అనంతలో సీఎం చంద్రబాబు పర్యటన
x

'అనంత'లో సీఎం చంద్రబాబు పర్యటన

ఆర్భాటాలకు ఆస్కారం లేకుండా ఏర్పాట్లు చేశారు. సామాజిక పింఛన్లు పంపిణీతో పాటు గ్రామ ప్రజలతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించనున్నారు.


అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజవర్గం బొమ్మనహాళ్ మండలం నేమకల్లు గ్రామంలో ఈ రోజు (శనివారం) మధ్యాహ్నం సీఎం. ఎన్. చంద్రబాబు పర్యటించనున్నారు. లబ్ధిదారులకు ఎన్టీఆర్ సామాజిక భరోసా పింఛన్లు పంపిణీ చేయడంతో పాటు గ్రామసభలో పాల్గొనే సీఎం చంద్రబాబు సమస్యలు కూడా స్వయంగా తెలుసుకుంటారు. నేమకల్లు గ్రామంలో హెలిప్యాడ్‌ స్థలాన్ని, ప్రసిద్ధి చెందిన శ్రీ ఆంజనేయస్వామి దేవాలయాన్ని, నేమకల్లులో గ్రామసభ నిర్వహించే ప్రాంతంలో ఏర్పాట్లను రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు, రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం పరిశీలించిన వారు ఏర్పాట్లు చేశారు.

టీడీపీ కూటమి ఏర్పడిన తరువాత ప్రతినెలా పింఛన్ల పంపిణీకి సీఎం చంద్రబాబు హాజరవుతున్నారు. గ్రామసభ ద్వారా ప్రజల సమస్యలు ఆలకిస్తున్నారు. అందులో భాగంగా నేమకల్లులో కూడా హంగూ ఆర్భాటాలకు దూరంగా గ్రామస్తులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించన్నారు. సమస్యలు చెప్పడానికి ఇదొక మంచి అవకాశమని ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు అన్నారు.
గ్రామస్తులకే పరిమితం
గతంలో సీఎంల పర్యటనలంటే వందల సంఖ్యలో బస్సులు ఏర్పాటు, వేల సంఖ్యలో డ్వాక్రా మహిళలను తరలించడం, పెద్దఎత్తున ఆర్భాటాలు జరుగుతుండేవి.
"వాటికి భిన్నంగా ఆ గ్రామ చావడి, రచ్చకట్ట వద్ద, దేవాలయంలోనో సామాన్యంగా ఏర్పాటు చేసుకుంటున్న ఈ కార్యక్రమం ఇప్పటిదాకా విజయవంతంగా నడుస్తోంది" అని ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్, విప్ కాలువ శ్రీనివాసులు చెప్పారు. పొరుగు ప్రాంతాల నుంచి నాయకులు, పార్టీ శ్రేణులు, ప్రజలను రావద్దని చెప్పడానికి ఇబ్బందికరంగా ఉందన్నారు. గ్రామం యూనిట్ గా సమస్యలు తెలుసుకోవాలనే సీఎం చంద్రబాబు ఆలోచనలు అర్థం చేసుకోవాలని వారు కోరారు.
రాయదుర్గం నియోజకవర్గ అభివృద్ధికి బైరవానితిప్ప ప్రాజెక్టు, హెచ్ఎల్సీ రిపేర్లు, రహదారులు, ఇతర అనేక ప్రాజెక్టు సమస్యలపై సీఎం చంద్రబాబుకు వివరించనున్నట్లు ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు.
గ్రామంలో ఏర్పాట్ల పరిశీలన

రాయదుర్గం నియోజకవర్గం నేమకల్లు గ్రామంలో ఏర్పాట్లును రాష్ట్ర సెర్ప్ సీఈవో వీరపాండ్యన్, అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తదితరులు పరిశీలించారు. నేమకల్లులో గ్రామసభ నిర్వహించే ప్రదేశంతో పాటు సీఎం చంద్రబాబు గ్రామస్తులతో చర్చించడానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు.
సీఎం పర్యటన షెడ్యూల్‌..

శనివారం ఉదయం 11 గంటలకు: తాడేపల్లిలోని నివాసం నుంచి రోడ్డు మార్గాన విజయవాడ విమానాశ్రాయానికి బయలుదేరుతారు.

11.35: విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో బయలుదేరి మధ్యాహ్నం

12.25 గంటలకు కర్ణాటకలోని జిందాల్ విజయనగర విమానాశ్రాయానికి చేరుకుంటారు.

12.45: హెలిక్యాప్టర్‌లో నేమకల్లు హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.

12.50 గంటల నుంచి 1.20 రిజర్వుడు

1.20 నుంచి హెలిపాడ్ నుంచి నేమకల్లు గ్రామం ఇందిరమ్మ కాలనీకి చేరకుంటారు.

01.25 నుంచి 1.55 వరకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు లబ్ధిదారులకు ఇళ్ల వద్ద పంపిణీ చేస్తారు.

0155 నుంచి 2.00 వరకు నేమకల్లులోని ఆంజనేయస్వామి వారి ఆలయంలో పూజలు

2.05 నుంచి 3.05 వరకు గ్రామస్తులతో ముఖామఖి

03.10 నేమకల్లు గ్రామం నుంచి బొమ్మనహాళ్ వరకు రోడ్డు మార్గంలో చేరుకుంటారు.

03.15 నేమకల్లు హెలిపాడ్ కు చేరుకుంటారు.

03.15 నుంచి 03.45 వరకు ప్రజాప్రతినిధులతో మాటామంతీ.

03.45 హెలికాప్టర్ లో బయలుదేరుతారు.

04.05 కు కర్ణాటకలోని తోరగల్లులోని జిందాల్ విమానాశ్రయానికి చేరుకుంటారు.

04.50కి విజయవాడ విమానాశ్రయం

04.55 విమానాశ్రయం నుంచి బయలేదేరి

05.30 ఉండవల్లిలోని నివాసానికి చేరుకుంటారు.

Read More
Next Story