
'అలిపిరి బైపాస్'లోనే చిరుతలు ఎందుకు పంజా విసురుతున్నాయి?
బైక్ పై వెళుతున్న వ్యక్తిపై దాడి.
తిరుపతి నగరం అలిపిరి ప్రాంతంలో చిరుత పులులు దడ పుట్టిస్తున్నాయి. వాహనదారులపై కూడా దాడులకు దిగుతున్నాయి. తిరుమల కొండకు కింద ఉన్న అటవీప్రాంతం అనువుగా మారడం వల్ల చిరుతల సంచారం పెరిగింది.
అలిపిరి నుంచి జూపార్క్ వెళ్లే మార్గంలో శుక్రవారం రాత్రి బైక్ పై వెళుతున్న వ్యక్తిపై చిరుత దాడికి దిగింది. వేగంగా దూసుకుని వెళ్లడంతో తృటిలో ఆయన ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. జరిగిన ఘటనతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
"అలిపిరి మార్గంలో చిరుత వల్ల ప్రజలకు ప్రమాదం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం" అని తిరుపతి అటవీశాఖ రేంజ్ అధికారి సుదర్శన్ చెప్పారు. ఈ ప్రాంతంలో సంచరిస్తున్న రెండు చిరుతలను బంధించడానికి బోన్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
అలిపిరి మార్గంలో బైక్ పై వెళుతున్న వ్యక్తిపై దాడి చేస్తున్న చిరుతపులి
రెండో ఘటన
తిరుపతిలోని అలిపిరి నుంచి జూ పార్క్ వెళ్లే మార్గంలో ఈ తరహా దాడి జరగడం ఇది రెండవది. సరిగ్గా వారం కిందట కూడా ఇదే మార్గంలో రోడ్డు పక్కనే ఉన్న కల్వర్టు అరుగుపై కూర్చున్న చిరుత పులి వాహనదారులను బెంబేలెత్తించింది. తాజాగా బైక్ పై వెళుతున్న వ్యక్తిపై దాడికి దిగింది.
పెరిగిన చిరుతల సంతతి
తిరుమల రెండు ఘాట్ రోడ్లలో చిరుతల సంచారం ఎక్కువైంది. దీనికి కారణం వాటి సంతతి పెరగడమే అని అటవీశాఖాధికారులు చెబుతున్నారు. దీంతో స్పందించిన టిటిడి అటవీ శాఖ ముందస్తు చర్యలు తీసుకుంది.
తిరుమల నుంచి తిరుపతికి వచ్చే మార్గంలో నృసింహస్వామి ఆలయం నుంచి ఏడో మైల వరకు టీటీడీ గార్డులను ఏర్పాటు చేశారు. ఏడవ మహిళ వద్ద ఉన్న ఆంజనేయస్వామి భారీ విగ్రహం వద్ద కూడా ఓ చెక్ పోస్ట్ సిబ్బందిని అందుబాటులో ఉంచారు.
ఈ మార్గంలో తిరుమలకు కాలిబాటలో నడిచి వెళుతున్న నెల్లూరు జిల్లా కు చెందిన ఓ బాలికను చిరుత పులి రెండేళ్ల కిందట చంపివేసిన విషాదకర ఘటన నేపథ్యంలో టిటిడి అధికారులు మరింత అప్రమత్తమై, జాగ్రత్తలు తీసుకున్నారు.
తిరుపతిలోని అలిపిరి గాలి బాటలో వెళ్లే యా త్రికులను ఒక్కొక్కరుగా కాకుండా, కనీసం 50 మంది పోగైన తర్వాత గుంపులుగా కాలిబాటలో అనుమతిస్తున్నారు. టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ గార్డులు ఆ మేరకు భద్రత చర్యలు తీసుకుంటున్నారు.
బైక్ పై వెళుతున్న వ్యక్తిపై దాడి..
ఇటీవల కాలంలో తిరుమల కనుమదారుల్లోనే కాకుండా మైదాన ప్రాంతంలో కూడా చిరుతపురుల సంచారం పెరిగింది.
అలిపిరి నుంచి జూ పార్క్ రోడ్ బైపాస్ రోడ్డుగా ఏర్పాటు చేశారు. దీంతో తిరుపతి చుట్టుపక్కల ఉన్న వారు దిసకర వాహనాల్లో ఎక్కువగా వెళుతుంటారు. కార్లు జీపులు బస్సులు కూడా ఈ మార్గంలోనే ప్రయాణిస్తూ ఉంటాయి. శుక్రవారం రాత్రి ఓ వ్యక్తి బైక్ లో అలిపిరి నుంచి జూ పార్క్ రోడ్లో వెళ్తుండగా, క్యాన్సర్ ఆసుపత్రికి సమీప ప్రాంతంలో చచ్చాడుతున్న ఓ చిరుత పులి దాడి చేసింది. ద్విచక్ర వాహనాన్ని వేగంగా నడపడంతో తోటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఒక్క ఉదుటన దూకిన చిరుత పులి బైక్ వెనక భాగం తగలడంతో మూతి వద్ద స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తోంది. అదే సమయంలో వెనక వస్తున్న ఓ కారు ముందు భాగంలో ఉన్న సిసి కెమెరా ద్వారా ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.
అటవీ శాఖ అప్రమత్తం
అలిపిరి బైపాస్ రోడ్డు లో చిరుత పులి దాడి సంఘటన గెలిచిన వెంటనే అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. సిబ్బందిని ఆ ప్రాంతానికి పంపించి గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ ఘటనపై తిరుపతి ఎఫ్ఆర్ఓ (forest range officer FRO) సుదర్శన్ 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో మాట్లాడుతూ,
"అలిపిరి మార్గంలో చిరుతను బంధించడానికి బోను ఏర్పాటు చేస్తున్నాం" అని చెప్పారు. తిరుమలలో కూడా చిరుతపులుల సంఖ్య కూడా పెరిగింది అని ఎఫ్ఆర్ఓ సుదర్శన్ చెబుతున్నారు.
"తిరుమలకు కొండ దిగువన ఉన్న అలిపిరి నుంచి జూ పార్కు వెళ్లే మార్గంలో చిరుతపులకు వాతావరణం బాగా ఉంది" అని ఎఫ్ ఆర్ వో సుదర్శన్ తెలిపారు.
అలిపిరి నుంచి జూ పార్కు వెళ్లే మార్గంలో ఆసుపత్రులు, విద్యాసంస్థలు భారీగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో చిరుత పులుల సంచారానికి అటవీ ప్రాంతం అణువుగా ఉందని ఎఫ్ఆర్ఓ చెబుతున్నారు.
"ఈ ప్రదేశాల్లో ఆహారం కూడా వాటికి కావలసినంత దొరుకుతుంది. వీధి కుక్కలు, గుంపులుగా సంచరించే చిన్న జింకలు, వన్యప్రాణుల కారణంగానే చిరుతపుల్లో స్వేచ్ఛగా తిరగడానికి ఇక్కడి వాతావరణం పలుకూలించింది" అని ఎఫ్ ఆర్ వో సుదర్శన్ వివరించారు.
జనావాసాలు, వాహనాలపై వెళ్లే వారికి చిరుత పులులతో ప్రమాదం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం అని ఎఫ్ఆర్ఓ సుదర్శన్ స్పష్టం చేశారు.
ఈ ఏడాది జనవరిలో తిరుమలలో విధులు ముగించుకుని వచ్చిన టీటీడీ ఉద్యోగి విజయకుమార్ గాయపడ్డాడు. రోడ్డు దాటుతున్న చిరుతను చూసి, భయపడిన విజయకుమార్ బైక్ అదుపుతప్పి, డివైడర్ ను ఢీకొట్టడంతో గాయపడ్డారు. ఈ శబ్దానికి జడిసిన చిరుత అడవిలోకి పారిపోయింది. వాహనదారులు గమనించి, గాయపడిన విజయకుమార్ ను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. తాజా ఘటన నేపథ్యంలో చిరుతలను బంధించి, జూ కు తరలించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎఫ్ఆర్ఓ సుదర్శన్ చెప్పారు.
Next Story