'బాబు' మారలేదు, ప్రపంచబ్యాంకు భాష మానలేదు..
నేను మారాను. నన్ను నమ్మండి అంటారు. అధికారంలోకి వస్తే చంద్రబాబు తీరు విరుద్ధంగా ఉంటుంది. అదే తీరు ప్రతిధ్వనించింది.
చెప్పే మాటలు ఆ తరువాత నిర్ణయాలు, అభిప్రాయాల తీరు సీఎం చంద్రబాబు ఎప్పుడూ విలక్షణంగా ఉంటుంది. అభిమానించే వారికి దార్శనికుడిగా కనిపిస్తారు. విమర్శకులు మాత్రం "ఎప్పటికీ మారని మనిషి చంద్రబాబు" అని అంటుంటారు. అంటే, ఆయన మాటలు ఒకపట్టాన అర్థం కావు. చంద్రబాబు సీఎం అయిన ప్రతిసారీ విలక్షణమైన తీరును ప్రదర్శించడం అలవాటు. ఐటీ రంగం ద్వారా హైటెక్ అనే పదాన్ని పాపులర్ చేసిన చంద్రబాబు, నేను మారాను అన్నారు. నమ్మండి అన్నారు. ఆ తరువాత ఏమి చేశారు. తాజాగా,
విజయవాడ కృష్ణా బ్యారేజీ నుంచి శ్రీశైలం డ్యాం వరకు నడిపే సీప్లేన్ ప్రారంభోత్సవ సభలో చేసిన వ్యాఖ్యలతో మళ్లీ నేను పాత చంద్రబాబునే అనిపించుకున్నట్లు కనిపిస్తోంది. "ప్రపంచంలో ఆల్ ఇజమ్స్ ఓవర్" అని వ్యాఖ్యానించడం వెనక పరమార్థం ఏమిటి? "ఆల్ ఇజమ్స్ ఓవర్" అని నేను ఎప్పుడో చెప్పాను అని కూడా గుర్తు చేశారు. దీని ద్వారా అర్థం అయ్యేది ఒక్కటే, ఆయన గతానికి ఏమాత్రం భిన్నంగా లేరనే విషయం మరోసారి నిరూపించుకున్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పే మాటలతో క్యాడర్ కు వ్యక్తిత్వవికాసం మాటలతో కర్తవ్య బోధ చేస్తారు. అధికారంలోకి రాగానే తాను అనుకున్నదే చేస్తారు. సందర్భం ఎదైనా సరే. పార్టీ నేతలు, సామాన్యులతో కలిసినప్పుడు మాత్రం వారి చెప్పేది ఆలకిస్తారు. ఆలోచన చేస్తారో లేదో తెలియదు కానీ, తనతో మాట్లాడిన వారికి మాత్రం సంతృప్తి మిగులుస్తారు. తాజాగా సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు మరోకోణాన్ని ఆవిష్కరించాయి.
అధికారంలోకి వచ్చిన ప్రతిసారి సీఎం చంద్రబాబు తన విలక్షణాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఒకోసారి ఒకో రంగానికి ప్రాధాన్యం ఇవ్వడం, మాటల వెనుక కొత్త అర్థాలు వెదుక్కునేందుకు ఆస్కారం ఇస్తుంటారు.
2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం మొదటిసారి ప్రతీకార రాజకీయాలు సాగిస్తున్నదనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఐదేళ్ల వైసీపీ పాలనలో సోషల్ మీడియా ద్వారా వేధింపులు, కేసులతో ఇబ్బంది పడ్డారు. ఆ రుణం తీర్చుకునే విధంగానే అధికార టీడీపీ, కూటమిలోని జనసేన నేతలు కూడా అదే బాటలో పయనిస్తున్నారనడంలో సందేహం లేదు. ఎందుకు అంటే, వారికి గతంలో ఎదురైన అనుభవాలు అటువంటివనే సమాధానం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనిత ఆ పార్టీ శ్రేణుల నుంచి వ్యక్తమైన అభిప్రాయాలు ఇవి. ఈ విషయాన్ని పక్కకు ఉంచితే,
దేశంలోనే కాదు. ప్రపంచంలో కూడా "అన్ని ఇజాలకు కాలం చెల్లింది. భవిష్యత్తుది టూరిజమే" అని కొత్త పల్లవి అందుకున్నారు. పర్యాటక రంగాన్ని ఈసారి అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు భుజానికి ఎత్తుకున్నారు. ఇక్కడ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని భావించడంలో తప్పులేదు. సాధారణంగా "ఇజం అంటే సిద్ధాంతం" అని కూడా అన్వయించుకుంటారు. అంటే ఇక్కడ ఎవరిని ఉద్దేశించి సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యాలు చేశారనేది మథనం జరుగుతోంది.
సామాజిక విశ్లేషకుడు తుంగా లక్ష్మీనారాయణ 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో మాట్లాడారు. "1990లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తరువాత అందరికీ నోళ్లు లెగుస్తున్నాయి. అన్నారు. "సీఎం చంద్రబాబు ఇజాలకు కాలం చెల్లిందనే మాట 15 ఏళ్లుగా అంటూనే ఉన్నారు. అని లక్ష్మీనారాయణ గుర్తు చేసుకున్నారు
పర్యాటకరంగం అభివృద్ధి చేయడం మంచిదే. రాష్టంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న పర్యాటక స్థలాలు, ఆధ్యాత్మిక కేంద్రాలను అనుసంధానం చేయడంలో తప్పులేదు. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇందులో దోపిడీకి అస్కారం లేకుండా చేస్తే సంతోషం. అదే సమయంలో పేదలకు కూడా వసతులు కల్పించాలి. అని అన్నారు.
"అభివృద్ధికి ' ఇజాలకు ' ముడిపెట్టడం సరికాదు. ఈ పద్ధతిలో మాటలు, విధానాలకు స్వస్తి చెప్పండి" అని సీఎం చంద్రబాబుకు గట్టిగానే లక్ష్మీనారాయణ హితవు పలికారు.
హైటెక్... నేను సీఈఓ
రాష్ట్రంలో టీడీపీ ఆవిర్భావం ఓ సంచలనం. ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్.టీ. రామారావు. సచివాలయంలో విభాగాలకు తెలుగు పేర్లు పెట్టడం నుంచి సారాకు తెలుగు "వారుణవాహిని" అని పేరు పెట్టడం ద్వారా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఆ పరంపర చంద్రబాబును కొనసాగించారని చెప్పడానికి నిదర్శనాలు ఇవి.
1999 ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా చంద్రబాబు మొదటిసారి బాధ్యతలు స్వీకరించిన తీరువాత యథావిధిగానే వినూత్న కార్యక్రమాలు సాగించారు. వ్యవసాయ రంగాన్ని కాకుండా ఐటీకి ప్రాధన్యం ఇచ్చారు. ప్రపంచ యవనికిపై తెలుగు వారి కీర్తిని ప్రతిబింబించడంలో సాటి లేరని చాటిచెప్పిన చంద్రబాబు "హైటెక్" అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. ఇండియాటుడే సంస్థల పోలింగ్ లో "ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియం"గా చంద్రబాబు ఎంపిక అయ్యారు. ఆ తరువాత
2000 మార్చి 24న ఉమ్మడి రాష్ర్టంలో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ పర్యటన నేపథ్యంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యాలు తీవ్ర చర్చకు దారి తీశాయి. "రాష్ట్రానికి నేను సీఎం కాదు. సీఈఓగా పనిచేస్తా" అని చెప్పడం ద్వారా కార్పొరేట్ కల్చర్ను అనుసరించిన విషయం తెలిసిందే. ఆ తరువాత కూడా ప్రజల వద్దకు పాలన, జన్మభూమి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించి, ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో వారి ఆగ్రహంతో అధికారానికి దూరమయ్యారు.
నేను మారిన మనిషిని...
ఏడాది పాటు సమయం ఉన్నా, సీఎం చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్లి, ఘోరతప్పదానికి పాల్పడ్డారనేది టీడీపీ శ్రేణులు, పార్టీ ప్రజాప్రతినిధులు దుమ్మెత్తి పోశారు.
2003 అక్టోబర్ ఒకటిన శ్రీవారి బ్రహ్మత్సవాల వేళ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన పట్టువస్త్రాలు సమర్పించడానికి తిరుపతి నుంచి కార్లలో తిరుమలకు బయలుదేరారు. అలిపిరి దాటగానే నక్సలైట్లు (మావోయిస్టులు) క్లేమోర్ మైన్లు పేల్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సీఎం చంద్రబాబు తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి నుంచి హైదరాబాద్ తరలించారు. కోలుకున్న తరువాత తన భార్య నారా భువనేశ్వరితో కలిసి స్వామివారిని దర్శించుకుని తిరిగి వెళ్లారు. అప్పటి అధికార టీడీపీకి ఇంకా ఏడాది గడువు ఉండగానే, సానుభూతి పవనాలతో ఓట్ల వర్షం కురిపిస్తుందని ముందస్తు ఎన్నికలను ప్రకటించారు.
2004లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వైఎస్ఆర్ సీఎం అయ్యారు. కొన్ని రోజులకే హైదరాబాద్ ఇందిరాపార్క్ సమీపంలోని ఎన్టీఆర్ స్టేడియంలో పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సభలో చంద్రబాబను ఉద్దేశించి "మీ తొందరపాటు నిర్ణయం వల్లే తప్పు జరిగింది" అని ద్వితీయ శ్రేణి నేతలో పాటు సీనియర్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అన్ని మాటలను సహనంగా భరించిన చంద్రబాబు "అవును నా వల్ల పొరబాటు జరిగింది. నన్ను నమ్మండి. నేనే మారతాను. ఇకపై సమష్టి నిర్ణయాలు తీసుకుందాం" అని నమ్మించారు. అప్పటి నుంచి నేను మారిన మనిషిని అని చెబుతూనే వచ్చారు. కానీ,
మారలేదు కదా..
2009 ఎన్నికల్లో సీట్ల పంపకంలో మళ్లీ తాను అనుకున్నదే చేశారు.
2014 ఎన్నికల్లో మదనపల్లె అసెంబ్లీ స్థానాన్ని టీడీపీకి కాకుండా, బీజేపీకి కేటాయించారు. అధికారంలోకి వచ్చినా, "చంద్రబాబు ఎప్పటికీ మారరబ్బా" అనే మాట ఆ ప్రాంత నేతల నుంచి బాహాటంగా వినిపించింది. ఇది ఓ ఉదాహరణ మాత్రమే. ఈ విధంగా అనేక సీట్లు కోల్పోయాం అనేది టీడీపీ నేతల మాట.
అధికారంలోకి వచ్చిన తరువాత తన వినూత్న కార్యక్రమాలు అమలు చేసే విధానం వీడలేదు. అందుకు నిదర్శనం జన్మభూమి కమిటీ (JB) లను ప్రస్తావించవచ్చు. వారం నుంచి పది రోజుల పాటు జన్మభూమి కార్యక్రమాలు అమలు చేశారు. అందుకోసం ప్రతి గ్రామంలో ఇద్దరు సభ్యులకు అధికార బాధ్యతలు అప్పగించారు. వారి సంతకం లేనిదే ఏ పని జరగలేదు. దీనిపై "రాజ్యాంగేతర శక్తులకు అధికారం ఇచ్చారు" అని వైసీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో విరుచుకుని పడడం అటుంచితే, "మాకేమాత్రం ప్రాధాన్యం లేకుండా చేశారు" అని అధికార టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేయడం, ..
2019 ఎన్నికల్లో అధికారానికి దూరమయ్యారు. మళ్ళీ సీఎం చంద్రబాబు తన సహజ పద్ధతిలోనే పాట అందుకున్నారు. "నన్ను నమ్మండి. చెప్పిందే చేస్తా" అంటూ ఎన్నికల ప్రచారంలో మాట ఇచ్చారు. వైసీపీకి ఇంటా, బయటా ఉన్న అసంతృప్తి, టీడీపీ లాభం చేకూర్చింది.
నన్న నమ్మండి అని కోరిన చంద్రబాబు నాలుగు నెలల వ్యవధిలోనే సూపర్6 అమలులో రెండు సాకారం చేశారు. వీటిని పక్కన ఉంచితే, పదవుల పందేరంలో అసంతృప్తి మూటగట్టకున్నారు. ఇదీ పక్కన ఉంచితే, మిగతా రంగాలకంటే పర్యాటకానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రకటించారు. అంతటితో ఊరుకోకుండా, "ప్రపంచంలో ఆల్ ఇజమ్స్ ఓవర్" అంటూ కమ్యూనిస్టులను కెలికినట్లే కనిపిస్తోంది.
సీపీఐ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య ఘాటుగా స్పందించారు. "పేదరికం, దోపిడీ ఉన్నంత వరకు ఇజాలు సజీవం" అని ఈశ్వరయ్య వ్యాఖ్యానించారు. కమ్మూనిస్టుల అవసరం ఉన్నప్పుడు సంధి చేసుకున్న మాట మరిచినట్లు ఉన్నారు. ఆ సమయంలో నాలుక కరుచుకున్న విషయం మరిచారా?" అనిఈశ్వరయ్య ప్రశ్నించారు. "సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నేత నోటి వెంట అలాంటి మాటలు రావడం దురదృష్టకరం" అని నిరసించారు.
ఉమ్మడి రాష్ట్రంలో 25 ఏళ్ల కిందట ప్రపంచబ్యాంకు విధానాలకు నాంది పలికిని వ్యక్తిగా సీఎం చంద్రబాబుకు పేరు. ఆ నాటి నుంచి ఇప్నటికి కూడా ఆయన ప్రపంచ
భాష మారలేదు. అనడానికి తాజాగా ఆయన పర్యాటక రంగంలో ప్రపంచదేశాలను ప్రస్తావించడం ఉదహరించవచ్చు.
Next Story