తమ్ముడూ.. నారావారిపల్లె నిను మరవదు..
x
తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి పుష్పాంజలి ఘటిస్తున్న సీఎం చంద్రబాబు

తమ్ముడూ.. నారావారిపల్లె నిను మరవదు..

రామ్మూర్తికి నివాళులర్పించిన సీఎం బాబు, కుటుంబీకులు.


చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు. మంగళవారం మధ్యాహ్నం చేరుకున్నారు. ఆయన తమ్ముడు రామ్మూర్తి నాయుడు ప్రథమ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన విస్తర కార్యక్రమం (శ్రార్థం) నిర్వహించారు.

సీఎం చంద్రబాబు తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మరణించి ఏడాది కావడంతో సొంత ఊరు నారావారిపల్లెలో ఆయన జ్ఞాపకార్థం నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు తో పాటు ఆయన భార్య నారా భువనేశ్వరి, కొడుకు నారా లోకేష్, రామ్మూర్తి నాయుడు భార్య నారా ఇందిర, కొడుకులు గిరీష్, నారా రోహిత్ కూడా హాజరయ్యారు. సీఎం చంద్రబాబు చెల్లళ్లతో పాటు కుటుంబీకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పెద్దగా వ్యవహరించి...

నారావారిపల్లెలోని నివాసంలో ఏర్పాటు చేసిన సంవత్సరీకం కార్యక్రమంలో నారా రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి సీఎం చంద్రబాబు కుటుంబసభ్యులతో కలిసి నివాళులర్పించారు. సీఎం నారా చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు వేదిక ముందు కూర్చుని పెద్దలుగా వ్యవహరిస్తూ, నారా రామ్మూర్తి ఆత్మశాంతి కోసం ఆయన కొడుకులు గిరీష్, రోహిత్ ద్వారా హిందూ సాంప్రదాయ పద్ధతిలో ఆచార వ్యవహారాలతో శాస్త్రోక్తంగా సంవత్సరీకం నిర్వహించారు.
స్మృతి వనంలో నివాళి..

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తండ్రి ఖర్జూర నాయుడు, తల్లి అమ్మమ్మ, సమాధుల చెంతనే తమ్ముడు రామ్మూర్తి నాయుడుకి కూడా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ప్రదేశాన్ని స్మృతి వనం ఏర్పాటు చేశారు. ఈ ప్రదేశానికి సీఎం చంద్రబాబు కుటుంబంతో పాటు, తమ్ముడు నారా రామ్మూర్తి భార్య ఇందిర, కొడుకులు కూడా చేరుకున్నారు. సమాధి వద్ద చేయడం ద్వారా రామ్మూర్తి ఆత్మ శాంతించాలని కోరుతూ పూజలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తో పాటు ఆయన ఆయన కుటుంబీకులు రావడంతో నారావారిపల్లెలో తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వెంకటేశ్వర్ ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశారు.
నారావారిపల్లెకు చేరుకోవడానికి తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ విశ్వవిద్యాలయం సమీపంలోని రంగంపేట వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ లో సీఎం నారా చంద్రబాబుకు అధికారులు, టిడిపి ప్రజా ప్రతినిధులు నాయకులు స్వాగతం పలికారు. నారావారిపల్లెలో తమ్ముడు రామ్మూర్తి నాయుడు సంవత్సరీకం కార్యక్రమాలను నిర్వహించిన తర్వాత చంద్రబాబు తిరిగి ఉండవల్లికి బయలుదేరి వెళ్లారు.
Read More
Next Story