భూమీకి పచ్చాని రంగేసినట్టు...
x

భూమీకి పచ్చాని రంగేసినట్టు...

మట్టి వాసన తెలిసిన మనుషులకు పల్లె అంటే ప్రాణం. ఈ లక్షణాలు ఉన్న ఆ మహిళా ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఆపై నాట్లు వేశారు,


భూమీకి పచ్చిటి సింగారం పంటలే. పల్లె జనం అంటే వారికి వల్ల మాలిన అభిమానం. కూలీలతో కలసి పనిచేయడం. వారితో కలిసి బోసనం చేయడం పరిలాల కుటుంబానికి అలవాటు, ఇష్టం. వాన చినుకు కరుణిచింది. నేల తల్లి తడిసింది. ఇదే పల్లెకు పండుగ తెచ్చింది. నారు, మడి సిద్ధంగా ఉంది. బురద మడిలోకి దిగిన ఆ మహిళా ఎమ్మెల్యే భూమికి పూజ చేశారు. నేల తల్లీ కరుణించు అని ప్రార్ధించారు. ఆ తరువాత కుచ్చిళ్లు మడిచిన ఆమె కూలీలతో కలసి, నాట్లు వేశారు. గతాన్ని నెమరు వేసుకున్న ఆ ఎమ్మెల్యే భావోద్వేగానికి లోనయ్యారు.


అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం వెంకటాపురంలోని సన్నివేశం ఇది. పెద్దగా పనిచయం అవసరం లేనిది పరిటాల కుటుంబం. పల్లె ప్రజలకు వారు ఎప్పుదూ దగ్గరగానే ఉంటారు. వారంటూ పేదలకు కూడా వల్లమాలిన అభిమానం. ప్రజల్లో ఉండడానికి ఇష్టపడే వారు వ్యవసాయ పనుల్లో కూడా మమేకం అవుతారు. ఆకోవలోనే.. ప్రజల సమస్యల పరిష్కారంలో బిజీగా గడిపే పరిటాల సునీత వ్యవసాయ పనులు చేస్తూ కనిపించారు. రామగిరి మండలం వెంక టాపురంలోని తన సొంత వ్యవసాయ క్షేత్రంలో వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి వరి నాట్లను ప్రారంభించారు. కూలీలతో బురద మడిలో దిగి.. వరి నాట్లు వేశారు. ఎంతో ఉత్సాహాంగా కూలీలతో సమానంగా పని చేస్తూ కనిపించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వ్యవసాయ పనులను పర్యక్షిస్తూ గడిపారు.



పరిటాల సునీత మాట్లాడుతూ "మా కుటుంబానికి మొదటి నుంచి వ్యవసాయం అంటే చాలా ఇష్టం" అన్నారు. "పరిటాల రవి ఉన్నప్పుడు ఎక్కువగా పొలం పనుల్లో ఉన్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఓ వైపు ఎమ్మెల్యేగా ఉంటూనే మరోవైపు వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లామన్నారు. మా వ్యవసాయ క్షేత్రానికి వస్తే మనసు సంతోషంగా ఉంటుంది అని.. గతాన్ని నెమరు వేమరు వేసుకున్నారు. ఇందులో ఉన్న సంతృప్తి మరెక్కడా లేదన్నారు.
ఈఏడాది వర్షాలు సరిగా కురవకపోవడం బాధాకరమని.. బోర్లు, బావుల కింద వ్యవసాయానికి ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం అందిస్తామన్నారు.


Read More
Next Story