధికారులు చెప్పారు.
జిల్లాలో ప్రజలు కూడా వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచనలు చేశారు.
"సుమారు ౭౦ ఏళ్ల మహిళకు కోవిడ్ లక్షణాలు కనిపించాయి. నిర్ధారించుకోవడానికి శాపిల్స్ పరీక్షలకు పంపించాం" అని కడప రిమ్స్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెండ్ డాక్టర్ రమాదేవి 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ' ప్రతినిధికి చెప్పారు.
"ఇంకెవరికీ ఆ లక్షణాలు లేవు. ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు అందుబాటులో ఉంది" అని అని డాక్టర్ రమాదేవి స్పష్టం చేశారు.
ప్రధాన ఆస్పత్రిలో ఏర్పాట్లు
రాయలసీమలోని అన్ని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రుల్లో వైద్యాధికారులు సిబ్బంది అప్రమత్తమయ్యారు. జ్వరం, జలుబు వంటి సాధారణ లక్షణాలు ఉన్న రోగులకు టెస్టింగ్ చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. అందులో కడప ప్రభుత్వ ప్రధాన్ ఆసుపత్రి తో పాటు కర్నూలు, అనంతపురం, తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర రాం నారాయణ రుయా ఆసుపత్రి (SVRR government general hospital) లో కూడా ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు.
Next Story