నారావారిపల్లెలో ప్రజల వద్దకు పాలన
x
నారావారిపల్లెలో వినతిపత్రాలు స్వీకరిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు

నారావారిపల్లెలో ప్రజల వద్దకు పాలన

తన నివాసం వద్ద వినతులు స్వీకరించిన సీఎం చంద్రబాబు


సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి సొంత ఊరు నారావారిపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సోమవారం రాత్రి బస చేశారు. సమస్యలు చెప్పడానికి వచ్చిన వారిని నిరుత్సాహ పరచకుండా యథావిధిగానే ఆయన ప్రజల వద్దకు వచ్చారు. మంగళవారం ఉదయం యథావిధిగానే వినతులతో భారీగా నారావారిపల్లెలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి వద్దకు భారీగా ప్రజలు చేరుకున్నారు.


పండుగ సంబరాలు ఒకపక్క. తన కోసం వచ్చిన సందర్శకులు క్యూలో నిలబడిన ప్రజల వద్దకు ఆయన వచ్చారు. ప్రజల నుంచి సమస్యలపై వినపతిపత్రాలు స్వీకరించడంలో మొదటిరోజు మధ్యాహ్నం వరకు నారావారిపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు బిజీగా గడిపారు. ప్రజలతో మమేకం కావడానికే మొదట ప్రాధాన్యత ఇచ్చారు.


ప్రజల నుంచి తీసుకున్న వినతిపత్రాలను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పరిష్కారం దిశగా ఆదేశాలు జారీ చేశారు. పక్కనే ఉన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వెంకటేశ్వర్ కు వినతిపత్రాలు సిఫారసు చేసి, త్వరగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలన్నారు.

"ఇంటికి వచ్చిన మా చంద్రబాబు ప్రజల వద్దకు పాలన సాగించడం ప్రత్యేకత" అని గ్రామస్తులు కూడా ఆనందం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు రాక నేపథ్యంలో నారావారిపల్లెలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఈ భద్రతా వలయం నుంచే ప్రజల వద్దకు వచ్చిన అందరి నుంచి వినతిపత్రాలు తీసుకున్నారు.
Read More
Next Story