తిరుపతి జూ పార్కులో విషాదం.. ఆగని మరణాలు
x
తిరుపతి ఎస్వీ జూ పార్కు (ఫైల్)

తిరుపతి జూ పార్కులో విషాదం.. ఆగని మరణాలు

అనారోగ్యంతో సింధు అనే మరో సింహం మృతి.


తిరుపతి ఎస్వీ జూ పార్కులో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. వయసు మీరడం, అనారోగ్యంతో బాధ పడుతున్న సింధు అనే 23 సంవత్సరాల సింహం మరణించింది.

తిరుపతి జూ పార్కు ( Tirupati SV Zoo Park ) లోని ఈ సింహం ( Lion ) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోందని క్యూరేటర్ సెల్వం చెప్పారు. పశుసంవర్థక శాఖ నిపుణులతో వైద్యం చేయిస్తేన్నా ప్రయోజనం లేకుండా పోయిందని ఆయన చెప్పారు. ఇదిలాఉండగా,

తిరుపతి జంతు ప్రదర్శనశాలలో మరణించిన సింధు అనే సింహాన్ని ఎనిమిది నెలల వయసులో తీసుకుని వచ్చారు. 2002లో దీనికి ఇక్కడికి తరలించినట్లు ఎస్వీ జూపార్కు ( Zoo Park ) సిబ్బంది చెప్పారు. వృద్ధాప్యానికి తోడు అరోగ్య సమస్యల వల్ల చనిపోయిందని అటవీశాఖాధికారులు చెప్పారు. మరణించిన సింహం మృతదేహానికి తిరుపతిలోని ఎస్వీ వెటర్నరీ ప్రొఫెసర్లు శవపరీక్ష నిర్వహించారు. నివేదిక అందిన తరువాత వివరాలు వెల్లడిస్తామని జూ క్యూరేటర్ తెలిపారు.
జూపార్కులో సింహం మరణించిన ఘటనతో దాని సంరక్షణ బాధ్యతలు నిర్వహించే సిబ్బంది కూడా తీవ్ర వేదనకు గురయ్యారు.
"ఆ సింహం క్రూరమృగం కావచ్చు. ఆహారం అందించడానికి వెళ్లే సమయంలో సహకరించేది. చెప్పినట్లే వినేది. అది మా కళ్లముందే కనిపిస్తోంది" అని కొందరు వ్యాఖ్యానించారు.
ఆగని మరణాలు
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ ( Sri Venkateswara Zoological Park ) లో విక్రమ్ అనే 11 ఏళ్ల మగ సింహం గతంలో అనారోగ్యంతోనే మరణించింది. జూ వైద్యులు ఆ సింహానికి చికిత్స అందించినప్పటికీ, పరిస్థితి విషమించి, మరణించింది. ప్రాథమిక విచారణలో
"వృద్ధాప్యం, అనారోగ్య సమస్యల కారణంగానే విక్రమ్ మరణించింది" అని జూ అధికారులు అప్పుడు కూడా తెలిపారు.
2023 డిసెంబరు: 23 ఏళ్ల వయస్సు సీత అనే ఆడ సింహం వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా మరణించింది. అంతకు కొన్ని రోజుల ముందు, అనురాగ్ అనే మరో మగ సింహం కూడా మృతి చెందింది.
​2024 మార్చిలో: ఏడు సంవత్సరాల వయస్సు గల ఒక ఆడ సింహం అనారోగ్యంతో మృతి చెందింది. ఇది మూడు నెలల్లో జూలో చనిపోయిన మూడో సింహం. 2017 జన్మించిన ఈ సింహం కూడా పెల్విన్ లో ట్యూమర్లు, తోక వద్ద గాయడం వల్ల బాధపడుతూ మరణించింది. వైద్యుల సూచనలతో శస్త్రచికిత్స కూడా చేయించినా, నాలుగు రోజులుగా ఆహారం, నీరు కూడా సరిగా తీసుకోని స్థితిలో ఆ సింహం మరణించినట్లు అప్పట్లో జూ అధికారులు వెల్లడించారు. వైద్యులు కూడా ఇదే విషయాన్ని నిర్ధారించారు.
తిరుపతి జూ పార్కుకు పునరావాసం కోసం తీసుకుని వస్తున్న ఏనుగులు కొన్నేళ్ళ పాటు సంరక్షణలో ఉంటున్నాయి. వయసు పైబడే కొద్దీ అనారోగ్యంతో మరణించడంపై వాటిని పర్యవేక్షించే సిబ్బంది కూడా వేదనకు గురవుతున్నారు.
Read More
Next Story