x

Update Big Breaking | :శ్రీసిటిలో భారీ పేలుడు., 10 మంది మృతి?.

శ్రీ సిటీలోని టిల్ హెల్త్ కేర్ పరిశ్రమలో ప్రమాదంలో పది మందికిపైగానే గాయాలు


తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలోని శ్రీ సిటీ ప్రత్యేక ఆర్థిక మండలి ( Sri City Special Economic Zone (SEZ) )లో ఘోరప్రమాదం జరిగింది.శనివారం ఉదయం జరిగిన ఈ ఘోరదుర్ఘటనలో దాదాపు పది మందికి పైగానే మరణించినట్లు సమాచారం. అధికారికంగా ఇంకా ధృవీకరరించలేదు. పరిశ్రమ నుంచి మృతుల దేహాలను బయటికి తీసుకుని వస్తున్న ఫొటోలు బయటికి వచ్చాయి. శ్రీ సిటీలోని టిల్ హెల్త్ కేర్ పరిశ్రమలో ఉదయం సుమారు 8 గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు చోటుచేసుకున్నట్లు తెలిసింది.


పేలుడు ధాటికి పరిశ్రమలో పనిచేస్తున్న పలువురు కార్మికులు ప్రమాదంలో చిక్కుకున్నట్లు సమాచారం. నైట్ షిఫ్ట్ విధుల్లో ఉన్న కార్మికులు కూడా పేలుడు సమయంలో పరిశ్రమలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనలో భారీగా ప్రాణనష్టం జరిగి ఉండవచ్చని ప్రత్యక్షంగా చూసిన వారు చెబుతున్నప్పటికీ, అధికారికంగా పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.

పేలుడు సమాచారం అందుకున్న వెంటనే సంబంధిత అధికారులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు, గాయపడిన వారి సంఖ్య, ప్రాణనష్టంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
అసలేం జరిగిందంటే..

తిరుపతి జిల్లా సత్యవేడు మండల పరిధిలోని శ్రీ సిటీ ప్రత్యేక ఆర్థిక మండలిలో శనివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. దుర్ఘటనలతో కనీసం ఐదుగురు మరణించినట్లు తెలిసింది. పదుల సంఖ్యలో కార్మికులు గాయపడ్డారు. ఉదయం ఏడు నుంచి ఎనిమిది గంటల ప్రాంతంలో బాయిలర్ ఒక్కసారిగా పేలడంతో నైట్ షిఫ్ట్ లో ఉన్న కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరికొంతమంది కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో విధుల్లో దాదాపు 30 మంది ఉన్నారని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన తరువాత పోలీసులు, ఫైర్ సిబ్బందికి శ్రీ సిటికీ చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను వెంటనే శ్రీ సిటీకి దగ్గరగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. అయితే ఇప్పటి వరకూ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. వాసు అనే బాధితుడి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం చెన్నైకి తరలించినట్లు వార్తలు వస్తున్నాయి.

టెల్ హెల్త్ కేర్ పరిశ్రమలో మాత్రలు తయారు చేస్తుంటారు. ప్రమాదం ఉదయం ఎనిమిది గంటల తరువాత జరిగినట్లయితే భారీ స్థాయిలో ప్రాణనష్టం సంభవించి ఉండేదని కార్మికులు చెబుతున్నారు. నైట్ షిఫ్ట్ ముగియడానికి ముందు పేలుడు సంభవించడంతో ప్రమాదంలో ప్రాణ నష్టం తీవ్రత తగ్గించదని వారు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. చనిపోయిన వారిలో ఒకరు బెంగాల్ కు చెందిన వారు కాగా, మరో ఇద్దరు స్థానికులైన మస్తాన్, రమేశ్ గా గుర్తించారు. మరొకరిని గుర్తించాల్సి ఉంది.

పేలుడు ధాటికి మొత్తం భవనం కుప్పకూలిపోయిందని, పక్క భవనం కాసేపు ఊగిపోయినట్లు బాధితులు తెలిపారు. పేలుడుపై తిరుపతి జిల్లా అధికారులు ఇప్పటికే దర్యాపు ప్రారంభించారు. దర్యాప్తు పూర్తయిన తరువాత వివరాలు వెల్లడిస్తామని ప్రకటించారు.

Read More
Next Story