అన్నదాన పథకానికి ఎన్ఆర్ఐల సహకారం..
x
తిరుమలలోని నిత్యాన్నసద్రం (ఫైల్)

అన్నదాన పథకానికి ఎన్ఆర్ఐల సహకారం..

రూ. 70 లక్షల విరాళం అందించిన విశాఖ యాత్రికులు


టీటీడీ నిర్వహిస్తున్న ట్రస్టుల్లో ప్రధానంగా అన్నదాన పథకానికి ఈ సంవత్సరం ప్రారంభం నుంచి భారీగా విరాళాలు అందుతున్నాయి. ఆదివారం విశాఖపట్టణానికి చెందిన ఎన్ఆర్ఐ దంపతులు, వారి కొడుకులు కలిసి రూ. 70 లక్షల రూపాయలు విరాళంగా అందించారు

తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ నిత్యాన్నాదన సత్రం, పీఏసీ కేంద్రాలతో తో పాటు తిరుపతి, ఒంటిమిట్ట ఆలయాల వద్ద టీటీడీ అన్నదాన పథకం అమలు చేస్తోంది. రోజుకు సగటున 2.50 లక్షల మందికిపైగానే ఉచితంగా అన్నప్రసాదాలు వడ్డించడంలో టీటీడీ ఏమాత్రం రాజీపడడం లేదు. దాతలు అందించిన విరాళాలను ఫిక్స్ డ్ డిపాజిట్ల రూపంలో ట్రస్టుల్లో జమ చేయడం ద్వారా ఆ వడ్డీతోనే ఈ పథకం నిర్వహిస్తుండడం గమనార్హం.

ఎన్ఆర్ఐ విరాళం..

విశాఖపట్నంకు చెందిన ఎన్ఆర్ఐలు త్రిపురనేని వెంకటరత్నం, మాధురి దంపతులు ఆదివారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళంగా అందించారు.వారి కొడుకులు త్రిపురనేని విజయ్, త్రిపురనేని వినయ్ అన్న ప్రసాదం ట్రస్టుకు చెరో రూ.10 లక్షలు విరాళంగా అందించారు. దాతల ప్రతినిధిగా పొట్లూరి నరసింహారావు తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో అదనపు ఈఓ సిహెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీ అందజేశారు‌. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు జీ. భానుప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.
Read More
Next Story