x

ISRO రాకెట్ లాంచ్.. NVS-03 రహస్యం..!

GSLV F-18 అర్ధరాత్రి ఎందుకు ప్రయోగించారు? వీడియో స్టోరీ


"పగటిపూట కాకుండా అర్థరాత్రి వేళ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లడం చూస్తే ప్రతీ ఒక్కరికీ కలిగే సందేహం ఒకటే...

ఈ ప్రయోగానికి ఇస్రో సరిగ్గా రాత్రినే ఎందుకు ఎంచుకుంది?' శ్రీహరికోట షార్ రెండో లాంచ్ ప్యాడ్ నుంచి GSLV-F18 రాకెట్ ప్రయోగం వెనుక ఉన్న ఆసక్తికర సాంకేతిక రహస్యం దాగి ఉంది. భూ భ్రమణం, వాతావరణ విశ్లేషణతో సహా ఇస్రో శాస్త్రవేత్తలు ఏమంటున్నారో చూద్దాం..

అర్థరాత్రి ప్రయోగం – అసలు రహస్యం

'లాంచ్ విండో' (Launch Window) సాధారణంగా రాకెట్లను మనకు నచ్చిన సమయంలో ప్రయోగించడం సాధ్యపడదు. రోదసిలో ఉపగ్రహాన్ని ఏ నిర్దిష్ట స్థానంలో అమర్చాలో (Orbit Insertion) నిర్ణయించే ఖచ్చితమైన కాలాన్ని సైన్స్‌లో ‘లాంచ్ విండో’ అంటారు.
NVS-03 అనేది ఒక నావిగేషన్ ఉపగ్రహం. ఇది భూమితో పాటు తిరిగే 'భూస్థిర బదిలీ కక్ష్యలోకి' (Geostationary Transfer Orbit) వెళ్లాలి. ఈ ఉపగ్రహం అంతరిక్షంలో నిర్దేశిత కక్ష్యలోకి సరిగ్గా ప్రవేశించాలంటే, భూమి తన చుట్టూ తాను తిరిగే భ్రమణ వేగాన్ని (Earth's Rotation) మన రాకెట్ అనుకూలంగా వాడుకోవాలి. ఆ కక్ష్యా స్థానం శ్రీహరికోటలోని రెండో ప్రయోగ వేదికకు సరిగ్గా ఎదురుగా వచ్చే సమయం రాత్రి 11:51 గంటలు. ఆ సమయంలో ప్రయోగిస్తేనే అతి తక్కువ ఇంధనంతో ఉపగ్రహాన్ని సరైన స్థానంలో ప్రవేశపెట్టడం సాధ్యమవుతుంది. ఆ దిశగానే జీఎస్ఎల్ వి సరీస్ లో 18 రాకెట్ శుక్రవారం రాత్రి 11.51 గంటలకే సరిగ్గా ప్రయోగించారు. ఈ ప్రయోగం ద్వారా భారత స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ అయిన NavIC (నవ్‌ఐసి) సామర్థ్యాన్ని మరింత బలోపేతం అవుతుందనేది ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వాతావరణ శాస్త్రం..? సౌర ఫలకాల పనితీరు?

రాత్రి వేళ ప్రయోగం వెనుక రెండు ముఖ్యమైన సైంటిఫిక్ కారణాలు ఉన్నాయి అవేమిటో చూద్దాం.. శాంతించిన వాతావరణం ఒకటి. పగటిపూట సూర్యరశ్మి వల్ల భూవాతావరణంలో గాలుల వేగం, వేడి, గాలిలో అల్లకల్లోలం (Turbulence) ఎక్కువగా ఉంటాయి. కానీ..,
రాత్రి 11 గంటలు దాటిన తర్వాత వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గి, గాలులు ప్రశాంతంగా ఉంటాయి. దీనివల్ల రాకెట్ నింగిలోకి దూసుకెళ్లేటప్పుడు గాలి నిరోధకత (Atmospheric Drag) తక్కువగా ఉంటుంది.
సోలార్ పేనల్స్ (Solar Panels Alignment) కూడా బాగా పనిచేస్తాయి. దీనికి సూర్యకాంతి ఎలా తోడవుతుంది?
NVS-03 ఉపగ్రహం రాకెట్ నుంచి విడిపోగానే దాని సోలార్ ప్యానెల్స్ విప్పుకుంటాయి. ఉపగ్రహం కక్ష్యలోకి చేరే సమయానికి అంతరిక్షంలో సూర్యకాంతి సరిగ్గా దాని ఫలకాలపై పడేలా కాలిక్యులేట్ చేసి రాత్రి వేళ ప్రయోగిస్తారు. దీనివల్ల ఉపగ్రహానికి కావలసిన విద్యుత్ తక్షణమే ఉత్పత్తి అవుతుంది. ఇదే రాత్రి వేళ ప్రయోగం వెనుక ఉన్న రహస్యం అనేది శాస్ర్తవేత్తలు చెబుతున్న మాట.

అంతరిక్షంలో ట్రాకింగ్ ఎందుకు సులువవుతుంది?

రాత్రి వేళ ప్రయోగాల వల్ల ఇస్రో కేమెరాలు, రాడార్లకు (Tracking Systems) అత్యంత స్పష్టమైన ఇమేజింగ్ లభిస్తుంది.
నల్లటి ఆకాశంలో రాకెట్ మంటల (Plume ఫ్లేం ) వెలుగు చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. దీనివల్ల రాకెట్ పయనించే మార్గాన్ని, ఆకాశంలో వివిధ దశలు (Stages) విడిపోయే దృశ్యాలను శ్రీహరికోట, హాసన్‌లోని కంట్రోల్ సెంటర్లు అత్యంత ఖచ్చితత్వంతో ట్రాక్ చేయగలవు అని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.
రాత్రి వేళల్లో మాత్రమే ప్రయోగించిన ప్రముఖ రాకెట్లు ఎన్ని, వాటి పనితీరు ఎలా ఉందో చూద్దాం..
రోదసి చరిత్రలో అర్థరాత్రి వేళల్లో విజయవంతంగా ప్రయోగించిన కొన్ని ఐకానిక్ మిషన్లు ఇక్కడ చూడవచ్చు
చంద్రయాన్-2 (Chandrayaan-2): భూమి, చంద్రుడి కక్ష్యల పొందిక కోసం ఈ ప్రయోగాన్ని అర్థరాత్రి సమయానికే సమీపంలో చేపట్టారు.
GSLV-F12 / NVS-01 ప్రయోగం: గతంలో రెండవ తరం తొలి నావిగేషన్ శాటిలైట్‌ను కూడా సరైన ఆర్బిట్ ఇన్సర్షన్ కోసం రాత్రి వేళల్లోనే ప్రయోగించారు.
నాసా అపోలో 17 (Apollo 17): మానవ సహిత వ్యోమనౌకల్లో రాత్రి వేళ లాంచ్ అయిన ఏకైక ప్రసిద్ధ ప్రయోగం
అపోలో 17.రిశాట్ (RISAT), ఇన్సాట్ (INSAT) సీరీస్ రాకెట్లు కూడా ఖచ్చితత్వంతో నింగిలోకి దూసుకుని వెళ్లాయి. ఇవి నిఘా, వాతావరణ ఉపగ్రహాలను సైతం నిర్దిష్టమైన 'సన్-సింక్రోనస్' కక్ష్యల కోసం రాత్రి వేళ ప్రయోగించారు.
కాబట్టి రాత్రి 11:51 గంటలకు రాకెట్ ప్రయోగించడం అనేది కేవలం ఒక సమయం మాత్రమే కాదు... అది రోదసి శాస్త్రం, భూభ్రమణం, గణిత శాస్త్రాల కలయికతో చేసిన పక్కా ప్లాన్! ఈ ప్రయోగంతో భారత్ తన స్వదేశీ 'నావిక్' (NavIC) వ్యవస్థను మరో ఎత్తుకు తీసుకువెళ్లబోతోంది.
Read More
Next Story