
జాతీయ మహిళా సదస్సులో మాట్లాడుతున్న రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్
సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక ఏపీ
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ కితాబు. వర్క్ ఫోర్స్ పెరగాలన్న ఎంపీ పురందేశ్వరి
సాంస్కృతిక వారసత్వానికి ఆంధ్రప్రదేశ్ ఓ ప్రతీక అని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ అభివర్ణించారు.
తిరుపతిలో రెండో రోజు మహిళా పార్లమెంటేరియన్ల జాతీయ ముగింపు సదస్సులో ఆయన ప్రసంగించారు. అంతకుముందు రోజు తిరుపతికి సమీపంలోని చారిత్రక చంద్రగిరి కోటలో సాంస్కృతిక వైభవానికి హాజరయ్యారు. రాష్ట్రంలో కళలు, కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలను ఆస్వాదించారు. వారసత్వ సంపదకు ప్రతీకగా ఉన్న చారిత్రక ప్రదేశాలను సందర్శించడం, శ్రీవారిని దర్శించుకున్న రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ రాష్ట్రంలోని వైభవం, మహిళా సాధికారితకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై స్పందించారు.
ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన బీజేపీ ఎంపీ, మహిళా పార్లమెంటీరియన్ల సదస్సు అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ, వర్క్ ఫోర్స్ గా ఉన్న మహిళలు, వ్యాపారరంగంలో రాణించాలని ఆకాంక్షించారు.
తిరుపతిలో సోమవారం ‘మహిళా సాధికార జాతీయ సదస్సు’ ముగింపు కార్యక్రమంలో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ తన మాటల ద్వారా రాష్ట్రం ఉన్న అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
రాష్ట్రానికి చెందిన స్వాతంత్య్ర సరయోధురాలు దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ సేవల హరివంశ్ కొనియాడారు. జాతీయ నేతల స్ఫూర్తి, త్యాగాలను సాకారం చేయడానికి మహిళల్లో చైతన్యం నింపడానికి మారుతున్న కాలానికి అనుగుణంగా కార్యక్రమాల నిర్వహణకు తరచూ మహిళా సాధికార సమావేశాలు ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. ఆకాంక్షించారు.
అర్థవంతమైన చర్చలు
జాతీయ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులో అర్థవంతమైన చర్చలు జరిగాయని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన ఏమన్నారంటే..
"మహిళల సమస్యలే కాదు. వాటికి పరిష్కార మార్గాలను సూచించారు" అని హరివంశ్ నారాయణ్ అభినందించారు.
"మహిళలకు సంబంధించిన అంశాలపై విధానాల రూపకల్పనలో మరింత దృష్టి సారించాలి. జీరో అవర్‌ను మహిళా సభ్యులు ఎక్కువగా వినియోగించుకునేలా లోక్‌సభ స్పీకర్ చర్యలు చేపట్టారు. రాజ్యసభలోనూ అదే పాటిస్తున్నాం. పాలసీలకు సంబంధించిన చట్టసభ చర్చల్లో మహిళలు పాల్గొనడం ద్వారా స్త్రీ, పురుషుల భాగస్వామ్య అంతరం అనే దృక్పథంలో కొంత మార్పు వస్తుంది" అని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. చాలా పథకాలు మహిళలను అభివృద్ధి వైపు నడిపిస్తున్నాయని ఆయన అన్నారు.
ఆపరేషన్ సిందూర్ ను రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ ప్రస్తావించారు. ఈ సమరంలో మహిళా అధికారులు కీలకపాత్ర పోషించిన విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. అంతేకాకుండా, ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే బ్రిడ్జి రూపకల్పనలో మహిళలే కీలకంగా వ్యవహరించారు" అని హరివంశ్ తెలిపారు. తిరుపతి సదస్సులో సాగించిన చర్చలు, తీర్మానాలను మహిళల ఆర్థికాభివృద్ధి ద్వారా సాకారం చేయాల్సిన బాథ్యత అందరిపై ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
మారుతున్న సమాజానికి నిదర్శనం
బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి
అభివృద్ధి సాధించడంలో మహిళలు ముందుండి నడిపిస్తున్నారని బీజేపీ ఎంపీ, పార్లమెంట్ మహిళా సాధికార కమిటీ ఛైర్‌పర్సన్ పురందేశ్వరి అన్నారు. తిరుపతిలో నిర్వహిస్తున్న మహిళా సాధికార కమిటీల జాతీయ సదస్సులో ఆమె ప్రసంగించారు. మారుతున్న సమాజానికి ఈ సమావేశం ఓ నిదర్శనంగా నిలుస్తుందని పేర్కొన్నారు. మహిళలకు సమ న్యాయం, గౌరవ జీవితం ఇచ్చేందుకు ఇలాంటివి ఉపయోగపడతాయని తెలిపారు. ఆమె ఇంకా ఏమన్నారంటే..
"వికసిత్ భారత్-2047 సాధనలో మహిళలు ముందుండి నడిపించాలి. విద్య, వైద్యం, పరిపాలన, వ్యాపార రంగాల్లో రాణించాలి. వృద్ధిలో భాగం కావడం కాదు. ముందుండి నడిపించాలి" అని పురందేశ్వరి సూచించారు.
వర్క్ ఫోర్స్ పెరగాలి..
దేశంలో ఆశా కార్యకర్తల నుంచి ఐఏఎస్ వరకు మహిళల సంఖ్య పెరుగుతూ ఉందనే విషయాన్ని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి గుర్తు చేశారు. వర్క్ ఫోర్స్‌లో వారి సంఖ్య వృద్ధి చెందుతోంది. వారిని వ్యాపార రంగంలో ప్రోత్సహించేందుకు 70 కేంద్ర, 400 రాష్ట్ర పథకాలు ఉన్నాయి. ప్రస్తుత భారత్ ఆర్థిక వృద్ధిలో మహిళలు కీలక భూమిక పోషిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు వారి వృద్ధికి ఉపయోగపడేలా మనందరం కృషి చేయాలి. ఇక్కడ నేర్చుకున్న అంశాలను మీ రాష్ట్రాల్లో అమలు చేయాలి. స్వయం సహాయక సంఘాలు, ప్రజాప్రతినిధులు ఆయా అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. ప్రతి బాలిక గొప్ప కలలు కనేలా, ప్రతి మహిళా వర్క్‌ఫోర్స్‌లో రాణించేలా కలిసి పనిచేద్దాం’’ అని పురందేశ్వరి అన్నారు.
Next Story