
కుప్పం ప్రజావేదిక నుంచి మాట్లాడుతున్న సీఎం ఎన్. చంద్రబాబు
CM Chandrababu | 'ఆంధ్రాలో ఇక రౌడీల తోక కత్తిరించడమే!'
వైసిపి నేతలు రాక్షసులుగా మారారని సీఎం చంద్రబాబు వ్యాఖ్య.
రాష్ట్రాభివృద్ధి కోసం యజ్ఞం చేస్తున్నామని సీఎం ఎన్. చంద్రబాబు చెప్పారు. కూటమి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ యజ్ఞానికి వైసిపి నాయకులు రాక్షసులుగా మారారని ఆయన వ్యాఖ్యానించారు. Ycp నాయకుల పై యుద్ధం సాగిస్తూనే, పేదలకు సంక్షేమ ఫలాలు అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
కుప్పం నియోజకవర్గంలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు బుధవారం సాయంత్రం శాంతిపురం మండలం మోడల్ స్కూలు వద్ద నిర్వహించిన ప్రజావేదిక నుంచి మాట్లాడారు.

తన రాజకీయ ప్రయాణంలో ఎప్పుడూ కూడా శవరాజకీయాలు చేయలేదని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. బాబాయ్ ని చంపి ఆ కత్తి నా చేతిలో పెట్టాలని వైసిపి అధ్యక్షుడు జగన్ ప్రయత్నించాడు. నారాసుర రక్తచరిత్ర అని ప్రచారం చేసుకున్న తీరును సీఎం చంద్రబాబు ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. వైసిపి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాటం సాగిస్తానని ఆయన హెచ్చరించారు. అభివృద్ధి ఓ పాటు సంక్షేమాన్ని కూడా అమలు చేయడం ద్వారా పేద ప్రజలకు ఆ ఫలితాలు అందిస్తానని ఆయన వాగ్దానం చేశారు.
వైసీపీపై సెటైర్లు
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేసినట్లు సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. వైసీపీ పాలనకు భిన్నగా తల్లికివందనంలో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ వర్తింపచేశామన్నారు. రైతు భరోసా త్వరలో ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. కేంద్రం ఇచ్చే రూ. నాలుగు వేలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 14 వేలు కలిపి 20 వేలు చెల్లిస్తామన్నారు. పింఛన్ల మొత్తం పెంచడంలో వైసీపీకి ఐదేళ్లు పడితే, అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు రెట్టింపు పింఛన్లు ఇస్తున్న విషయాలను గమనించాలని ఆయన ప్రజలకు సూచించారు. అయినా, ఏమాత్రం ఆలోచన లేకుండా టీడీపీ కూటమిపై విమర్శలు చేయడం చూస్తుంటే, వైసీపీ వారికి యజ్ణంలో నీళ్లు పోయడానికే ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తోక కత్తిరిస్తా
రాష్ట్రంలో ఎవరైనా సరే రౌడీ అని చేస్తే సహించేది లేదని సీఎం చంద్రబాబు ఘాటుగా హెచ్చరించారు. అలాంటి వ్యక్తులకు అదే చివరి రోజు కూడా ఆయన పునరుద్ఘాటించారు.
"రౌడీయిజం చేయాలనే వారి ఆటలు తన వద్ద సాగవు వారి తోకలు కత్తిరిస్తా" అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
మారనున్న కుప్పం రూపురేఖలు
కుప్పంలో అభివృద్ధి మరింత పరుగులు పెట్టిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అందులో భాగంగా కుప్పం రైల్వే స్టేషన్ ఆధునీకరిస్తాం, చెన్నైకి, బెంగళూరుకు వెళ్లే వారికి మరింత సౌకర్యంగా ఉంటుందన్నారు.
సీఎం చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే..
"పలమనేరు నుంచి కృష్ణగిరి రహదారికి నాలుగు లేన్ల రహదారి వేస్తున్నాం. కుప్పం నుంచి హోసూర్ వరకూ మరో సమాంతర రహదారి నిర్మిస్తాం" అని చెప్పారు. దీనివల్ల కృష్ణగిరి, బెంగళూరు, కోలార్ ,చెన్నై లకూ మధ్య కేంద్రంగా కుప్పం మారుతుందని వివరించారు. అభివృద్ధి కార్యక్రమాల వల్ల కుప్పం మార్చడానికి ఓ అద్భుతమైన కార్యకర్తలు తయారుచేసినట్లు ఆయన వెల్లడించారు.
Next Story