
23 ఏళ్ల మానసిక వికలాంగురాలైన మనవరాలిని మోసుకుంటూ పరుగెత్తుతున్న మహిళ.
Exclusive | బాబూ.. నా మనవరాలి పింఛన్ 'ఆశ' తీరదా?
రాజంపేటకు సీఎం చంద్రబాబు రాకముందే 23 ఏళ్ల మానసిక వికలాంగురాలి అవ్వను వెళ్లగొట్టిన పోలీసులు.
ఆ పాప కాదు... కాదు. ఆమె పేరు ఆశా భాను. వయసు 23 సంవత్సరాలు. అయినా చంటిబిడ్డే. పుట్టుకతో మానసిక వికలాంగురాలు. ఆకలి అయితే అడగలేదు. కళ్లు ఉన్నా లేనట్లే, ఆమె జీవశ్ఛవం. ఈ అభాగ్యురాలికి వికలాంగ పింఛన్ రావడం లేదు.
రాజంపేటలో పెద్దకారంపల్లె వస్తున్న సీఎం ఎన్.చంద్రబాబుకు విన్నవిస్తే న్యాయం జరుగుతుందని ఆ మానసిక వికలాంగురాలి అమ్మమ్మ (అవ్వ) ఆశ పడింది.
రాజంపేట మండలం పెద్దకారంపల్లె వద్ద సీఎం చంద్రబాబు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసే ఇంటి వద్దకు ఆ అమ్మమ్మ సోమవారం మధ్యాహ్నం వెళ్లింది. ముందుగా అనుమతి తీసుకోలేదనే కారణంతో ఆమెను అక్కడి నుంచి వెళ్లగొట్టారు. వీధుల్లో పసిబిడ్డలా ఉన్న 23 ఏళ్ల మానసిక వికలాంగురాలైన ఆశ భానూను చేతులపై మోసుకుంటూ వీధుల్లో రోధిస్తూ పరుగులుదీసింది. ఈ సంఘటన కలిచి వేసింది. అక్కడి మీడియా ప్రతినిధుల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాల్లోకి వెళితే...
కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలో సోమవారం సీఎం ఎన్ చంద్రబాబు పర్యటనకు కార్యక్రమం ఖరారైంది. ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీకి ఏర్పాటు చేశారు. రాజంపేట మండలం పెద్దకారం పల్లె కాలనీలో సీఎం చంద్రబాబు పింఛన్లు అందించేందుకు లబ్ధిదారులను కూడా ఎంపిక చేశారు. ఆ ఇంటి వద్దకు
పుట్టుకతో మానసిక వికలాంగురాలైన 23 సంవత్సరాల ఆశాభానూను చేతులపై ఎత్తుకొని వచ్చిన ఓ మహిళ ను పోలీసులు వెళ్ళగొట్టారు.
ఎవరీ బాలిక?
రాజంపేట మండలం పెద్దకారం పల్లెకు చెందిన శాంతి, రఘునాథ వర్మ దంపతులు ఉపాధి కోసం సుమారు 25 ఏళ్ల కిందట కువైట్ కి వెళ్లారు. అక్కడ వారికి ఓ పాప పుట్టింది. పుట్టుకతో మానసిక వికలాంగులు ఆయన ఆ బాలికకు ఆశాభాను అని పేరు పెట్టారు. కువైట్ లో ఉపాధి కోసం వెళ్లిన శాంతి దంపతులు మానసిక వికలాంగురాలుగా ఉన్న బిడ్డను సంరక్షించడం ఇబ్బందికరంగా మారింది. ఆ బిడ్డను తీసుకొని తిరిగి స్వగ్రామం కారం పల్లెకు చేరుకున్నారు. మానసిక వికలాంగురాలైన ఆశాభానును అమ్మమ్మ వద్ద ఉంచారు.
పింఛన్ కోసం వేదన..
రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, వికలాంగులకు ప్రతినెలా పింఛన్ ఇస్తున్న విషయం తెలిసిందే. కానీ 23 సంవత్సరాలు వయసున్న మానసిక వికలాంగురాలు ఆశాభానుకు మాత్రం పింఛన్ మంజూరు కాలేదు. ఎన్ని దరఖాస్తులు ఇచ్చిన ఫలితం లేకుండా పోయిందని ఆమె అమ్మమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. గత నెలలో నిర్వహించిన తనిఖీల్లో అర్హతలు లేని వారికి కూడా పింఛన్లు అందుతున్న విషయంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. వారిలో అర్హతలు ఉన్నవారు తమకు అన్యాయం జరిగిందంటూ ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసనలకు దిగిన విషయం తెలిసిందే. దీనిపై సమీక్షించిన రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు నెలకు సంబంధించిన పింఛన్లు అందరికీ చెల్లించండి అని ఆదేశాలు జారీ చేసింది. కాగా,
బాబు వస్తున్నాడని..
పింఛన్ల జాబితాలో పేర్లు లేని వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో కడప జిల్లా రాజంపేట మండలం పెద్ద కారంపల్లెలో పింఛన్ల పంపిణీకి వస్తున్న సీఎం ఎన్. చంద్రబాబుకు విన్నవిస్తే సమస్య పరిష్కారం అవుతుందని ఓ మహిళ భావించింది. మానసిక వికలాంగురాలైన 23 సంవత్సరాల ఆశాభానును చేతులపై మోసుకుంటూ ఓ మహిళ వెళ్లింది. సీఎం చంద్రబాబు సామాజిక పింఛన్లు అందించే ఇంటి వద్ద నిలబడింది.
"ముందుగా అనుమతి తీసుకోని కారణంగా ఇక్కడ ఉండడానికి వీలు లేదు_ అని పెద్దకారం పల్లె వద్ద బందోబస్తులో ఉన్న పోలీసులు ఆ మహిళను అనుమతించలేదు. గత్యంతరం లేక ఆశాభానును చేతులపై మోసుకుంటూ వీధిలో ఏడుస్తూ రావడం చూసిన గ్రామస్తులకు కూడా తీవ్రంగా కలత చెందారు. రాజంపేట డివిజన్ అధికారులైన తమ బిడ్డకు న్యాయం చేయాలని ఆ మహిళ కోరుతోంది.
Next Story