ఆటో డ్రైవర్లకు చంద్రన్న కానుక రూ.15 వేలు
x
సూపర్6 పతాకాలు రెపరెపలాడిస్తున్న సీఎం నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్. మాధవ్

ఆటో డ్రైవర్లకు చంద్రన్న కానుక రూ.15 వేలు

అనంతపురంలో ప్రకటించిన సీఎం చంద్రబాబు. సీమపై ప్రత్యేక శ్రద్ధ ఉందంటున్న పవన్ కళ్యాణ్.


ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం ద్వారా రామరాజ్యం స్థాపించడానికి కూటమి ప్రభుత్వం శ్రమిస్తుందని టిడిపి చీఫ్, సీఎం నారా చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వాహన మిత్ర పథకం కింద ఆటో డ్రైవర్లకు దసరా కానుకగా ఈ ఏడాది నుంచే 15 వేల రూపాయలు అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాయలసీమలో ప్రాజెక్టులకు పునాది వేసింది తెలుగుదేశం పార్టీ కాలంలోనే హంద్రీనీవా జలాలతో సస్యశ్యామలం చేయాలనే సంకల్పం నెరవేర్చాం అని ఆయన ప్రకటించారు.


రాయలసీమపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పష్టం చేశారు.. పుట్టపర్తి నారాయణాచార్యులు రచించిన శివతాండవం కావ్యంతో ప్రసంగం ప్రారంభించిన ఆయన రాయలసీమలోని బళ్ళారి రాఘవ,. విద్వాన్ విశ్వం, గజ్జల మల్లారెడ్డి వంటి ఎందరో కవులు కళాకారులు రచయితలు పుట్టిన సీమ ఇది అంటే అంటూ ప్రస్తుతించారు.

"టిడిపి కూటమి ఏర్పడిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేశాం. ఆర్థిక కష్టాల నుంచి రాష్ట్రానికి గట్టెక్కిస్తూనే హామీలు కూడా అమలు చేసాం" సీఎం నారా చంద్రబాబు స్పష్టం చేశారు.
"సంక్షేమ పథకాలు అందుకున్న వారితో పాటు ఉపాధి అవకాశాలు పొందిన యువత మళ్లీ ఎన్నికలు వస్తే కూటమికే అధికారం ఇవ్వాలి. అలా కాదని పరమపద సోపానం మాదిరి వివరిస్తే నష్టపోయే ప్రమాదం ఉంది" అని చంద్రబాబు ముందస్తు హెచ్చరిక చేసి, వచ్చే ఎన్నికల్లో కూడా కూటమిని ఆదరించాలని ఆయన అభ్యర్థించారు.
అనంతపురం వేదికగా బుధవారం మధ్యాహ్నం సూపర్ సిక్స్... సూపర్ హిట్ పేరిట విజయోత్సవ సభను నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి సుమారు మూడు లక్షలకు పైగానే ఈ సభకు హాజరైనట్లు పరిశీలకులు అంచనా వేశారు. అనంతపురం పట్టణానికి సుమారు 10 నుంచి 15 కిలోమీటర్ల దూరం వరకు బహిరంగ సభకు హాజరవడానికి వచ్చిన టిడిపి కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలతో ట్రాఫిక్ కూడా స్తంభించింది.

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ టిడిపి నాయకుడు పయ్యావుల కేశవ్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మధ్యాహ్నం 3.50 గంటల నుంచి 4.35 గంటల వరకు సుదీర్ఘంగా మాట్లాడారు.
ఈ సభలో కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు మాట్లాడుతూ,
"గత ఐదేళ్ల పరిపాలనలో గాడి తప్పిన పాలన వ్యవస్థను చక్కదిద్ది గాడిలో పెడుతున్నాం. ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ సంపద సృష్టి ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం" అని సీఎం చంద్రబాబు చెప్పారు.
"తల్లికి వందనంలో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వారందరికీ వర్తింపజేశాం. రైతన్నకు అండగా నిలిచి 47 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేసాం. దీపం టు పథకం ద్వారా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. మెగా డీఎస్సీ ద్వారా 16347 టీచర్ పోస్టులు భర్తీ చేసాం" అని వివరించిన సీఎం నారా చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు సంపూర్ణంగా అమలు చేశామని ప్రకటించారు.
"తమది జవాబుదారీతనం, బాధ్యత కలిగిన ప్రభుత్వం కాబట్టే సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చి మాట నిలుపుకున్నాం" అని కూడా చంద్రబాబు గుర్తు చేశారు. గత ఎన్నికల్లో ప్రజలు మా మాట నమ్మారు, వారి విశ్వాసాన్ని ఉమ్మ చేయకుండా తెలుగు తమ్ముళ్ల స్పీడు, జనసేన జోరు, కమలదళం ఉత్సాహానికి మరింత ఊపు తీసుకొచ్చాం అని ప్రాసతో జనాలని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
సమాధానం చెప్పడానికి సిద్ధం..
వైసిపి అధ్యక్షుడు జగన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని సీఎం అండ్ చంద్రబాబు అభ్యంతరం చెప్పారు. అబద్దాల ప్రచారంతో లబ్ధి పొందాలని చూస్తున్నాడు అది సాధ్యం కాదు. ఏ సందేహమైన, ఏ అంశంపై అయిన సమాధానం చెప్పడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. "మీ ఆరోపణలు, ప్రశ్నలకు సమాధానం కావాలంటే అసెంబ్లీ సమావేశాలకు రాండి" కానీ సీఎం చంద్రబాబు వైసీపీ నేత జగన్ కు సవాల్ విసి.
యువతా మేలుకో..



ఎన్నికలకు ముందు మీకోసం, యువగలం యాత్రకు అపూర్వ ఆదరణ లభించిందని సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
"యువత భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దడానికి ఇప్పటివరకు 10 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడానికి మార్గం ఏర్పడింది. యువకుల భవిష్యత్తు కు బంగారు బాటలు వేయడమే కూటమి ముందు ఉన్న లక్ష్యం" అని చంద్రబాబు తన దీర్ఘకాలిక ఆలోచనను వెల్లడించారు.
"యువకుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికి శ్రమిస్తున్నాం. లక్ష మంది డ్వాక్రా మహిళలను పారిశ్రామిక గీతలుగా తయారు చేయాలనేది మా లక్ష్యం. పరిశ్రమల ఏర్పాటుకు పునాది వేయడమే కాదు ఉత్పత్తి కూడా ప్రారంభిస్తాం. ద్వారా ఉపాధికి బాటలు వేస్తాం. మీకు నేను ఇస్తున్న భరోసా ఇది" అని చంద్రబాబు హామీ ఇచ్చారు.
రాష్ట్రం, దేశం మరింత అభివృద్ధి చెందడానికి, అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించడానికి సహకారం అందించాలని ఆయన అభ్యర్థించారు. సంక్షేమ పథకాలు అందుకున్న వర్గాలు మరిచిపోకుండా మళ్లీ ఆదరించాలి. పరమపద సోపానం మాదిరి వేరే వారిని ఆదరిస్తే రాష్ట్ర అభివృద్ధి ఆగిపోతుంది" అని ఆయన యువత, మహిళలను హెచ్చరించారు. ఇప్పుడు ఎన్నికల లేకపోవచ్చు. మళ్లీ ఎన్నికల్లో కూటమినే ఆదరించాలని సీఎం చంద్రబాబు కోరారు.
ఏరియా కొరతలేదు
ప్రస్తుతం రైతులకు ఎలాంటి ఏరియా కొరతలేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి రైతు కు అవసరమైనంత ఏరియా నిల్వలో గోదాముల్లో చేర్చామని ఆయన గుర్తు చేశారు. దీనిపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోంది. నిజంగా వారికి చిత్తశుద్ధి ఉందా అని మాజీ సీఎం వైఎస్ జగన్ ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా 90% సబ్సిడీతో రైతులకు మేలు చేస్తున్నాం రైతు భరోసా కింద ₹3,1707 వేల కోట్ల రూపాయలు పంపిణీ చేసిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. గత గత ప్రభుత్వం కంటే అధికంగానే నగదు బదిలీతో రైతుల తో పాటు విద్యావ్యవస్థలో కూడా ప్రమాణాలు మెరుగుపరిచామని ఆయన చెప్పారు.
పేదల ఆరోగ్యానికి సంజీవని
పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు ఆరోగ్యశ్రీ ద్వారా 2.50 లక్షలు వర్తింప చేయడం ద్వారా 25 లక్షల మందికి ఈ పథకంలో ఆరోగ్యానికి భద్రత కల్పించామన్నారు. ఇది కాకుండా సంజీవని ప్రాజెక్టు ద్వారా పేద రోగులకు కార్పొరేట్ వైద్యం అందించే విధంగా రక్షణ కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.
రాష్ట్రంలో వైద్య విద్యకు తెలుగుదేశం పార్టీ హయాంలోనే నాంది పలికిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ
"ప్రస్తుతం 17 మెడికల్ కాలేజీలు ఉన్నాయంటున్నారు. టెంకాయ కొట్టి, రిబ్బన్ కట్ చేస్తే సరిపోతుందా? భవనాల నిర్మాణం సిబ్బంది నియమించాల్సిన అవసరం లేదా" అని మాజీ సీఎం వైయస్ జగన్ ఉద్దేశించి సీఎం చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు.
"2026-27 విద్యా సంవత్సరానికి నాలుగు మెడికల్ కాలేజీలు 2027-28 సంవత్సరానికి మరో వేడు కాలేజీలు అందుబాటులోకి వస్తాయి. ద్వారా మెడికల్ సీట్లు కూడా పెరుగుతాయి. మేనేజ్మెంట్ కోటాలో కూడా సీటు దక్కుతాయి"అని చెప్పిన సీఎం చంద్రబాబు వాటి నిర్మాణాలను వేగవంతం చేయడానికి శ్రద్ధ తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
సామాజిక న్యాయం అనే విధానానికి తెలుగుదేశం పార్టీ, కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
"ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ 1996లో చేశాం. మళ్లీ ఈ కూటమి ప్రభుత్వంలోనే అమలు చేశాం"‌ అనే చంద్రబాబు హర్షద్వానాలు చేయించి మరి చెప్పారు. రాష్ట్రంలో అర్చకులు మౌజం, ఇమాములు, పాస్టర్ల గౌరవ వేతనాన్ని కూడా పెంచినట్లు ఆయన వెల్లడించారు.
అనంత అభివృద్ధికి బ్లూ ప్రింట్
రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒకటైన అనంతపురం జిల్లా అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. కరువును పారదోననికి అనంతపురం జిల్లాలో అనేక "పరిశ్రమలు స్థాపించాం. హంద్రీనీవా జలాలను కూడా పారించాం. ఇంకొన్ని పరిశ్రమల ఏర్పాటు ద్వారా ప్రజల. జీవన ప్రమాణాలను పెంచడానికి బ్లూ ప్రింట్ తయారు చేసాం" అని చంద్రబాబు చెప్పారు. ఈ జిల్లాలో జీడిపల్లి, భైరవానీతిప్ప ఇంకొన్ని రిజర్వాయర్లను నింపడం ద్వారా ఉరవకొండ, మడకశిర కళ్యాణదుర్గం నియోజకవర్గం కూడా పంటల సాగుకు నీరు పారించడానికి చర్యలు తీసుకుంటామని కూడా ఆయన హామీ ఇచ్చారు. సంపద సృష్టి ద్వారా ఆదాయంతో యువత భవిష్యత్తు, మహిళా శక్తికి మరింత ఆర్థిక వెసులుబాటు కల్పించడం అనే లక్ష్యాలతో పారిశ్రామిక, పర్యాటక రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు సీఎం చంద్రబాబు వివరించారు.
సీమ తలరాత మారుస్తాం
"ఋతువులు ఎన్ని ఉన్నా... రాయలసీమకు ఒకటే. కాలాలు ఎన్నున్నా రాయలసీమకు ఎప్పుడు ఎండాకాలం" అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టపర్తి నారాయణాచార్యులు రచించిన శివతాండవం కావ్యాన్ని ప్రస్తావించారు. రాయలసీమలో కూడా అన్ని కాలాలు వర్తించే విధంగా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే తమ ముందు ఉన్న కర్తవ్యం అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. మార్చడానికి సేద్యపనీరు, తాగునీరు అందించడానికి కూటమి ప్రభుత్వం మరింత చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.. దీనికోసం టిడిపి కూటమి కలిసికట్టుగా ముందుకు సాగుతుందని చెప్పారు.
"రాయలసీమ ఎప్పటికీ వెనుకబడినది కాదు ప్రజలకు మంచి సదుపాయాలు కల్పించడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం. పరిశ్రమల స్థాపన పెట్టుబడులు సాధించడానికి, వ్యవసాయం నీటిపారుదల సమస్యల పరిష్కారానికి శ్రద్ధ తీసుకుంటాం" అని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. "ప్రజలు కోరుకున్న పాలనే కూటమి అందిస్తోంది యువత, మహిళలు, రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం " అని కూడా పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ బహిరంగ సభకు టిడిపి, జనసేన, బిజెపి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా హాజరయ్యారు.
Read More
Next Story