TTD | టీటీడీలో మలిదశ ప్రక్షాళన
x

TTD | టీటీడీలో మలిదశ ప్రక్షాళన

గత ప్రభుత్వ నిర్ణయాలను కూటమి ప్రభుత్వం సమీక్షించింది. అధికారంలోకి వచ్చాక టీడీపీ తన విధానాలు సమీక్షించుకునే పరిస్థితి ఏర్పడింది.


రాష్ట్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం ( tirumala Tirupati devasthanam- TTD) లో మరోసారి ప్రక్షాళనకు ఉపక్రమించాల్సిన అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది. వైసీపీ పాలనలో తీసుకున్న నిర్ణయాలను కూటమి ప్రభుత్వం అధికారం రాగానే సమీక్షించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే అన్నదానం, శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నాణ్యత పెంపుదలకు శ్రద్ధ తీసుకున్నారు. అయితే, తొక్కిసలాట ఘటన తరువాత తమ ప్రభుత్వ కాలంలోనే అధికారుల నియామకంలో తీసుకున్న నిర్ణయాల తోపాటు కొన్ని పరిపాలనా వ్యవహారాలను సమీక్షించడం ద్వారా ప్రక్షాళనతో దిద్దుబాటు చర్యలకు దిగింది. అందులో భాగంగా,


తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందిన ఘటన నేపథ్యంలో ఇద్దరు అధికారులపై బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే .

మళ్లీ మరో ఇద్దరు కీలక అధికారులను బదిలీ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే బదిలీ చేసిన వారి స్థానంలో టీటీడీ సీవీఎస్ఓగా చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలుకు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదివారం మధ్యాహ్నం టీటీడీ సివిఎస్ఓ (chief vigilance and security officer) గా బాధ్యతలు స్వీకరించారు. తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీకి తిరుపతిలో 8 కేంద్రాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వాటిలో బైరాగిపట్టెడ సమీపంలోని రామానాయుడు మున్సిపల్ హై స్కూల్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించారు. దాదాపు 43 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై తిరుపతిలో స్వయంగా సమీక్షించిన సీఎం ఎన్ . చంద్రబాబు సివిఎస్ఓ గా ఉన్న శ్రీధర్, తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బారాయుడును బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆ స్థానంలో తాత్కాలికంగా చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు కు అదనపు బాధ్యతలు అప్పగించడం ద్వారా భద్రత ఏర్పాట్లకు లోపం లేకుండా సీఎం చర్యలు తీసుకున్నారు. ఎందుకంటే..

తిరుమల శ్రీవారి దర్శనానికి రోజు లక్ష మందికి పైగా యాత్రికులు వస్తుంటారు. తిరుపతి నగరంలో కూడా అనేక రాష్ట్రాల నుంచి వచ్చే వారితో నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో తిరుపతి, తిరుమలకు దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. వీటిని పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం యువ అధికారులను కీలక పోస్టుల్లో నియమించడానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. అందులో భాగంగానే
తిరుపతి జిల్లా, టీటీడీ సివిఎస్ఓగా ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠకు అదనంగా ఈ రెండు బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఈయనకు ఇక్కడే పూర్తి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. చిత్తూరు, తిరుపతి జిల్లాల ఎస్పీలుగా కొత్త అధికారులను అది కూడా యువకులకే ప్రాధాన్యత ఇవ్వనన్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. చిత్తూరు జిల్లా తిరుపతికి సమీపంలోని సొంత ఊరు నారావారిపల్లెలోనే ఉన్న సీఎం చంద్రబాబు దీనిపై త్వరలోనే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఈఓ, జేఈవో చలనం?
తిరుపతి తొక్కిసలాట ఘటన నేపథ్యంలో సీఎం చంద్రబాబు సీరియస్ గానే స్పందించారు. టీటీడీ జేఈవో గౌతమి, సి వి ఎస్ ఓ శ్రీధర్ పై బదిలీ వేటు వేశారు. అలాగే తిరుపతి ఎస్పీని బదిలీ చేసిన విషయం తెలిసిందే . తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఇంకొందరు అధికారులపై వేటుపడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఒకేసారి సీనియర్ అధికారులపై చర్యలు తీసుకుంటే, వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే అని సీఎం చంద్రబాబు భావించినట్లు చెబుతున్నారు. ఇది వాస్తవం కూడా. ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే రెండో విడతగా టీటీడీ ఈవో జే. శ్యామలరావు, అదనపు ఈఓ వీరబ్రహ్మం ను కూడా బదిలీ చేసే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. వైసిపి అధికారంలో ఉండగా వీరబ్రహ్మం తిరుపతి జేఈవోగా నియమితులయ్యారు. కాగా సీఎమ్ఓ (CMO)లోని ఓ అధికారిని ఈవోగా నియమించనున్నారని సమాచారం. సంక్రాంతి తరువాత బదిలీలకు ఆస్కారం ఉన్నట్లు తెలుస్తుంది.
Read More
Next Story