తిరుపతి: మీ కాళ్లు మొక్కుతా.. నా భర్తను వదలండి
x
తిరుపతిలో పోలీసుల కాళ్లు మొక్కుతున్న నిందితుడు వైసీపీ సోషల్ మీడియా ఇన్ చార్జి భార్య గీత.

తిరుపతి: మీ కాళ్లు మొక్కుతా.. నా భర్తను వదలండి

దళిత యువకుడిని చిత్రహింసలు. సానుభూతికి తెరతీసిన నిందితుడి భార్య.


తిరుపతిలో దళిత యువకుడిని వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులు చిత్రహింసలకు గురి చేసిన సంఘటన రాష్ట్రంలో రాజకీయ కలకలం రేపింది.

ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసిన నిందితుడు అనిల్ రెడ్డిని విడుదల చేయాలని ఆయన భార్య ఇరగం గీత శుక్రవారం ధర్నాకు దిగింది. పోలీసు అధికారుల కాళ్లు పట్టుకున్న ఫోటో వైరల్ గా మారింది. సానుభూతి కోసమే అని టీడీపీ నేతలు అంటున్నారు.

దళిత యువకుడిని చితకబాదిన వీడియో ఒకపక్క. అతనిని చితగకొట్టిన వారిలో నిందితుడు అనిల్ రెడ్డి భార్య పోలీస్ అధికారి కాళ్లు పట్టుకునే ఫొటోలు, వీడియో మరో పక్క వైరల్ అవుతున్నాయి. దీనికి తోడు బాధితుడు పవన్ కుమార్ విడుదల చేసిన వీడియో అతని కుటుంబీకులనే కాదు. పోలీసులను కూడా ఇరకాటంలో పడేసింది.
తిరుపతి నగర డిప్యూటీ మాజీ మేయర్ భూమన అభినయరెడ్డి, ఆయన తండ్రిపై వచ్చిన ఆరోపణలపై వారు స్పందించలేదు. కానీ, పార్టీ నేతలు మాత్రం
"పవన్ ను కొట్టిన దినేష్ జనసేన మద్దతుదారుడు. ఆ పాపం మాకు ఎందుకు అంటగడుతున్నారు" అని వైసీపీ నేతలు కూడా మరో పక్క పోలీసులకు ఫిర్యాదు చేశారు.
"నా కొడుకును చిత్రహింసలకు గురిచేసిన వారిని కఠినంగా శిక్షించండి. బాకీ ఉన్న డబ్బు చెల్లిస్తాం. నా కొడుకు మాదిరే వారికి కూడా చిత్రహింసలు రుచి చూపించండి" అని పవన్ తల్లి అనిత డిమాండ్ చేశారు. తిరుపతి ఈస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అన్యాయంగా ఇరికించారు..

తిరుపతి ఈస్టు పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేస్తున్న వైసీపీ సోషల్ మీడియా ఇన్ చార్జి భార్య గీత (పిల్లాడిని ఒడిలో కూచోబెట్టుకున్న మహిళ)

"నా భర్త అనిల్ రెడ్డిని అన్యాయంగా ఈ కేసులో ఇరికించారు" అని ఆయన భార్య ఇరగం గీత తిరుపతి ఈస్టు పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. ఆమె వెంట కొందరు మహిళలు కూడా ఉన్నారు. కొద్ది సేపటికి స్టేషన్ బయటికి వచ్చిన డీఎస్పీ భక్తవత్సలం సిబ్బంది ఆమెతో మాట్లాడారు. స్టేషన్ లోపలకి పిలిచినా వెళ్లలేదు. సరే. మీ ఇష్టం కూర్చోండి అని లోపలికి వెళ్లిపోయారు.
ఆ తరువాత డీఎస్పీ బయటికి వెళ్లే సమయంలో ఉన్నఫలంగా అనిల్ రెడ్డి భార్య డీఎస్పీ కాళ్లపై పడి వేడుకోవడం ద్వారా సానుభూతి సంపాదించాలనే యత్నంలో సఫలం అయ్యారు. అంతకుముందు ఆమె మీడియాతో మాట్లాడుతూ,
"ఆరోపణలు రావడంతో పోలీసులు పిలవడంతో నా భర్త స్వచ్ఛందంగా వచ్చి పోలీసులకు లొంగిపోయాడు. లెక్కలేనన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు" అని ఆమె ఆరోపించింది. తన భర్తను విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
సంఘటన ఇది...
తిరుపతిలోని శ్రీనివాసం వసతిగృహం ఎదురుగా ఉన్న దుకాణం కాంట్రాక్ట్‌ను తనకు రాసివ్వాలంటూ వైసీపీ సోషల్‌ మీడియా ఇన్‌ఛార్జి అనిల్ రెడ్డి దౌర్జన్యానికి దిగారు. పవన్‌ కుమార్ అనే దళిత యువకుడిని కిడ్నాప్ చేసి ఎంఆర్‌పల్లిలోని తన ఇంట్లో బంధించి తీవ్రంగా హింసించారు. ఆ యువకుడిని చితకబాదుతుండగా అనిల్ రెడ్డి స్నేహితులు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
దళిత యువకుడు పవన్ కుమార్‌ను వైసీపీ మద్దతుదారుడు దినేష్ అనే వ్యక్తి పోలీస్ ఫైబర్ లాఠీలో చితకబాదుతుంటే, వైసీపీ సోషల్ మీడియా అధ్యక్షుడు అనిల్ రెడ్డి, జగ్గారెడ్డి (జగ్గా) ప్రోత్సాహిస్తూ రాక్షసానందం పొందడం వీడియోలో కనిపించింది. ఆ వీడియోలు వైరల్ కాగానే తిరుపతి నగర పోలీసులు స్పందించారు.
ఈ సంఘటనపై స్పందించిన తిరుపతి పోలీసులు అనిల్ రెడ్డి తోపాటు జగ్గారెడ్డి (జగ్గా)ను అరెస్టు చేశామని అదనపు ఎస్పీ రవిమనోహరాచారి, ఈస్టు డీఎస్పీ భక్తవత్సలం చెప్పారు.
"దళిత యువకుడు పవన్ కుమార్ ను చావబాదిన దినేష్ పరారీలో ఉన్నాడు. అతనిని పట్టుకోవడానికి పోలీసు బృందాలను ఏర్పాటు చేశాం" అని అదనపు ఎస్పీ రవిమనోహరాచారి, ఈస్టు డీఎస్పీ భక్తవత్సలం తెలిపారు. దినేష్ పట్టుబడితే ఈ సంఘటన వెనక ఉన్న కథ, తెర వెనుక ఎవరన్నా ఉన్నారా? అనే విషయాలు వెలుగు చేసేందుకు అవకాశం ఉంటుందని మీడియాకు చెప్పారు.
"దళిత యువకుడు పవన్ ను దినేష్ లాఠీతో కొట్టడం, చిత్రహింసలకు గురి చేసిన సంఘటనపై కిడ్నాప్, హత్యాయత్నం, ఎస్సీఎస్టీ యాక్టు తో పాటు ఇంకొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం" అని వారు వివరించారు.
దినేష్ మాత్రమే ఇందులో నిందితుడు. అనిల్ రెడ్డి చూస్తూ ఉన్నాడు. అని కూడా ఆ పోలీస్ అధికారులు చెప్పారు. అంటే..
నేరం చేసే వ్యక్తిని ప్రోత్సహించే వారు కూడా నిందితులు అవుతారా? కారా? అనేది తేలాల్సి ఉంది.
Read More
Next Story