తిరుమల పెద్దపండుగకు 3,500 శ్రీవారి సేవకులు
x

తిరుమల పెద్దపండుగకు 3,500 శ్రీవారి సేవకులు

ఈఓ సింఘాల్ ఆదేశం. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో వీడియో చెప్పే ప్రత్యక కథనం,


తిరుమల శ్రీవారి క్షేత్రం సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సిద్ధం అవుతోంది. యాత్రికుల రద్దీని అంచనా వేసిన టీటీడీ అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీవారి సేవకుల సంఖ్య గణనీయంగా పెంచనున్నారు. ఆర్టీసీ సేవలు కూడా విస్తృతం చేయనున్నారు. డిమాండ్ కు తగినట్టు శ్రీవారి లడ్డూ ప్రసాదాలు కూడా సిద్ధం చేయనున్నారు.

గత ఏడాదితో పోలిస్తే, యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నట్లు టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. యాత్రికులకు ఇబ్బంది లేకుండా శ్రీవారి సేవకుల సంఖ్య 3,500 మందిని సిద్ధం చేయాలని ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. గత ఏడాది బ్రహ్మోత్సవాలకు వెయ్యి మంది సేవకులను వినియోగించుకున్నారు.

తిరుపతి నుంచి తిరుమల మధ్య ఆర్టీసీ బస్సుల సంఖ్య కూడా పెంచనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ తిరుపతి రీజనల్ మేనేజర్ జగదీష్ చెప్పారు.
తిరుమలలో ఈ నెల 23వ తేదీ రాత్రి శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. 24వ తేదీ రాత్రి పెదశేషవాహనంతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. అదే రోజు సాయంత్రం సీఎం నారా చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అక్బోబర్ రెండో తేదీ చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఇదిలాఉండగా,
తిరుమలలో బ్రహ్మోత్సవాలకు రెండు నెలల కిందటి నుంచే సన్నాహాలు ప్రారంభం అయ్యాయి. గత ఏడాది ఉత్సవాలు విజయవంతం నిర్వహించడంలో అప్పటి ఈఓ జే. శ్యామలరావు అధికారులు, సిబ్బందిని సమన్వయం చేశారు. ఆ అనుభవంతో ఏర్పాట్లకు సమీక్షలు సాగించిన శ్యామలరావు కొన్ని రోజుల కిందట బదిలీ అయ్యారు.
టీటీడీ ఈఓగా బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్ సింఘాల్ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడానికి రంగంలోకి దిగారు.
"ఉభయ దేవేరులతో మలయప్ప స్వామి విహరించే సందర్భంలో దర్శనం కోసం గ్యాలరీల్లో నిరీక్షించే యాత్రికులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయండి. సీనియర్ అధికారులకు బాధ్యతలు అప్పగించండి" అని ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.
బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై మరిన్ని వివరాలకు వీడయో చూడండి


Read More
Next Story