
చిత్తూరు:జాతరలో హెలికాప్టర్ సృష్టించిన బీభత్సం
అమ్మవారి విగ్రహంపై పూల వర్షం కురిపించాలని చేసిన ప్రయత్నం కష్టాలు తెచ్చింది
పుంగనూరు గంగజాతరలో భారీ ప్రమాదం తప్పింది. హెలికాప్టర్ నుంచి పూలు చల్లాలని చేసిన ప్రయత్నం భక్తులకు ఆగ్రహానికి గురి చేసింది.
చిత్తూరు జిల్లాలో వేసవి ప్రారంభమైతే జాతర సంబరాలు కూడా జోరందుకుంటాయి. అందులో పుంగనూరు సుగుటూరు గంగమ్మ జాతరకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. పుంగనూరు జమీందారులు ఈ జాతరను నిర్వహించడం ప్రత్యేకత. ప్యాలెస్ లో జమీందారులు విజయరాణెమ్మ, సోమశేఖర చిక్కరాయలు మల్లికార్జున రాయాలు, వారి కుటుంబ సభ్యులు మంగళవారం పూజలు నిర్వహించారు.
పుంగనూరు కోట నుంచి ప్రారంభమయ్యే అమ్మవారి ఊరేగింపు పట్టణంలో బుధవారం కూడా నిర్వహించారు. పుంగునూరు పరిసర ప్రాంతాల్లోని 100 గ్రామాల్లో అమ్మవారి జాతరను అత్యంత ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. బుధవారం రాత్రి ఆమె వారిని మళ్లీ ఊరేగింపుగా తీసుకుని వెళ్లి జలిధిలో కలుపుతారు.
ఉత్సాహం తెచ్చిన ప్రమాదం
పుంగనూరులో సుగుటూరు గంగమ్మ జాతర సందర్భంగా కోలాహలం ఏర్పడింది. అమ్మవారి ప్రతిమపై ఆకాశం నుంచి పూలు చల్లాలి అనే అత్యుత్సాహం భక్తుల ఆగ్రహానికి గురి చేసింది. టిడిపి నేత ఆర్.బి.టి బాబు, కమెడియన్ సప్తగిరి బెంగళూరు నుంచి ప్రత్యేకంగా హెలికాప్టర్ తెప్పించారు. పట్టణంలో గగనతలంపై విహరిస్తున్న హెలికాప్టర్ నుంచి అమ్మవారిని కొలువు తీర్చిన ప్రదేశంలో పూలు చల్లి ఎందుకు ఏర్పాటు చేశారు.
ఆకాశం నుంచి పూలు విద్యులుతున్న హెలికాప్టర్ ఇంకాస్త కిందికి దిగిరావడంతో ఆ గాలి ధాటికి షామియానాలు కూలిపోయాయి. ఇంకొన్ని దుకాణాల పైకప్పు రేకులు కూడా గాలిలోకి ఎగిరినట్లు సమాచారం. దీంతో జాతర జరుగుతున్న ప్రదేశంలో కలకలం చెలరేగింది. స్వామి అనాల కూలిన ఘటన నేపథ్యంలో కొందరు భక్తులు కూడా గాయపడినట్లు సమాచారం అందింది. ప్రమాదాన్ని గ్రహించిన పైలెట్ హెలికాప్టర్ ను ఇంకాస్త ఎత్తుకు తీసుకుని వెళ్లడం వల్ల భారీ ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. టిడిపి నేత ఆర్విటీ బాబు, కమెడియన్ సప్తగిరి ప్రసాద్ అత్యుత్సాహం వల్ల ఈ ఘటనకు కారణమైందని పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతరలో బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు అప్రమత్తం కావడంతో తొక్కిస్లాటకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిసింది. దీనివల్ల ఇలాంటి ప్రాణ నష్టం జరగకుండా నివారించగలిగినట్లు చెబుతున్నారు.
Next Story