Naravaripalli | సొంత ఊరికి సీఎం చంద్రబాబు
x

Naravaripalli | సొంత ఊరికి సీఎం చంద్రబాబు

తమ్ముడు రామ్మూర్తి సంవత్సరీకం. నారావారిపల్లెలో అసాధారణ భద్రత


చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని సొంత ఊరు నారావారిపల్లెకు సీఎం నారా చంద్రబాబు ఇంకొద్ది సేపట్లో ( మంగళవారం) చేరుకొనున్నారు. జిల్లా అధికారులు ఈసారి పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

సీఎం చచంద్రబాబు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు మరణించి ఈరోజుకు 11 నెలలు కావస్తోంది. వారి ఇంటి ఆచారం ప్రకారం విస్తర కార్యక్రమం అంటే సంవత్సరీకం నిర్వహించడానికి ఏర్పాట్లు జరిగాయి. నారా రామమూర్తి నాయుడు చంద్రగిరి నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. ఈయన సీఎం చంద్రబాబుకు స్వయానా తమ్ముడు.
కొన్ని గంటలే మకాం..
సీఎం చంద్రబాబు ఉండవల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మొదటిసారి శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సమీపంలోనే ఉన్న ఏ రంగంపేట వద్ద కు చేరుకోనున్నారు. కొన్ని గంటలు మాత్రమే సీఎం చంద్రబాబు నారావారిపల్లెలో గడిపే అవకాశం ఉంది. రంగంపేట హెలిపాడ్ నుంచి నారావారిపల్లెకు చేరుకునే చంద్రబాబు ఉత్తమ ఇంటర్ జరిగే కార్యక్రమాల్లో పాల్గొని మధ్యాహ్నం రెండు గంటలకు ఉండవెల్లికి తిరిగి వెళతారని అధికార వర్గాల సమాచారం. బాబాయ్ సంవత్సరీకం లో శ్రద్ధాంజలి ఘటించడానికి సీఎం చంద్రబాబు కొడుకు, మంత్రి నారా లోకేష్ సోమవారం రాత్రి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని, నారావారిపల్లెకు వచ్చారు.
నారా రామమూర్తి నాయుడు సంవత్సరీకం, కర్మ క్రియలు నిర్వహించడానికి ఆయన భార్య నారా ఇందిర, కొడుకులు నారా గిరీష్, నారా రోహిత్ సోమవారం సాయంత్రమే నారావారిపల్లెకు వచ్చారు.
కట్టుదిట్టమైన భద్రత
సీఎం నారా చంద్రబాబు రాక నేపథ్యంలో ఈసారి జిల్లా పోలీసులు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. సీఎం కోసం ఏర్పాటుచేసిన హెలిపాడ్, నారావారి పల్లెలో కూడా తిరుపతి ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు భద్రత ఏర్పాటను మరింత కటికలు చేశారు
ఈమెయిల్ బెదిరింపుతో..
స్వగ్రామం నారావారిపల్లెకు సీఎం చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో "సీఎం దిగాల్సిన హెలిప్యాడ్ పేల్చి వేస్తాం"అనే హెచ్చరికలు పోలీసులను మరింత అప్రమత్తం చేశాయి.
శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ విద్యాలయం సమీపంలో సీఎం కోసం ఎలిఫెంట్ ఏర్పాటు చేశారు. దీనిని పేల్చి వేస్తాం అంటూ విశ్వవిద్యాలయం అసోసియేట్ డీన్ రెడ్డిశేఖర్ కు ఓ ఈమెయిల్ అందింది. వేకువజామున సుమారు మూడు గంటల ప్రాంతంలో వచ్చిన ఈ మెయిల్ ను గమనించిన డీన్ రెడ్డి శేఖర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. మరింత అప్రమత్తమైన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు సిబ్బందిని అలర్ట్ చేశారు. హెలిపాడ్ తో పాటు అన్ని ప్రాంతాలలో బాంబు, డాగ్ స్వ్కాడ్ బృందాలు ముమ్మరంగా గాలించాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీఎం చంద్రబాబు పర్యటన సాఫీగా సాగడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ సుబ్బారాయుడు చెప్పారు.


Read More
Next Story