షాక్ ఇచ్చిన భూమన.. తిరుమలలో ప్రత్యక్షం
ఊహించని విధంగా టీటీడీ మాజీ చైర్మన్ తిరుమల లో ప్రత్యక్షమై షాకిచ్చారు. వరాహ స్వామి ఆలయం వద్ద ప్రమాణానికి సంసిద్ధమయ్యారు.
టిటిడి అధికారులకే కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి షాకిచ్చారు. నిఘా వర్గాలు కూడా పసిగట్టని విధంగా ఆయన సోమవారం మధ్యాహ్నం తిరుమలలో ప్రత్యక్షమయ్యారు. వరాహ స్వామి ఆలయం వద్ద ప్రమాణం చేయడానికి పూర్తి సంసిద్ధతతో వెళ్లినట్లు పరిస్థితి చెప్పకనే చెబుతోంది. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం వినియోగంలో నెయ్యి కల్తీ చేశారని అభియోగంపై దేశం మొత్తం కలవడానికి పోయింది. ఈ వ్యవహారం వైసీపీ పాలనలో జరిగిందని సీఎం ఎన్ చంద్రబాబు నాయుడు ఆరోపణలను టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం మీడియా సమావేశంలో ఖండించారు.
లీక్ లేకుండా..
తిరుమల లడ్డు వ్యవహారం ప్రకంపనలు దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం వ్యాపించాయి. లడ్డు ప్రసాదంలో వాడిన నెయ్యిలో కల్తీ జరగలేదని టిటిడి మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఘంటాపథంగా చెబుతున్నారు. అయితే, సోమవారం ఆయన చాలా సీక్రెట్ గా ఓ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, టిటిడి యంత్రాంగం కూడా దీనిని గ్రహించలేకపోయింది. అన్ల అనుచరులతో కలిసి తిరుపతి పద్మావతి పురం నివాసం నుంచి ఆయన బయలుదేరారు. అలిపిరి టోల్గేట్ చెక్ పాయింట్లు తనిఖీలు పూర్తిగా గాని తిరుమలకు వెళ్లే లోపు ఈ సమాచారం కొండపై అందింది.
వెంటనే అప్రమత్తమైన టిటిడి విజిలెన్స్, సివిల్ పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరుమలలోకి ప్రవేశించగానే gnc (గరుడాద్రి నగర్ కాటేజెస్) టోల్గేట్ వద్ద టిటిడి మాహిష్ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కాన్వాయిని పోలీసులు ఆపివేశారు. " తిరుమల లో ఎలాంటి రాజకీయ ప్రకటనలు చేయవద్దు" అని ముందస్తు నోటీసు అందజేసి సంతకం తీసుకున్నారు. నేను ఇక్కడికి రాజకీయాలు మాట్లాడడానికి రాలేదు" అని కూడా భూమన కరుణాకర్ రెడ్డి పోలీసులకు స్పష్టం చేశారు.
పుష్కరిణి వైపు పయనం
జీఎన్సీ టోల్గేట్ నుంచి బయలుదేరిన భూమన కరుణాకర్ రెడ్డి కాన్వాయ్ ఆలయం సమీపంలోని ప్రముఖుల వాహనాల పార్కింగ్ వద్దకు చేరుకున్నారు. ఎవరికీ చెప్పకుండా అనుచరులతో కలిసి ఆయన వరాహ స్వామి ఆలయం సమీపంలోని పుష్కరిని వద్దకు వెళ్లి పుష్కరిణిలో మునిగారు.
అధికారులు అవాక్కు
వరాహ స్వామి ఆలయం వద్ద ఉన్న పుష్కరణలో కరుణాకర్ రెడ్డి స్నానానికి దిగగానే అధికారులు రాష్ట్ర ప్రభుత్వ గూడచారులు కూడా అవాక్కయ్యారు. అంటే ఆయన తన పదవీకాలంలో, వైసీపీ పాలనలో ఎలాంటి అవినీతి అక్రమాలు జరగలేదు అని తిరుమల క్షేత్రంలోని వరాహ స్వామి ఆలయం వద్ద ప్రమాణ స్వీకారం చేయడానికి వెళ్ళినట్లు అప్పటి వరకు కానీ గ్రహించలేకపోయారు. కరుణాకర్ రెడ్డి వేసిన ఎత్తుగడకు అధికారులే కాదు. నిఘవర్గాలు కూడా నివ్వెర పోయాయి. ఈ సవాల్ ను రాష్ట్ర ప్రభుత్వం, ప్రధానంగా సీఎం చంద్రబాబు ఎలా స్వీకరిస్తారు అనేది వేచి చూడాలి.
Next Story