శ్రీవారి ఆభరణాలకు పక్కా లెక్క... కల్యాణ మండపాలు ఏం చేద్దాం..
x

శ్రీవారి ఆభరణాలకు పక్కా లెక్క... కల్యాణ మండపాలు ఏం చేద్దాం..

టీటీడీ ఆస్తుల రక్షణపై ఫోకస్ పెట్టిన ఈఓ.


తిరుమల శ్రీవారి ఆస్తుల రక్షణకు కార్యాచరణ ప్రారంభమైంది. శ్రీవెంకటేశ్వర స్వామి వారి తిరువాభరణాల రికార్డులు డిజిటలైజేషన్ చేయడంతో పాటు, టీటీడీ కల్యాణ మండపాల నిర్వహణపై దృష్టి సారించారు.

"టిటిడి కళ్యాణమండపాల నిర్వహణపై సమగ్ర నివేదిక సిద్ధం చేయండి" అని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిపలనా భవనంలోజేఈఓ వి. వీరబ్రహ్మం, సివిఎస్వో కే.వి. మురళీకృష్ణ, ఎఫ్ఏఅండ్ సీఏఓ ఓ. బాలాజీ, సీఈ టి.వి. సత్యనారాయణ, మిగతా శాఖల అధికారులతో ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ అంతర్గత ఆడిట్ సమీక్షలో కీలక ఆదేశాలు జారీ చేశారు.
"టీటీడీ బోర్డు సమావేశం జరిగే నాటికి నివేదికలు సమర్పించండి" అని ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. దేశంలోని కల్యాణ మండపాల నిర్వహణపై టీటీడీకి భారం కాకుండా, ఆదాయ వనరుగా మార్చే దిశగా కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు టీటీడీ అధికారుల ద్వారా తెలిసిన సమాచారం.

కల్యాణ మండపాలపై ఫోకస్..
టీటీడీ ద్వారా దేశంలోని అనేక ప్రాంతాల్లో కళ్యాణ మండపాలు నిర్మించారు. ఇంకా నిర్మించాలని టిటిడికి విజ్ఞాపనలు అందుతూనే ఉన్నాయి. దేశంలోనే 37 ప్రాంతాల్లో టీటీడీ కల్యాణ మండపాలు నిర్మించింది. వాటిలో 166 కల్యాణ మండపాల నిర్వహణ బాధ్యతను టెండర్ల ప్రాతిపదికన ప్రైవేటు వ్యక్తులకు అప్పగించింది. 29 కళ్యాణ మండపాలను దేవాదాయ శాఖలోని ఆలయాలకు లీజుకి ఇచ్చింది. వీటి ద్వారా టీటీడీకి సంవత్సరానికి 4.28 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నట్లు అధికార వర్గాల సమాచారం.
రాష్ట్రంలో 184, తెలంగాణ‌లో 65, ఒడిశాలో ఒకటి, క‌ర్ణాట‌క‌లో మూడు, కేర‌ళ‌లో ఒకటి, త‌మిళ‌నాడులో రెండు కల్యాణ మండ‌పాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి.
2029లో వాటిన్నింటినీ అధునీకరించారు. కాగా, దేశంలో అనేక ప్రాంతాల్లో నిర్మించిన కళ్యాణ మండపాలను మూడు గ్రేడ్లుగా విభజించి, నిర్వహణ జరుగుతుంది. నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో అంటే జాతీయ రహదారులు సమీపంలో నిర్మించిన కళ్యాణ మండపాల నిర్వహణ భారం పెరిగింది. సుమారు 20 ఏళ్ల నుంచి కళ్యాణ మండపాలను టెండర్ ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నారు.
తిరుపతి పరిపాలన భవనంలో ఈవో అనిల్ కుమార్ సింగల్ నిర్వహించిన అంతర్గత ఆడిట్ సమావేశంలో కళ్యాణ మండపాలకు సంబంధించి కీలకంగా చర్చించారు.
"దేశంలో టీటీడీ కల్యాణ మండపాలు ఎన్ని ఆదరణలో ఉన్నాయి. ఆదరణ తక్కువగా ఉన్నవి ఎన్ని, ఆధునీకరించిన మండపాల వివరాలు, వాటి స్థితిగతులపై సమగ్ర నివేదిక రూపొందించండి" అని ఇవ్వు అనిల్ కుమార్ సింగల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వీటన్నిటిపై నివేదిక తయారు చేయడం ద్వారా కళ్యాణాలు నిర్వహించుకునేందుకు వీలుగా సమగ్ర విధానం సిద్ధం చేయాలని, ఆ నివేదిక ఈ నెలలో జరగబోయే టీటీడీ పాలక మండల కి నివేదించాలని తిరుపతి జేఈవో వీర బ్రహ్మమును ఆదేశించారు.
ఆభరణాల రికార్డులు డిజిటలైజేషన్
తిరుమల శ్రీవారి ఉత్సవాల్లో, స్వామి వారికి నిత్యం అలంకరించే తిరువాభరణాల రికార్డులపై కూడా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు.
తిరువాభరణాలు అంటే టీటీడీ నిర్వహించే ఆలయాల్లో ప్రధానంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తిరుమలలో అలంకరించే విలువైన ఆభరణాలు, నగల సమూహాన్ని తిరువాభరణాలుగా పిలుస్తారు. తిరుమలలో ఇవి అత్యంత కట్టు తీర్థమైన భద్రత మధ్య కాపాడుతూ ఉంటారు.
తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతిరోజు ఆభరణాలతో అలంకరిస్తారు. పౌర్ణమి రోజు నిర్వహించే గరుడోత్సవానికి ప్రత్యేక ఆభరణాలు అంటే వజ్రాలు, పచ్చలు, ముత్యాలు పొదిగిన కిరీటాలు, కవచాలు, నెక్లెస్, ఇతర విలువైన ఆభరణాలను అలంకరిస్తారు.
వీటన్నిటి భద్రత కోసం టిటిడి ప్రత్యేక వ్యవస్థను తిరుమల ఆలయంలో ఏర్పాటు చేసింది. ఇవి కాకుండా యాత్రికులు కూడా శ్రీవారికి ఆభరణాలు సమర్పిస్తూ ఉంటారు. వాటిని కూడా తిరువాభరణాల కిందే పరిగణిస్తారు.
బ్రిటిషర్లు, రాజుల కాలం నుంచి తిరుమల శ్రీవారికి అందించిన ఆభరణాల వివరాల తో టీటీడీ 19 రిజిస్టర్లను నిర్వహిస్తోంది. అనుబంధ ఆలయాలకు సంబంధించి కూడా ప్రత్యేక రికార్డులు ఉంటాయి.
"టీటీడీ ఆలయాల్లోని తిరువాభరణ రిజిస్టర్ లను డిజిటలైజేషన్ చేయండి. ఆ డాక్యుమెంటల్ కూడా రూపొందించండి" అని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగల్ అధికారులను ఆదేశించారు.
దేశంలోని అనేక ప్రాంతాల్లో శ్రీవారికి కానుకగా సమర్పించిన భూములు, ఆస్తులపై ఖచ్చితమైన రికార్డులు రూపొందించేందుకు నిపుణుల సహకారం తీసుకోవాలని కూడా ఆయన సూచించారు.
టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఇంకా ఎలాంటి ఆదేశాలు జారీ చేశారంటే..
"తిరుమల, తిరుపతిలోని వసతి గృహాలలో ఎఫ్ఎంఎస్ కు సంబంధించి ఇప్పటికే ఉన్న యాప్‌ను భక్తులకు మరింతగా అందుబాటులోకి తీసుకురావాలి. భక్తులు ఆ యాప్‌ను సులభంగా డౌన్‌లోడ్ చేసుకునేలా క్యూఆర్ కోడ్‌ ఏర్పాటు చేయండి. వారి అభిప్రాయాలను స్వయంగా నమోదు చేసుకునే విధంగా చర్యలు తీసుకోండి. టిటిడి వసతి గృహాలలో ఫెసిలిటీ మేనేజ్మెంట్ సేవలను మరింత మెరుగుపరచండి. యాత్రికలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సమస్యలు త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు ఉండాలి" అనిఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు.
దర్శన టికెట్లు...
టిటిడి అనుబంధ ఆలయాలలో భక్తులకు దర్శన టికెట్లు, ఆర్జిత సేవలలో పాల్గొనే భక్తులకు బహుమానాల జారీకి టికెట్ స్కానింగ్ సదుపాయాలు కల్పించాలని ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ సూచన చేశారు. ఇంజినీరింగ్ విభాగంలో కాంట్రాక్టర్లకు సకాలంలో చెల్లింపుల్లో ఆలస్యం చేయవద్దని ఆయన ఆదేశించారు.
నియామకాలు..
టిటిడి వేద పాఠశాలల్లో బోధనా సిబ్బందిని భర్తీ చేయాలని ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. అటవీ విభాగంలో ఇంకా పెండింగ్ లోని పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలన్నారు. టిటిడి ఆలయాలు, వసతి గృహాలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఈఓ సూచించారు.
Read More
Next Story