టీటీడీలో కుల వివక్ష: మాలమహానాడు ఆరోపణ
x
కుప్పంలో మాలమహానాడు పాదయాత్రలో కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతా మోహన్

టీటీడీలో కుల వివక్ష: మాలమహానాడు ఆరోపణ

కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు రాజ్యాంగ పరిరక్షణ కోసం పాదయాత్ర.


రాజ్యాంగ పరిరక్షణ, మానవ హక్కుల పరిరక్షణ పేరిట మాల మహానాడు మరో పోరాటానికి దిగింది.

టీటీడీలో దళితులపై వివక్ష కనిపిస్తోందని సీడబ్ల్యూసీ సభ్యుడు, తిరుపతి మాజీ ఎంపీ డాక్టర్ చింతా మోహన్ ఆరోపించారు. బైబిల్ చదువుతున్నారని పేద మహిళా ఉద్యోగిని ఉద్యోగం నుంచి తొలగించిన టీటీడీ అధికారులు క్రిస్టియన్ ఆస్పత్రుల్లో హిందువులు ఉన్నారనే విషయం మరిచిపోవద్దని ఆయన హితవు లిపారు.

చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు రాజ్యాంగ పరిరక్షణ, మానవ హక్కుల పరిరక్షణ పేరిట మాల మహానాడు పాదయాత్రను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు డాక్టర్ చింతామోహన్ మాట్లాడారు.

"రాష్ట్రంలో దళితుల కంట కన్నీరు కారుతోంది. హక్కులు కాలరాస్తున్నారు" అని డాక్టర్ చింతామోహన్ ఆందోళన వ్యక్తం చేశారు.
దళితులకు సమాజంలో రక్షణ లేకుండా పోయిందనీ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగులను అన్నే మతస్తులు అంటూ అవమాన పరుస్తున్నారు అని చింతామోహన్ ఆరోపించారు. అనవసర నిందారోపణలతో వివక్ష పాటిస్తూ, ఉద్యోగాలను ఊడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని డాక్టర్ చింతామోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
" రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయింది. అనవసర కేసుల్లో ఇరికించి వేధించడంతోపాటు ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా చేశారు" అని డాక్టర్ చింతామోహన్ వ్యాఖ్యానించారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే..
"ఎస్సీ రిజర్వేషన్లు అందరూ వ్యతిరేకిస్తున్నారు. బిజెపి పాలనలో అరాచకం స్పష్టంగా ఉంది" అని చింతా మోహన్ అన్నారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడిపై ఉందని ఆయన సూచించారు.
అంతకుముందు ఎస్సీ మాల ఉద్యోగులు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ బాబు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు యమలా సుదర్శన్, చెన్నకేశవులు మాట్లాడారు. బిజెపి పాలనలో రాజ్యాంగానికి ముప్పు ఏర్పడిందన్నారు.
"దళితులపై దాడులు, అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయి. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి, జైల్లో వేస్తున్నారు" అని ఎస్సీ మాల ఉద్యోగులు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ బాబు వ్యాఖ్యానించారు. ఎస్సీ వర్గీకరణ అనేది రాజ్యాంగ విరుద్ధంగా ఉందని, ఇది రాజ్యాంగ స్ఫూర్తిగా వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు.
పెరిగిన ఎస్సీల జనాభాకు అనుగుణంగా, దళితులకు 20 శాంత రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు కల్పించాలని ఆయన కోరారు.
ఆటంకాలు కల్పించకండి

ఎస్సీల ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేందుకు కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర చేస్తున్నామని, తమ పాదయాత్రకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అడ్డంకులు, అవరోధాలు కల్పించకుండా, పూర్తిస్థాయిలో సహకరించాలని మాలమహానాడు నేతలు కోరారు. రాజకీయాలకు అతీతంగా సాగుతున్న పాదయాత్రకు అన్ని పార్టీల్లోని మాల ప్రజా ప్రతినిధులు, సంఘాల నాయకులు సంఘీభావం కావాలని వారు కోరారు.
Read More
Next Story