తిరుమల : టీటీడీ ప్రక్షాళనకు బీసీవై ఏడు డిమాండ్లతో పాదయాత్ర
x

తిరుమల : టీటీడీ ప్రక్షాళనకు బీసీవై ఏడు డిమాండ్లతో పాదయాత్ర

తిరుమలను ఎవరికి వారు రాజకీయాలకు క్షేత్రంగా మార్చుకుంటున్నారు. వీటికి భిన్నంగా ఏడు డిమాండ్లతో బీసీవై పాదయాత్రకు సిద్ధమైంది.


తిరుమల ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న మఠాధిపతులు, పీఠాధిపతులతో ఇంకో నేత తిరుమలకు పాదయాత్రకు సంసిద్ధం అయ్యారు. గురువారం నుంచి మూడు రోజులపాటు తిరుమల వరకు ఈ పాదయాత్ర సాగనుంది.


తిరుమల క్షేత్ర పవిత్రత రక్షణ. కోట్లాది భక్త జన మనోభావాల పరిరక్షణ. ఈ అంశాలే ప్రధాన లక్ష్యంగా భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) కూడా రంగంలోకి వస్తోంది. ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బోడే రామచంద్రయాదవ్ ఈ నెల 27 (శుక్రవారం) నుంచి "తిరుమల పరిరక్షణ పాదయాత్ర" చేపట్టనున్నారు. సామాన్య భక్తధటజనం మద్దతుతో సహా.. ఆధ్యాత్మిక ప్రముఖులు, గురువులు, పీఠాధిపతులు ఈ కార్యక్రామానికి హాజరు కానున్నారని బుధవారం మీడియాకు తెలిపారు. ఇంకా ఆయన ఏమి చెప్పారంటే...

చిత్తూరు జిల్లా పుంగనూరులోని హనుమతరాయదిన్నె వీరాంజనేయస్వామి ఆలయం వద్ద పాదయాత్ర ప్రారంభం అవుతుంది. అని రామంద్రయాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి పీఠాధిపతులు హాజరుకానున్నట్లు ఆయన వెల్లడించారు.
శ్రీ రామానుజాచార్య వంశ పరంపర, యదుగిరి యతిరాజ్ మఠాధిపతి నారాయణ రామానుజ జీయర్ స్వామి, అయోధ్య నుంచి (హనుమాన్ మఠం పీఠాధిపతి మహంత్ కళ్యాణ్ దాస్ జీ మహరాజ్, శ్రీపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పరిపూర్ణానంద స్వామి, త్రిశక్తి మంత్రాశ్రమ సిద్దయోగులు శాక్తేయా సాంప్రదాయ సదాచార సంపన్నులు ఆడిదండి శక్తిశ్రీ భగవతీ మహారాజ్ స్వామి, కర్నాటకలోని యాదవ గురుపీఠం నుంచి శ్రీక్రిష్ణ యాదవానంద స్వామీజీ తోపాటు కంచి పీఠం నుంచి గురువులు, స్వామీజీలు, ఇతర ప్రాంతాల నుంచి ప్రముఖ స్వామీజీలు హాజరు అవుతారని రామచంద్రయాదవ్ వెల్లడిచారు.
మెట్లోత్సవం
"తిరుమల పూర్తిస్థాయి ప్రక్షాళన సహా ప్రధానమైనంగా ఏడు డిమాండ్లతో పాదయాత్ర, అలిపిరి మెట్లోత్సవం చేయాలని సంకల్పించాం" అని రామచంద్రయాదవ్ తెలిపారు. ఇందుకోసం పుంగనూరు నుంచి అలిపిరి వరకు పాదయాత్రగా వెళ్లి, అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకుంటాం" అని వివరించారు.
షెడ్యూల్ ఇదే
ఈ నెల 27వ తేదీన(శుక్రవారం) ఉదయం 9.15 నుంచి పుంగనూరులోని హనుమంతురాయ దిన్నెలో ఉన్న వీరాంజనేయస్వామి దేవాలయం నుంచి పాదయాత్ర ఆరంభం. అక్కడి నుంచి చౌడేపల్లి, సోమల, సదుం, కల్లూరు, పులిచర్ల, రొంపిచర్ల క్రాస్, శ్రీనివాస మంగాపురం మీదుగా అలిపిరి వరకు. అక్కడి నుంచి మెట్లమార్గంలో తిరుమల వరకు సాగనుంది. ఈ నెల 30వ తేదీ ఉదయం 9.15 గంటలకు అలిపిరి నుంచి తిరుమల మెట్లోత్సవం జరగనుంది..
ఏడు డిమాండ్లు
1) తిరుమలలో జరిగిన అపచారాలు, అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి 100 రోజుల్లో దోషులను శిక్షించాలి
2) TTD పాలక మండలి నుంచి పరిపాలన వరకు పూర్తి ప్రక్షాళన చేయాలి. పాలక మండలిలో రాజకీయ, కార్పొరేట్ శక్తులకు చోటు కల్పించకూడదు
3) తిరుమలలో VIP దర్శన విధానాన్ని రద్దు చేసి సీఎం నుంచి సామాన్య భక్తుని వరకు అందరికీ ఒకే విధమైన దర్శన ఏర్పాటు చేయాలి
4) TTD లో పని చేస్తున్న అన్యమత ఉద్యోగులను తొలగించి, వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి.. తొలగించిన వేయికాళ్ళ మండపం వేరొక చోట నిర్మించాలి
5) తిరుపతిలో ఉన్న గోవిందరాజ స్వామి, కపిలతీర్థం, తిరుచానూరు అలివేలు మంగాపురం ఆలయాలకు కనీసం 2 కి.మీ పరిధిలో మాంసం, మద్యం దుకాణాలు నిషేదించాలి
6) తిరుమల ఆదాయ, వ్యయాలపై మూడు నెలలకు ఒకసారి ఆడిట్ నిర్వహించి నివేదికలు ప్రజలకు అందుబాటులో ఉంచాలి
7) తిరుమలలోనే గోశాల ఏర్పాటు చేయాలి. తద్వారా సొంతంగా డెయిరీ నిర్వహించి, ఆ నెయ్యిని మాత్రమే స్వామి వారి ప్రసాదాలలో వినియోగించాలి
ఈ ప్రధాన డిమాండ్ల లక్ష్యంగా పుంగనూరు నుంచి పాదయాత్ర నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు రామచంద్రయాదవ్ తెలిపారు.
Read More
Next Story