ఇక సెలవు... శ్రీవారి యాత్రికుల సేవతో ధన్యమైతి..
x
టీటీడీ ఈఓ జె. శ్యామలరావుకు వీడ్కోలు పలుకుతున్న అదనపు ఈఓ వెంకయ్య చౌదరి

ఇక సెలవు... శ్రీవారి యాత్రికుల సేవతో ధన్యమైతి..

నిరాడంబరంగా ఈఓ శ్యామలరావుకు వీడ్కోలు.


టిటిడిలో పని చేయడం ఎన్నోజన్మల పుణ్యఫలమని బదిలీ అయిన టిటిడి ఈఓ జె. శ్యామల రావు వ్యాఖ్యానించారు. తిరుపతిలోని పరిపాలన భవనంలో మంగళవారం సాయంత్రం అధికారులు, సిబ్బంది ఆయనకు నిరాడంబరంగా వీడ్కోలు పలికారు. వివిధ విభాగాల అధికారులు ఆయనను శాలువలతో సత్కరించారు. అనంతరం ఈఓ శ్యామలరావు మాట్లాడుతూ,

ఈఓ శ్యామలరావుకు జ్ణాపిక అందిస్తున్న సీవీఎస్ఓ మురళీకృష్ణ, టీటీడీ అధికారులు

దూరదృష్టితో విధానపరమైన పటిష్ట నిర్ణయాలుఅమలు చేశామన్నారు. టిటిడి అంటే మినీ గవర్నమెంట్ తిరుమలలో భక్తుల సౌకర్యాలు, స్థానిక ఆలయాల అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. తనకు నిత్యం పనిచేయడం మాత్రమే తెలుసునని, ప్రచారం చేసుకోవడం తక్కువ అని చెప్పారు. భక్తులు స్వయంగా తమకు అందుతున్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేయడంపై ఆనందంగా ఉందన్నారు.

టీటీడీ పరిపాలనా భవనంలో అధికారులతో చివరి సమావేశంలో మాట్లాడుతున్న ఈఓ శ్యామలరావు

శ్యామలరావు ఇంకా ఏమన్నారంటే..

"భక్తుల నుంచి స్వయంగా అభిప్రాయాలు తీసుకుని లోపాలు సవరించి, మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఉద్యోగుల సహకారం అందించారు. రానున్న 25 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని భక్తులకు అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదాల నాణ్యతగా ఉండేలా పటిష్ట వ్యవస్థలను తీసుకువచ్చాం. ఉద్యోగుల సమిష్టి కృషితో భక్తులకు మెరుగైన సేవలు అందించడంపై సంతృప్తిగా ఉందన్నారు. ఐఏఎస్ అధికారులకు టిటిడి ఈఓగా పనిచేయాలనే కోరిక బలంగా ఉంటుంది. అదృష్టవశాత్తు సీఎం నారా చంద్రబాబు వల్ల ఆ అవకాశం దక్కింది" అని శ్యామలరావు తన పనితీరును ఆవిష్కరించారు.
అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి అంతకుముందు మాట్లాడుతూ, ఏడాదిలోనే శ్యామలరావు చాలా సంస్కరణలు తీసుకువచ్చారని అన్నారు.
"జఠిలమైన సమస్యలు కూడా సమష్టి పనితీరుతో పరిష్కరించారు. శ్రీవారి దర్శనం, లడ్డూ ప్రసాదాలు తయారీ, పంపిణీ, అన్నప్రసాదాల వితరణ, వసతిపై చాలా సంస్కరణలు మరువలేనివి" అని వెంకయ్యచౌదరి గుర్తు చేశారు. ఫీడ్ బ్యాక్ మేనేజ్మెంట్ విధానంతో అన్నప్రసాదాల పంపిణీలో భక్తుల నుంచి 96 శాతం సంతృప్తి వ్యక్తం చేసేందుకు ఈఓ శ్యామలరావు కృషి చాలా ఉందని ఆయన అన్నారు.

ఈఓకు పుష్పగుచ్చం అందిస్తున్న చీఫ్ పీఆర్ఓ తలారి రవి, ట్రాన్స్ పోర్టు జీఎం శేషారెడ్డి

"ఐవీఆర్ఎస్ విధానం, వాట్సాప్ ఫీడ్ బ్యాక్ విధానం, శ్రీవారి సేవకుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి, ఆ అభిప్రాయాలను క్రోడీకరించి లోపాలను సవరించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న తీరు మరువలేనిది" అని వెంకయ్య చౌదరి వ్యాఖ్యానించారు. టీటీడీ ఐటీ విభాగంలో సమూల మార్పుల వల్ల మెరుగైన ఫలితాలు సాధించడానికి మార్గం కల్పించారని శ్యామలరావు అమలు చేసిన విధానాలను జేఈవో వి. వీరబ్రహ్మం వివరించారు. తిరుమలలో భద్రతా చర్యలకు పెద్దపీట వేశారని టిటిడి సివిఎస్వీ మురళీకృష్ణ గుర్తు చేశారు. ఎఫ్ ఏ సీఏవో ఓ. బాలాజీ మాట్లాడుతూ, టిటిడిలో మొదటిసారి కియోస్క్ యంత్రాలు ప్రవేశపెట్టి ఆదాయం పెరగడానికి తీసుకున్న చర్యలు చిరస్థాయిగా గుర్తు ఉం టుందన్నారు.
టిటిడి సీఈ టివి సత్యనారాయణ మాట్లాడుతూ ఇంజినీరింగ్ పనుల్లో ఆధునిక సాంకేతికత ద్వారా మరింత నాణ్యత పెంచేందుకు మార్గం ఏర్పరిచారన్నారు.

అంతకుముందు బదిలీపై వెళ్తున్న ఈవో జె. శ్యామలరావుకు శ్రీవారి ఆలయం, తిరుచానూరు, శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణవేంకటేశ్వర స్వామి ఆలయాల అర్చకులు వేదాశీర్వచనం చేశారు. టిటిడి చీఫ్ పీఆర్ఓ డాక్టర్ తలారి రవి తోపాటు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు, సిబ్బంది ఆయనను ఘనంగా సత్కరించారు.


Read More
Next Story