శ్రీవారి లడ్డూ ప్రసాదాల విక్రయంలో సరికొత్త రికార్డు
x

శ్రీవారి లడ్డూ ప్రసాదాల విక్రయంలో సరికొత్త రికార్డు

13.52 కోట్ల లడ్డూ ప్రసాదాల విక్రయం.


2024 తో పోల్చితే 10 శాతం అధికం. 2025 లో రికార్డు స్థాయిలో ల‌డ్డూల విక్ర‌యాలు. ల‌డ్డూల రుచి, నాణ్య‌త‌పై భ‌క్తుల్లో సంతృప్తి, టీటీడీ చైర్మన్, ఈఓ

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల విక్రయల్లో సరికొత్తరికార్డు నమోదైంది. పది సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా 2025లో 13.52 కోట్ల లడ్డూ ప్రసాదాల విక్రయాలు జరిగాయి. 2024వ సంవత్సరంతో పోలిస్తే లడ్డూ విక్రయాలు పది శాతం పెరిగిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

2025 డిసెంబర్ 27వ తేదీలో కూడా కొత్త రికార్డు నమోదైంది. పదేళ్లలో ఎన్నడూ లేనంతగా 5.13 ల‌క్ష‌ల ల‌డ్డూల‌ను భ‌క్తులు కొనుగోలు చేశారు. గడచిన పది సంవత్సరాల్లో ఇది ఓ రికార్డుగా టీటీడీ అధికారులు వెల్లడించారు. నెయ్యిలో నాణ్యత మెరుగుపరచడం, పరిశుభ్రత వంటి కారణాలు కూడా దీనికి తోడయ్యాయని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి రోజూ 65 వేల నుంచి 75 వేల మంది వరకు వస్తుంటారు. వారాంతపు సెలవుల్లో ఆ సంఖ్య90 వేలకు కూడా చేరుతుంది. డిసెంబర్ 28వ తేదీ ఆదివారం 91,147 వేల మందికి యాత్రికులు శ్రీవారిని దర్శించుకోవడం ఓ రికార్డు.
"తిరుమలకు వచ్చిన యాత్రికులకు మంచి దర్శనం కల్పించడంలో పారదర్శక విధానాల వల్లే ఇది సాధ్యమైంది" అని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు స్పష్టం చేశారు. తిరుమల తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రంలోఅన్నప్రసాదాల్లో కూడా నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన చెప్పారు.
"వారంతాపు సెలవుల్లోనే కాకుండా, సాధారణ రోజుల్లో యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న లెక్కలు స్పష్టం చేస్తున్నాయి" అని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ కూడా తెలిపారు.
తిరుమలలో పరిస్థితులు యాత్రికులకు అనుకూలంగా మార్చడానికి తీసుకుంటున్న చర్యలు ఫలిస్తున్నాయని ఆయన చెప్పారు. శ్రీవారి దర్శనం, లడ్డూ ప్రసాదాల తయారీ, అన్నప్రసాదాల్లో నాణ్యతలో మార్పు రావడం యాత్రికులకు సంతృప్తి కలిగిస్తున్నదనే సమాచారంయాత్రికుల ఫీడ్ బ్యాక్ ద్వారా స్పష్టం అవుతోందని ఈఓ సింఘాల్ చెప్పారు.
పదేళ్ల తరువాత..
2025 సంవ‌త్స‌రంలో శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదాలు రికార్డుస్థాయిలో విక్ర‌యించారు. 2024వ సంవ‌త్స‌రంతో పోల్చితే 10 శాతం అధికంగా ల‌డ్డూలు యాత్రికులు కొనుగోలు చేశారు. 2024లో 12.15 కోట్ల‌ ల‌డ్డూలు విక్రయించారు. 2025లో 13.52 కోట్ల ల‌డ్డూలు టీటీడీ భ‌క్తుల‌కు విక్ర‌యించింది. అంటే.. 1.37 కోట్ల ల‌డ్డూల‌ను ఈ ఏడాది అద‌నంగా భ‌క్తుల‌కు విక్ర‌యించారు. తిరుమలలో పది సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా 2025 డిసెంబ‌ర్ 27వ తేదీ అత్య‌ధికంగా 5.13 ల‌క్ష‌ల ల‌డ్డూల‌ను భ‌క్తులు కొనుగోలు చేశారు. గత పదేళ్లలో ఇదే అత్యధిక విక్రయం.
పెరిగిన లడ్డూ నాణ్యత

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి నెయ్యి, డ్రైఫ్రూట్స్, కలగండి, ఇతర పదార్ధాల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. దీనివల్ల లడ్డూ ప్రసాదాల విక్రయాలు కూడా పెరిగిన విషయం ఈ లెక్కలు పరిశీలిస్తే స్పష్టం అర్థం అవుంది.
రద్దీ.. పెరిగిన సామర్థ్యం
తిరుమల శ్రీవారి దర్శనానికి సరాసరిన 80 వేల మంది యాత్రికులు దర్శనం చేసుకుంటారు. దర్శనానికి వెళ్లకున్నా, లడ్డూ ప్రసాదాల విక్రయానికి నియంత్రణ లేకపోవడం వల్ల యాత్రికులతో పాటు సామాన్యులు కూడా కొనుగోలు చేస్తుంటారు. ఈ పరిస్థితుల్లో నాణ్యత పెరిగిన నేపథ్యంలో టీటీడీ రజు వారి లడ్డూల నిలువ సామర్థ్యం పెంచింది. రోజుకు మూడు నుంచి 3.5 లక్షల లడ్డూలు తయారు చేసేవారు. గత సంవత్సరం నుంచి లడ్డూల తయారీ పెంచారు. రోజూ నాలుగు లక్షల లడ్డూల తీయారు చేయడం ద్వారా నిలువ ఉంచి, యాత్రికులకు విక్రయిస్తున్నారు. అంటే,
"యాత్రికులకు కొరత లేకుండా కోరినన్ని లడ్డూలు అందివ్వాలనేది ప్రధాన ఉద్దేశం. దీనికోసం లడ్డూల తయారీ, నిలువ సామర్థ్యం పెంచాం" అని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు స్పష్టం చేశారు. ముఖ్య‌మైన రోజుల్లో 8 ల‌క్ష‌ల నుంచి 10 లక్షల ల‌డ్డూల వ‌ర‌కు (buffer) నిలువ ఉంచి యాత్రికులకు విక్రయిస్తున్నట్లు ఆయన వివరించారు.
తిరుమల శ్రీవారి పోటు (లడ్డూ ప్రసాదాలతయారీ కేంద్రం. వంటశాల) సామర్థ్యం కూడా పెంచారు. ఈ కేంద్రంలో 700 మంది శ్రీ‌వైష్ణ‌వ బ్ర‌హ్మ‌ణులు శ్రీ‌వారి పోటులో లడ్డ ప్రసాదాల తయారీలో పనిచేస్తున్నారు రెండు షిప్టుల్లో 24 గంట‌లు ఇక్కడి సిబ్బంది పనిచేయడం వల్లే గణనీయంగా ఉత్పత్తి పెరగడానికి ఆస్కారం ఏర్పడింది.
Read More
Next Story