
ప్రకాశం జిల్లా పెళ్లి బృందాన్ని వెంటాడిన ప్రమాదం
కారును మినీ లారీ ఢీకొనడంతో ఒకరు మరణించారు. ఎనిమిది మంది గాయపడిన సంఘటన నెల్లూరు వద్ద జరిగింది.
ఓ శుభకార్యానికి వెళ్లిన ఎనిమిది మంది సభ్యులు కారులో ఆనందంగా తిరిగి సొంత ఊరికి బయలుదేరారు. వారి కారు నెల్లూరు సమీపంలో ప్రయాణిస్తోంది. ఎదురుగా వస్తున్న మినీ లారీ శనివారం తెల్లవారుజామున ఢీకొన్న ఘటనలో ఒకరు మరణించారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరగడంతో గమనించిన స్థానికులు, గ్రామస్తుల సమాచారం అందించారు. బాధితులను నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు..
ప్రకాశం జిల్లా పెద్దచెర్లోపల్లి మండలానికి చెందిన ఓ కుటుంబం నెల్లూరు జిల్లా కలవాయి మండలం చీపినాపి గ్రామంలో ఓ శుభకార్యానికి వెళ్లారు. అనంతరం కారులో తిరిగి పెద్దచెర్లోపల్లెకు బయలుదేరారు. నెల్లూరు జిల్లా వరికుంటపాడు పోలీస్ స్టేషన్ సమీపంలోని హైవేపై ఆ బృందం ఉన్న తెల్లవారుజామున కారు ప్రయాణిస్తోంది. అదే సమయంలో బంతిపూల కోసం ఓ మినీలారీ విజయవాడ నుంచి కదిరికి వెళుతోంది. కారు, మినీలారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా మరో 8 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 సహాయంతో పామూరు, ఉదయగిరి ఆస్పత్రులకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియలేదు.
Next Story