War in the Alliance | మైనారిటీ నేత కోసం ధర్మవరం కూటమిలో యుద్ధం
x

War in the Alliance | మైనారిటీ నేత కోసం ధర్మవరం కూటమిలో యుద్ధం

మైనారిటీ నేత పార్టీ మారే వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. పరస్పర దాడులకు దిగడంతో పట్టణంలో అదనపు బలగాలు మోహరించాయి.


ధర్మవరం పట్టణంలో ప్రముఖ ముస్లిం మైనారిటీ నేత జమీన్. ఆయన బీజేపీలో చేరాలనుకు నిర్ణయం ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీలోని ఓ వర్గం దాడిలో ఆయనతో పాటు అనుచరులు కూగా గాయపడ్డారు. జమీర్ ఇంటిపై కూడా టీడీపీ మద్దతుదారులు దాడులకు ప్రయత్నించారు. ధర్మవరంలో టీడీపీలోని ఓ వర్గం బీజేపీ మద్దతుదారుల మధ్య జరిగిన ఘర్షణలో కొందరు గాయపడంతో పాటు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. అధికార పార్టీలోని రాజకీయ పార్టీల మధ్య ఘర్షణ చెలరేగిన నేపథ్యంలో సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న స్పందించారు. పట్టణంలో అదనపు బలగాలను మోహరించారు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే...


ధర్మవరం పట్టణంలో ముస్లిం మైనారిటీ నేత జమీర్ కు రాజకీయంగా మంచి పట్టు ఉంది. గతంలో టీడీపీలోనే ఓ వర్గం నేతల వేధింపులు భరించలేని స్థితిలో ఆయన గతంలో వైసీపీలో చేరారు. అందులో ప్రధానంగా గతంలో ఓ టీడీపీ నేత తన భూమిని ఆక్రమించాలనే యత్నంతో జమీర్ రాజకీయ రక్షణ కోసం వైసీపీలో చేరినట్లు చెబుతున్నారు. తాజాగా వైసీపీలో చోటుచేసుకున్న పరిస్థితుల నేపథ్యంలో సీనియర్ నేతలే కాకుండా, మాజీ ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరు బయటికి వెళ్లిపోతున్నారు. ఒక్కొక్కరిది ఒకో కారణమైనా, ధర్మవరంలో జమీర్ టీడీపీలోకి వెళ్లలేని పరిస్థితుల్లో బీజేపీలో చేరడానికి మంత్రి సత్యకుమార్ తో మాట్లాడుకున్నారు. దీనికి ముహూర్తం కూడా నిర్ణయించుకున్నారు.

వ్యతిరేకిస్తున్న పరిటాల
ధర్మవరం పట్టణంలో ప్రముఖ ముస్లిం నేతగా పేరున్న జమీర్ తిరిగి టీడీపీలోకి రావడం కాదు కదా. కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీలోకి కూడా తీసుకోవడాన్ని ధర్మవరం టీడీపీ ఇన్ చార్జి పరిటాల శ్రీరాం వ్యతిరేకిస్తున్నారు. దీంతో జమీర్ బీజేపీలో చేరడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. పట్టణంలో ఫ్లెక్సీలు కూడా భారీగానే ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. రెండు రోజుల్లో జమీర్ బీజేపీలో చేరడానికి సన్నాహాలు పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో..
దాడులతో ఉద్రిక్తత

ముస్లిం నేత జమీర్ కాకుండా తిరిగి టీడీపీలోకే రావాలని ఓవర్గం పట్టుబట్టింది. దీనికి జమీర్ కాదనడంతో, ఆదివారం రాత్రి ఆయన అనుచరులపై టీడీపీ మద్దతుదారులు దాడులకు దిగారు. కార్లలో వెళుతున్న వారిపై కూడా దాడి చేశారు. దీంతో ఇరుపక్కల కార్యకర్తలు స్వల్పంగా గాయపడడంతో పాటు వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న డీఎస్పీ హేమంత్ కుమార్ రంగంలోకి దిగారు. పోలీసుల ముందే కొందరు టీడీపీ మద్దతుదారులు జమీర్ అనుచరుల వాహనాలపై దాడులకు దిగారు. అదే సమయంలో ముస్లిం మైనారిటీ నేత జమీర్ ఇంటిపై కూడా దాడికి విఫలయత్నం చేసినట్లు సమాచారం. కార్యకర్తల పరస్పర దాడుల్లో చాలామంది స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. దీంతో పట్టణాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. పరిస్థితి చేయిదాటకుండా పోలీసు బలగాలను మోహరించారు.
Read More
Next Story