
పుట్టపర్తిలో ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు
భావితరాలకు సత్యసాయి 5.o సంకల్పం మార్గం కావాలి..
పుట్టపర్తి వేడుకల్లో సీఎ చంద్రబాబు
సత్యసాయి నమ్మింది ఒకటే సిద్ధాంతం. మానవ సేవే మాధవ సేవ అనేది ఆయన జీవితం. అదే ఆయన సందేశం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గుర్తు చేశారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మన కాలంలో ప్రత్యక్షదైవ స్వరూపంగా ప్రజలకు ప్రేమ, సేవ, శాంతి, సౌభాగ్యం మార్గాన్ని చూపించిన మహానుభావుడు. “Love All – Serve All”, “Help Ever – Hurt Never” అనే ఆయన మాటలు విశ్వశాంతి, సర్వజనుల సంక్షేమం అనే ఆయన సంకల్పాన్ని ప్రతిబింబిస్తాయని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు.
పుట్టపర్తి అనేది పుణ్యభూమి ఒకటే కాదు. కర్మభూమి కూడా అని ఇలాంటి ప్రదేశంలో భగవాన్ శ్రీసత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగ నిర్వహించడం గౌరవంగా భావిస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు.
సత్యసాయి ప్రబోధాల్లో ప్రపంచంలోని కోట్లాది మందిని ప్రభావితం చేసిన 5.o సూత్రాలు అనుసరణీయమని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. సత్యసాయి చెప్పిన మాటల్లో
1. One Religion – Love
2. One Language – Heart
3.One Caste – Humanity
4. One Law – Duty
5. One God – Omnipresent
"ఈ మాటలతో ప్రపంచానికి సత్యసాయి ఇచ్చిన సందేశం ఓ దిక్సూచి" అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గుర్తు చేశారు. నాస్తికులను కూడా ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపించిన సత్యసాయి సమ్మోహన శక్తి ప్రపంచంలో అరుదైనదని అన్నారు. వందలాది దేశాల నుంచి వచ్చిన భక్తులందరికీ ఆయన దివ్య అనుగ్రహం లభించింది. పేదల నుంచి అగ్ర కులాల దాకా, సామాన్యుల నుంచి ప్రపంచ నాయకుల వరకు అందరి బాధలు వినడం, పరిష్కార మార్గం చూపడం సత్యసాయికి ధర్మమైందని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వాలకు మించి సత్యసాయి వేగంగా స్పందించడం ద్వారా పాలకులు చేయలేని పనులు కూడా సత్యసాయి సంస్థల ద్వారా చేసి చూపించారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. 102 విద్యాసంస్థల్లో 60 వేల మంది విద్యార్థులకు ఉచిత, విలువల ఆధారిత విద్య బోధించడం అనేది చారిత్రాత్మకం అన్నారు. రెండు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, రెండు జనరల్ హాస్పిటల్స్, రెండు మొబైల్ హాస్పిటల్ ద్వారా రోజుకు మూడు వేల మంది రోగుల ఆరోగ్యానికి భద్రత కల్పించడం సామాన్య విషయం కాదని సీఎం చంద్రబాబు అన్నారు.
సీఎం చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే..
"భూమిపై మనకు తెలిసిన, మనం చూసిన దైవ స్వరూపం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. ప్రేమ, సేవ, ప్రశాంతత, పరిష్కారానికి బాబా ప్రతిరూపం. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్ అనేమాటలతో శ్రీసత్యసాయి మనకు చూపిన దారి అని సీఎం చంద్రబాబు అన్నారు. విశ్వశాంతి, విశ్వ సౌభాగ్యం, సకల జనుల సంతోషం అనే భావనతో సత్యసాయి జీవించారనీ, మానవ సేవే మాధవ సేవ అని నమ్మడం తోపాటు బోధించడం, ఆచరించారు. ఫలితం చూపించారు" అని బాబా సేవలను సీఎం చంద్రబాబు గుర్తు చేశారు.
ప్రశాంతి నిలయం కుదవ పెట్టాలని...
పుట్టపర్తిలో సత్యసాయిని కలిసిన అనేక సందర్భాల్లో జరిగిన సంభాషణలను సీఎం చంద్రబాబు నెమరు వేసుకున్నారు.
"బాబాతో నాకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ట్రస్ట్ కార్యక్రమాలపై పలుమార్లు నాతో చర్చించారు.
రాయల సీమ ప్రజలకు తాగునీరు అందించడానికి ప్రశాంతి నిలయాన్ని తాకట్టుపెట్టి అయినా ప్రాజెక్టును పూర్తి చేయాలనుకున్నారు. ఈ విషయం తెలిసి భక్తులు ముందుకు వచ్చి కోట్లాది రూపాయలు విరాళంగా ఇచ్చారు. రూ.550 కోట్లు ఖర్చు పెట్టి ఏపీ, తెలంగాణ, తమిళనాడులో 1600 గ్రామాలు, 30 లక్షలకు పైగా జనాభాకు నీరిచ్చారు. చెన్నై డ్రింకింగ్ వాటర్ మోడర్నైజేషన్ స్కీంకు రూ.250 కోట్లు ఖర్చు పెట్టారు" అని గుర్తు చేసిన సీఎం చంద్రబాబు సత్యసాయి స్ఫూర్తిని, ఆయన చూపిన మార్గాన్ని భవిష్యత్ తరాలకు అందించా ల్సిన ప్రత్యేకతను ప్రస్తావించారు.
"సత్యసాయి బాబా ప్రజాసేవలో చూపిన వేగం, ఆయన సంకల్ప శక్తి, ఆయన కరుణామూర్తి స్వభావం ప్రపంచానికి ఆదర్శం. పేదల కోసం, నీటి కోసం, ఆరోగ్య కోసం, విద్య కోసం చేసిన సేవలకు ఎటువంటి సాటిలేదు" అని సీఎం చంద్రబాబు సత్యసాయి చేసిన సేవలను కీర్తించారు. శతజయంతి ఉత్సవంలో కేంద్ర ప్రభుత్వం భగవాన్ సత్యసాయి బాబా గౌరవార్ధం ప్రత్యేక రు.100 నాణెం, తపాలా బిళ్లలు విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు.
ప్రధానిపై ప్రశంసలు
సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కావడం, ఆశీస్సులు తీసుకోవడం అనేది బాబాతో ఆయనకు ఉన్న ఆత్మీయ బంధాన్ని స్పష్టం చేస్తుందని సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోదీ రావడం అనేది సత్యసాయి సిద్ధాంతానికి, సేవా కార్యక్రమాలకు మరింత శక్తి నింపిందని అన్నారు. సత్యసాయి ట్రస్ట్, సేవాదళ్ కార్యకర్తలు సత్యసాయి బోధించిన ప్రేమ, సేవ, ధర్మం, శాంతి సిద్ధాంతాలను మరింత విస్తరించడం ద్వారా భక్తులు భవిష్యత్ తరాలకు మార్గాన్ని చేరవేయాలని సీఎం చంద్రబాబు కర్తవ్య బోధ చేశారు.
Next Story

