TDP MAHAANADU |అవినీతిపరులను వదిలేదు లేదు.. సీఎం చంద్రబాబు
x
మహానాడు ప్లీనరీలో మాట్లాడుతున్న సీఎం ఎన్. చంద్రబాబు

TDP MAHAANADU |అవినీతిపరులను వదిలేదు లేదు.. సీఎం చంద్రబాబు

కడపలో మహానాడులో వైసిపి నేతలకు సీఎం చంద్రబాబు ఘాటు హెచ్చరిక జారీ చేశారు.


అవినీతిపరులను వదిలిపెట్టే సమస్య లేదని సీఎం చంద్రబాబు ఘాటుగా హెచ్చరించారు. ఐదేళ్లపాటు రాష్ట్రంలో విధ్వంస పాలన సాగించిన వైసిపి నేతల దోపిడి, అవినీతిని నెగ్గు తేలుస్తామని చేసి చెప్పారు. ప్రజల సొమ్మును స్వాహా చేసిన నాయకులు నుంచి ప్రతి పైసా కక్కిస్తామని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు.

కడపలో జరుగుతున్న టిడిపి 43వ మహానాడు ప్లీనరీని జాతీయ అధ్యక్షుని హోదాలో సీఎం ఎన్ చంద్రబాబు పార్టీ నివేదికన సమర్పించారు. టిడిపి ఆవిర్భావం నుంచి ఎదుర్కొన్న సవాళ్లను, అధిగమించిన తీరును ప్రస్తావిస్తూ కార్యకర్తల త్యాగాలను ప్రస్తుతించారు. ఇదే సమయంలో అవినీతి నిర్మూలనపై ఆయన చేసిన వ్యాఖ్యానాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
కడప నుంచి వైసీపీకి సవాళ్లు
రాష్ట్రంలో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే నమోదైన కేసుల్లో ఐపీఎస్, ఐఏఎస్ అధికారులతో పాటు మాజీ సీఎం వైయస్ జగన్ కోటరీలో కీలకంగా వ్యవహరించిన విశ్రాంత అధికారులు, మాజీ మంత్రులు కూడా రిమాండ్కు వెళ్లారు. ఆ కోవలో తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా ఒకరు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి రాజకీయ అవినీతిపై అవిశ్రాంతంగా పోరాటం చేసిన విధానాన్ని సీఎం చంద్రబాబు టిడిపి మహానాడులో ఆవిష్కరించారు.
1984లో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమానికి టిడిపి తెరతీసిన విషయాన్ని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. ఆ తర్వాత 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అవినీతిపై "రాజా ఆఫ్ కరప్షన్స్"పై టిడిపి ఏకంగా యుద్ధమే ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఆశ్రితపక్షపాతం, అవినీతికి అంతులేకుండా వైఎస్. రాజశేఖర్ రెడ్డి పాలన సాగించాలని వ్యాఖ్యానించారు.
ఓబులాపురం మైనింగ్ వ్యవహారంలో టిడిపి ఫిర్యాదుల నేపథ్యంలోనే సిబిఐ కూడా రంగంలోకి దిగిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేస్తూ, ఈ కేసులో ఓఎంసీ అధినేత, ఇంకొందరికి శిక్ష పడిన విషయాన్ని ప్రస్తావించారు.
"విచారణ ఆలస్యం కావచ్చేమో, శిక్షలు మాత్రం తప్పవు" అనే విషయం ఓఎంసి ( Obulapuram Mining Company OMC ) కేసు స్పష్టం చేసిందన్నారు. ఇందులో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు సాగించిన పోరాటం, త్యాగాలు అభినందించక తప్పదు అన్నారు
"రాష్ట్రంలో వైసీపీ పాలన వ్యర్ధంసకరంగా సాగింది. వీరిని ఉపేక్షించే సమస్య లేదు" చంద్రబాబు చెప్పారు. ఈ అవినీతి అక్రమాలకు వంద పాడిన ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదని ఆయన తేల్చి చెప్పారు.
కడప అడ్డాగా నిర్వహిస్తున్న టిడిపి మహానాడులో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు మాజీ సీఎం వైయస్ జగన్ ను ఉద్దేశించే మాట్లాడినట్లు కనిపిస్తోంది. అంటే, పాత కేసులకు తోడు మాజీ సీఎం వైయస్ జగన్ లిక్కర్ స్కాం వెంటాడుతోంది.
సీఎం చంద్రబాబు చేసిన హెచ్చరికల నేపథ్యంలో రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన ఇంకొంతమంది నాయకులు, మాజీ మంత్రులతో సహా ys.jagan ఇరుకాటంలో పడే పరిస్థితి లేకపోతెనే సంకేతాలు వెలువడినట్లు భావిస్తున్నారు.
Read More
Next Story