CM CHABDRABABU | జీడి నెల్లూరులో పింఛన్ల పండుగ
x

CM CHABDRABABU | జీడి నెల్లూరులో పింఛన్ల పండుగ

సీఎం జిల్లా పర్యటనకు రానున్నారు. కొన్ని ఆంక్షలు కూడా అమలు చేస్తున్నారు.


చిత్తూరు జిల్లా జీడీ. నెల్లూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి సీఎం చంద్రబాబు శనివారం మధ్యాహ్నం పర్యటించనున్నారు. దీంతో గతంలో వైసీపీ సోషల్ మీడియా వర్కర్లుగా పనిచేసిన వారికి పోలీసులు నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారని తెలిసింది. వైసీపీ లేదా ఆ పార్టీ సోషల్ మీడియా వర్కర్లు హాజరు కాని విధంగా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. సీఎం పర్యటన కోసం ఎంపిక చేసిన జీడి నెల్లూరు దళితవాడలో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.


రూ.113.02 కోట్లు పంపిణీకి ఏర్పాట్లు

చిత్తూరు జిల్లా లో వివిధ రకాల పెన్షన్ల కింద 2,65,691 మంది లబ్ధిదారులకు రూ.113.02 కోట్లు పంపిణీ చేయనున్నారు. సీఎం చంద్రబాబు పర్యటన కార్యక్రమాన్ని సమన్వయకర్త పి. వెంకటేష్, ప్రభుత్వ విప్, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం.థామస్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్,ఎస్ పి మణికంఠ చందోలు, జిల్లా జాయింట్ కలెక్టర్ జి. విద్యాధరి సమన్వయం చేస్తున్నారు. సీఎం పర్యటనకు 600 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం చంద్రబాబు పింఛన్ల పంపిణీకి స్వయంగా హాజరవుతున్నారు. లబ్ధిదారులకు స్వయంగా అందించడం. వారెంట్లో టీ, కాఫీ కాంచడం, వారితో కలిసి గంట పాటు గడపడం వంటి కార్యక్రమాలతో ప్రజలతో నేరుకు మమేకం కావడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న విషయం తెలిసింది. సీఎం చంద్రబాబు కొడుకు, మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహించే మంగళగిరి నియోజకవర్గం నుంచి ఆయన ఈ తరహా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే ..
సీఎం పర్యటన.. ప్రజావేదిక

చిత్తూరు జిల్లాలో మార్చి నెల సామాజిక పింఛన్ల పంపిణీ కోసం సీఎం చంద్రబాబు జి.డి.నెల్లూరు మండలం రామానాయుడుపల్లి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడుకు చేరుకుంటారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల నుండి స్వాగత సత్కారాలు అందుకున్న అనంతరం మ.12.00 నుంచి మధ్యాహ్నం 12.20 గంటల వరకు ప్రజా ప్రతినిధుల సమావేశంలో పాల్గొంటారు.

మధ్యాహ్నం 1.00 గంటకు జి.డి. నెల్లూరుకు చేరుకుంటారు
మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారుల ఇంటి వద్దకు చేరుకుని పెన్షన్ పంపిణీ చేస్తారు.
మధ్యాహ్నం 1.30 గంటల నుంచి మ.1.55 గం.ల వరకు “పది - సూత్రాలు” అంశం పై వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలిస్తారు.
మధ్యాహ్నం 1.55 నుంచి మ.2.55 గం.ల వరకు గ్రామస్తులతో ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించనున్నారన్నారు.
మధ్యాహ్నం 3.00 గంటలకు రామానాయుడుపల్లికు చేరుకుని స్థానిక ప్రజా ప్రతినిధులతో సమావేశంలో పాల్గొంటారు.
3.30 గంటలకు హెలిప్యాడ్ చేరుకుని, తిరుపతి తిరుగు ప్రయాణం అవుతారు.
Read More
Next Story