TIrumala| తిరుమల క్షేత్రపాలకుడు రుద్రుడికి అభిషేకం
x
తిరుమలలో శివుడి విగ్రహానికి అభిషేకం చేస్తున్న అర్చకులు

TIrumala| తిరుమల క్షేత్రపాలకుడు రుద్రుడికి అభిషేకం

పాండవతీర్థం వద్ద ఈ ఉత్సవం వెనుక కథేమిటంటే..


తిరుమల శ్రీవారి క్షేత్రంలో మహాశివరాత్రికి కూడా ప్రత్యేకత ఉంది. తిరుమల క్షేత్రపాలకుడైన రుద్రుడి (శివుడు)కి అభిషేకం, పూజలు అందించారు.


తిరుమలకు వెళ్లే యాత్రికులు శ్రీవారిని దర్శించుకుంటారు. వీలైతే సమీపంలోని చారిత్రక ప్రదేశాలను సందర్శించడం సాధారణంగా కనిపిస్తుంది. తిరుమల క్షేత్రంలో శివుడే క్షేత్రపాలకుడు. పాండవతీర్థంగా కూడా పూజలు అందుకుంటోంది. ఈ వివరాల్లోకి వెళ్లే ముందు..

తిరుమల నుంచి పాప వినాశనం వెళ్లే మార్గంలో గోగర్భం డ్యాం వద్ద క్షేత్రపాలకుడైన రుద్రుడికి టీటీడీ అర్చక స్వాములు ఆదివారం అభిషేకం చేశారు. తిరుమల క్షేత్రానికి పాలకుడుగా ఉన్న రుద్రుడికి మహాశివరాత్రి సందర్భంగా ఆ ప్రతి సంవత్సరం అభిషేకం నిర్వహించడం ఆనవాయితీ.

తిరుమల శ్రీవారి ఆలయం నుంచి అధికారులు, అర్చకులు గోగర్భం డ్యాం సమీపంలోని క్షేత్ర పాలకుడి శిల వద్దకు చేరుకున్నారు. పాలు, పెరుగు, చందనం, పన్నీరు, కొబ్బరినీటి తోపాటు సుగంధ ద్రవ్యాల కలిపిన జలాలతో విశేష అభిషేకం చేశారు. ఆ తరువాత నైవేద్యం సమర్పించిన అర్చకులు యాత్రికులకు ప్రసాదాల పంపిణీతో పాటు మహా హారతి సమర్పించారు.

శివుడే క్షేత్రపాలకుడు..

తిరుమల సప్తగిరిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయుడుగా పిలుస్తారు. గోవింద నామస్మరణలతో తిరుమల పులకిస్తూ ఉంటుంది. ఏడుకొండలపై వెలసిన వెంకటాచల క్షేత్రానికి క్షేత్ర పాలకుడు మాత్రం శివుడే. అనేది చారిత్రక నేపథ్య కథనం. రోజు నిత్య నివేదనలు పూజలు అందిస్తూ ఉంటారు.

శ్రీవారి ఆలయంలో..

తిరుమల శ్రీవారి ఆలయంలో కూడా క్షేత్రపాలక శిల ఇప్పటికీ ఉంది. శ్రీవారి ఆలయం వద్ద మహా ద్వారం దాటిన తర్వాత ధ్వజస్తంభం ఉన్న మండపం ఆవరణలో బలిపీఠానికి ఈశాన్యంలో చిన్న శిలాపీఠం ఉంటుంది. దీనిని క్షేత్రపాలక శిల అంటారు.. పూర్వం ఈ శిల రుద్ర అనే పూర్ణాంశతో ప్రకాశిస్తూ తిరుమల గుడి చుట్టూ తిరుగుతూ కాపలా కాస్తూ ఉండేదని చారిత్రక కథనం ఉంది. తిరుమల శ్రీవారి మూలమూర్తి ద్వారాలు మూసి వేసిన తరువాత అర్చకులు రాత్రి ఇంటికి వెళ్ళేటప్పుడు గుడి తాళాలు ఈ శిలపై పెట్టి నమస్కారం చేసి వెళతారు. తెల్లవారుజామున మళ్లీ వచ్చి నమస్కారం చేసి తాళాలు తీసుకునేవారు.

పాండవ తీర్థం వద్ద అభిషేకం..


మహాశివరాత్రి సందర్భంగా పాండవతీర్థం అంటే గోగర్భం జలాశయానికి కుడివైపున కొంత దూరం పెడితే క్షేత్రపాలకుడి వద్దకు చేరుకోవచ్చు. ఆ శిలపై కొలువై ఉన్న ఈశ్వరుడి కి అభిషేకం చేయడం ఆనవాయితీగా వస్తుంది.

అందులో భాగంగానే ఆదివారం మహాశివరాత్రి ని పురస్కరించుకొని టీటీడీ అధికారులు, శ్రీవారి ఆలయ అర్చకులు క్షేత్రపాలకుడి వద్దకు చేరుకున్నారు.అక్కడ క్షేత్రపాలుకుడికి పవిత్ర జలాలు, పాలు పెరుగు చందనం పన్నీరు కొబ్బరి నీటితో అర్చకులు అభిషేకం చేశారు. నైవేద్యం సమర్పించిన తర్వాత భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేయడంతో పాటు హారతి కూడా అందించారు.
Read More
Next Story