తిరుచానూరు శ్రీశ్రీనివాసుడికి  600 వెండి కాసుల హారం
x

తిరుచానూరు శ్రీశ్రీనివాసుడికి 600 వెండి కాసుల హారం

తిరుచానూరు యాత్రికుడి కానుక.


తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయంలోని శ్రీశ్రీనివాసుడికి ఆరు వందల వెండి కాసుల హారం ఓ యాత్రికుడు సోమవారం కానుకగా సమర్పించారు. రోజుల వ్యవధిలోనే శ్రీనివాసుడికి అందిన కానుకల్లో ఇది రెండవది.

తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయంలో అనుబంధ ఆలయాలు కూడా ఉన్నాయి. అందులో శ్రీశ్రీనివాసుడి ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయంలోని మూలమూర్తికి ధరింప చేయడానికి తిరుచానూరుకు చెందిన డి. సాంబశివరావు 600 గ్రాముల వెండి కాసులహారం అందించారు. దీనివిలువ ఎక్కడా ప్రస్తావించలేదు. తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయ ఏఈఓ దేవరాజులుకు ఈ కాసులహారం అందజేశారు.

స్వామివారికి కానుక సమర్పించిన దాతలకు స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం ఆశీర్వచనాలతో పాటు తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రావణ్ కుమార్, శ్రీహరి, సీనియర్ అసిస్టెంట్ ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీహరి, దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
వారం కిందట...
తిరుచానూరులోని శ్రీశ్రీనివాస ఆలయానికి ఈ నెల 15వ తేదీ తిరుపతికి చెందిన యాత్రికుడు కూడా 24 వెండికాసులు ఉన్న గండపేరుండంతో తయారు చేయించిన వెండి హారం కానుకగా సమర్పించిన విషయం తెలిసిందే.
Read More
Next Story