వికసిత భారత్ కు.. ఆంధ్రానే చుక్కాని
x
కర్నూలు సభలో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ

వికసిత భారత్ కు.. ఆంధ్రానే చుక్కాని

కర్నూలు సభలో సభలో సీఎం, డిప్యూటీ సీఎంపై ప్రధాని మోదీ ప్రశంశల జల్లు


రాష్ట్రంలో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధి 20047 నాటికి వికసిత భారత్ ఆవిష్కరణకు చుక్కాని కోబోతోందని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. సైన్స్ ఆవిష్కరణకు కేంద్ర బిందువుగా మారిన ఏపీలో దూరదృష్టి, శక్తివంతమైన నాయకత్వం, పరుగులుదీస్తున్న అభివృద్ధి దీనికి నిదర్శనం అని ఆయప సీఎం నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసలతో ముంచెత్తారు.

కర్నూలు నగరంలో గురువారం సాయంత్రం జరిగిన సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమానికి వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ నగర శివారులో లక్షలాదిమంది ప్రజలను ఉద్దేశించి మధ్యాహ్నం 3:43 నుంచి 4. 16 గంటల వరకు హిందీలో ప్రసంగించారు. ఆయన ప్రసంగాన్ని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారాపు రామ్మోహన్ నాయుడు తెలుగు లోకి అనువదించారు.

ఈ సభలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ..
"ఏపీ ఆత్మగౌరవంతో పాటు సంస్కృతికి, నిలయం. సైన్స్ కు ఇన్నోవేషన్ సెంటర్. ఇక్కడి యువతకు అపార శక్తి ఉంది. దూరదృష్టి, పటిష్టమైన నాయకత్వం ఉంది" అని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చెప్పినట్లు జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధి చూస్తే స్వాతంత్రం వచ్చి వందో సంవత్సరం పూర్తి అయ్యే 2004 నాటికి భారతదేశం వైపు అన్ని దేశాలు చూస్తాయని ఆ దిశగా అభివృద్ధి సాధించగలమని ప్రధాని నరేంద్ర మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.
"21వ శతాబ్దం భారతదేశ శతాబ్దం అవుతుందనే నమ్మకం నాకు దృఢంగా ఉంది". అని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. డబల్ ఇంజన్ సర్కార్ ఆధ్వర్యంలో రాష్ట్రం అపూర్వమైన ప్రగతి సాధించడానికి అవసరమైన సహకారం అందిస్తున్నామని కూడా ఆయన చెప్పారు
దేశాభివృద్ధిలో రాష్ట్రం, రాయలసీమ మరింత పురోభివృద్ధిలో కీలకపాత్ర పోషించబోతోందని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ వేగవంతంగా అభివృద్ధి సాధించడానికి పారిశ్రామిక ఓర్వకల్లు, కొప్పర్తి వద్ద పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడును రావడం వంటి కారణాలవల్ల యువతకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయన్నారు. ఇవి పూర్తిగా పారిశ్రామిక అభివృద్ధిలో కీలకమైన ఈ కారిడార్లలో ప్లగ్ అండ్ ప్లే, బహుళ రంగా కేంద్రాలుగా పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందడం ద్వారా 21,000 కోట్ల పెట్టుబడును ఆకర్షించడమే కాకుండా లక్ష మంది ఉద్యోగాలకు ఊతమిస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు
ఇంధన భద్రత ఇచ్చాం..

ఏ రాష్ట్రానికి అయినా ఇంధన భద్రత కీలకమైంది కర్నూల్ లో ఏర్పాటు చేసిన ప్రాజెక్టు ద్వారా ఏర్పడిందని ఆయన గుర్తు చేశారు. ఇదే సమయంలో 11 సంవత్సరాల కిందట అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని నిర్లక్ష్యం చేసిందనే విషయాన్ని మర్చిపోకూడదని నరేంద్ర మోదీ చుణుకులు కూడా విసిరారు.
"పట్టణ ప్రాంతాలే కాదు గ్రామీణ ప్రాంతాలకు కూడా విద్యుత్ వెలుగులను ప్రసాదించడంలో శ్రద్ధ తీసుకున్నాం" అని గుర్తు ప్రధాని మోదీ గుర్తుంచేశారు. ఇంధన విప్లవానికి కేంద్రంతోపాటు ఆంధ్ర ప్రదేశ్ తెర తీసిందని చెప్పారు. గ్రీన్ ఎనర్జీ, విద్యుత్ ఉత్పత్తిలో కొత్త రికార్డులు సృష్టించినట్లు ఆయన చెప్పారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు సహజవాయువును 15 లక్షల ఇండ్లకు గ్యాస్ సరఫరా చేయడానికి అవసరమైన దశలు పాటు కూడా అందుబాటులోకి తెచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ చిత్తూరులో ఎల్పిజి బాటిలింగ్ ప్లాంట్ కూడా ప్రారంభించిన విషయాన్ని ప్రస్తావించారు. రోజుకు 20వేల సిలిండర్లు ఇక్కడ నింపడానికి సామర్థ్యం ఉందని వివరించారు.
వికసిత భారత్లో మల్టీ మోడల్ ప్రాజెక్టులు తీసుకురావడం వల్ల గ్రామం నుంచి నగరాలు నగరాల నుంచి కోర్టుల వరకు అంటే సబ్బవరం నుంచి షీలానగర్ వరకు కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సంకల్పించిన స్వర్ణాంధ్ర ఏపీ సామర్థ్యాన్ని మరింత పెంచడానికి కేంద్రం సంపూర్ణ స్నేహ హస్తం అందిస్తోంది అన్నారు.
"భారతదేశంలో ప్రధానంగా ఏపీ సామర్థ్యాన్ని ప్రపంచం గమనిస్తోంది. అందుకే విశాఖ కేంద్రంగా గూగుల్ భారీ పెట్టుబడికి ముందుకు వచ్చిందని" ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించారు.
విశాఖలో ఏర్పాటైన గూగుల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ వల్ల అంతర్జాతీయంగా యుగముతులకు కేంద్రంగా మారింది. ఇది సి గెట్ వే గా అభివృద్ధి చెందింది అని ప్రధాని గుర్తు చేశారు. విశాఖ కేంద్రం నుంచి కనెక్టివిటీలో ప్రపంచ సేవా కేంద్రంగా మారబోతున్న విషయాన్ని ఆయన ప్రకటించారు.
ఏపీ సంకల్పానికి కేంద్రం నుంచి పూర్తి సహకారం అందించాం. ఇది భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని కూడా ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. కర్నూలు జిల్లా నిమ్మలూరు వద్ద ఏర్పాటయ్యే డ్రోన్ హబ్, రక్షణ పరికరాలు కూడా దేశ రక్షణకే కాకుండా, దేశానికి గర్వకారణం అని ఆయన అన్నారు. ప్రపంచ మార్కెట్ లో డ్రోన్ వాణిజ్యం మరింత పురోభివృద్ధి సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఓకల్ ఫర్ లోకల్

దేశంలో అభివృద్ధి, సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూనే, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే దిశగా సాగుతోందన్నారు. పౌరుల జీవన ప్రమాణాల మెరుగుదలకు ఓకల్ ఫర్ లోకల్ నినాదంతో జీఎస్టీలో సంస్కరణల వల్ల పన్నుల తగ్గుదల వల్ల జీవనం సౌకర్యవంతంగా కూడా మారడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. నవరాత్రి కానుకగా జీఎస్టీ భారం తగ్గించడమే దీనికి నిదర్శనం అని ఆయన గుర్తు చేశారు. దీని వల్ల ఏపీలో ప్రజలకు ఎనిమిది వేల కోట్ల భారం తగ్గిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
Read More
Next Story