
కనురెప్పే కాటేసింది... కూతురిపై తండ్రి అఘాయిత్యం
చిత్తూరు జిల్లాలో ఘటన
కూతురికి కంటికి రెప్పలా నిలవాల్సిన తండ్రి కాలయముడయ్యాడు. వావి,వరసలు మరిచిన ఆ మృగాడు కూతురిపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. అడ్డుకున్న తల్లిపై కూడా దాడికి దిగాడు. కొడుకు నుంచి మనవరాలిని కాపాడేందుకు నానమ్మ విఫలయత్నం చేసింది. గ్రామస్తులను తీసుకుని వచ్చే లోపు కూతురిపై అఘాయిత్యం చేసిన ఆ తండ్రి పరారీ అయ్యాడు. పెద్దపంజాణి పోలీసులు నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు ఈ సంఘటన వివరాల్లోకి వెళితే,
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాణి మండలంలో జరిగింది. గ్రామానికి చెందిన పెద్దబ్బకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య కూతురిపై పెద్దబ్బ అఘాయిత్యం చేయడానికి ప్రయత్నించాడు. ఆ బాలికను పొదల్లోకి లాక్కుని వెళుతుండగా, పెద్దబ్బ తల్లి అడ్డుపడి నెత్తీనోరు బాదుకుంది. అయినా ఏమాత్రం కనికరం లేకుండా పెద్దబ్బ తన కూతురిని లాక్కుని వెళ్లాడని తెలిసింది.
కొడుకు నుంచి మనవరాలిని కాపాడుకోవడానికి శక్తి చాలని పెద్దబ్బ తల్లి గ్రామంలోకి పరుగులు దీసింది. ఆమె గ్రామస్తులను తీసుకుని వచ్చే లోపు కూతురిపై లైంఘికదాది చేసిన పెద్దబ్బగ్రామం నుంచి పరారీ అయ్యాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో పెద్దపంజాణి పోలీసులు నిందితుడు పెద్దబ్బపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. సమాచారం అందగానే పలమనేరు సీఐ పరుశురాముడు కూడా బాధిత కుటుంబం నుంచి వివరాలు తెలుసుకున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిసింది.
Next Story

