చిరంజీవి పీఆర్పీ తరహాలోనే 'పరివర్తన రాజనీతి పార్టీ' ఎంట్రీ...
"మాది ఏ పార్టీకి బీ టీమ్ కాదు.. 24 నెలల్లో మార్పు రాకుంటే, ఉప్పెన ఖాయమని టీడీపీ కూటమికి హచ్చరించిన విజయసాయి
రాష్ట్రంలో పీఆర్ఫీ మళ్లీ తెరమీదకు వచ్చింది. సినిమాట్రిక్ పద్ధతిలో వేణంబాకం విజయసాయిరెడ్డి విజయవాడ వేదికగా వేదికగా పరివర్తన రాజనీతి పార్టీని బుధవారం మధ్యాహ్నం ప్రకటించారు. తిరుపతిలో కొణిదెల చిరంజీవి ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీ పీఆర్పీ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పార్టీకి విజయసాయిరెడ్డి ప్రకటించిన పరివర్తన రాజనీతి పార్టీకి బావ సారూప్యత చాలా దగ్గరగా ఉంది. ఆనాడు చిరంజీవి తిరుపతిలో ప్రారంభించిన పీఆర్పీకి, విజయసాయిరెడ్డి ప్రారంభించిన పీఆర్పీ సామాజిక న్యాయం అనే ట్యాగ్ లైన్ తగిలించారు. ఆ వివరాలేమిటో కీచ్ వాచ్ ది స్టోరీ..
విజయసాయిరెడ్డి ప్రకటించిన పీఆర్ పీ కాసేపు పక్కన ఉంచి, తిరుపతి వేదికగా చిరంజీవి 2008 ఆగస్టు 26వ తేదీ ప్రారంభించిన పార్టీ నేపథ్యం ఏమిటనేది చూద్దాం..
తిరుపతిలో కొణిదెల చిరంజీవి తిరుపతి వేదికగా శ్రీవారి పాదాలకింద ఉన్న అవిలాల చెరువులో ప్రజారాజ్యం పార్టీ అదే పీఆర్ పీ ప్రారంభించారు. ఆ సమయంలోకూడా చిరంజీవి సామాజిక న్యాయం అనే అస్త్రాన్ని సంధించారు.
తిరుపతిలో చిరంజీవి కూడా ఇదే తరహాలో భారీ వేదికపైకి సరిగ్గా సాయంత్రం వేళ కొణిదెల చిరంజీవి చేరుకున్నారు. నేను సైతం ప్రపంచాజ్ణానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అనే బ్యాగ్ గ్రౌండ్ పాట వినిస్తుండగా, ఊరించి,, కేరింతలు కొట్టించిన తరువాత చిరంజీవి కూడా ప్రజారాజ్యం పేరు ప్రకటించిన తరహాలో
విజయసాయిరెడ్డి ప్రకటించిన పరివర్తన రాజనీతి పార్టీ (పీఆర్పీ) కూడా వేదికపై ఉత్కంఠ కలిగించే లా చేశారు. డిజిటల్ స్క్రీన్ పై ఐదు నుంచి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. అంతకుముందు దేశ కోసం ధర్మం కోసం హ్యాష్ ట్యాగ్ కనిపిస్తుండగా, సరిగ్గా 11 గంటల 11 నిమిషాలకు పార్టీ పేరు పరివర్తన రాజనీతి పార్టీ అని వెల్లడించారు.
అంటే ఇక్కడ తిరుపతిలో శ్రీవారి పాదాల చెంత చిరంజీవి పార్టీ ఏర్పాటు చేసి, 2009 ఎన్నికల్లో 18 సీట్లకు పరిమితం కావడం, ఆ తరువాత 2011లో కాంగ్రెస్ లో విలీనం తరువాత కేంద్ర మంత్రి పదవి తీసుకున్నారు. మెల్లమెల్లగా ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అయ్యారు.
విజయవాడ కనకదుర్గమ్మ పాదాల చెంత పరివర్తన రాజనీతి పార్టీని ప్రారంభించడంలో కూడా వేదికపై ఒకరే మాట్లాడిన విధానం చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన తీరును తలపించింది. వారసత్వ రాజకీయాలకు స్వస్తి చెప్పడం, యువతకు ప్రాధాన్యత ఇవ్వడమే ప్రధాన లక్ష్యంగా ప్రకటించారు. అదే సమయంలో చిరంజీవి ప్రారంభించిన ఆ తరువాత కాంగ్రెస్ లో విలీనం చేసిన ప్రజారాజ్యం పార్టీ తరహాలోనే విజయసాయిరెడ్డి కూడా సామాజికన్యాయం అస్త్రం సంధించారు. అదే సందర్భంలో తమ పీఆర్పీ ఏ పార్టీకి బీ టీం కాదనే విషయాన్ని విజయసాయిరెడ్డి పునరుద్ఘాటించారు.
విజయసాయిరెడ్డి వైసీపీ, టీడీపీకి మరో హెచ్చరిక కూడా జారీ చేశారు.
మా పార్టీది యుద్ధం ముందు ప్రశాంతత లాంటిది. 24 నెలల్లో టీడీపీ తన పాలనా పద్ధతిని సరిదిద్దుకోకుంటే, పరివర్తన రాజనీతి పార్టీ ఉప్పెనలో కొట్టుకుపోవడం ఖాయం" అని విజయసాయిరెడ్డి హెచ్చరించారు.
Next Story
