ఎస్వీయూ వీసీగా నర్సింగరావు నియామకం
x
తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయం (ఫైల్)

ఎస్వీయూ వీసీగా నర్సింగరావు నియామకం

ఐదు విశ్వవిద్యాలయాలకు వీసీలను నియమిస్తూ గవర్నర్ ఆదేశాలు జారీ.


రాయలసీమ తోపాటు ఐదు విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్ లర్లను (Vice-Chancellors of Universities) గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆదేశాలు జారీ చేశారు. అందులో తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం వైస్ చాన్స్ లర్ గా ప్రొఫెసర్ తాతా నర్సింగరావు నియమితులయ్యారు.


ఐదు విశ్వవిద్యాలయాల్లో రాయలసీమలోని తిరుపతి, కడపలోని రెండు విశ్వవిద్యాలయాలకు వీసీలను నియమిస్తూ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అందులో కడప యోగి వేమన విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ గా రాజశేఖర్ బెల్లంకొండ, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి సమంతపుడి వెంకట సత్యనారాయణ, కడపలోని వైఎస్ఆర్ అర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం వీసీగా బి.జయరామిరెడ్డిని నియమించారు. విజయనగరం జేఎన్టీయూకు వి. వెంకటసుబ్బారావును నియమించారు.


Read More
Next Story