LIVE వరుసగా తొమ్మిదో బడ్జెట్… దేశ ఆర్థిక దిశపై కీలక ప్రకటనలకు సిద్ధం
x

వరుసగా తొమ్మిదో బడ్జెట్… దేశ ఆర్థిక దిశపై కీలక ప్రకటనలకు సిద్ధం

ఫిబ్రవరి 1న యూనియన్ బడ్జెట్ 2026. వరుసగా 9వసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్. ఆర్థిక అంచనాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి.


ఫిబ్రవరి 1న దేశ ఆర్థిక దిశను నిర్ణయించే కీలక ఘట్టం రాబోతోంది. యూనియన్ బడ్జెట్ 2026ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఇదే తాజా అప్‌డేట్‌గా రాజకీయ, ఆర్థిక వర్గాల్లో ఉత్కంఠ పెరిగింది. ఈ బడ్జెట్‌తో నిర్మలా సీతారామన్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకోనున్నారు. వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టే తొలి ఆర్థిక మంత్రిగా ఆమె నిలవనున్నారు. అదేవిధంగా, ఆదివారం రోజున బడ్జెట్ చదివే తొలి ఫైనాన్స్ మినిస్టర్‌గా కూడా చరిత్ర సృష్టించనున్నారు. ఇప్పటికే 2020, 2025లో శనివారం బడ్జెట్ ప్రవేశపెట్టిన అనుభవం ఆమెకు ఉంది.

బడ్జెట్ ప్రవేశపెట్టే సంప్రదాయం కాలక్రమంలో మారింది. 1999 వరకు సాయంత్రం ఐదు గంటలకు బడ్జెట్ చదివే ఆనవాయితీ కొనసాగింది. ఆ ఏడాది యశ్వంత్ సిన్హా ఉదయం పదకొండు గంటలకు మార్చగా, ఆ విధానం ఇప్పటికీ అమలులో ఉంది. తరువాత 2017లో అరుణ్ జైట్లీ బడ్జెట్ తేదీని ఫిబ్రవరి చివరి నుంచి ఫిబ్రవరి 1కి ముందుకు తీసుకువచ్చారు.

యూనియన్ బడ్జెట్ 2026లో కేంద్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయ అంచనాలు వెల్లడికానున్నాయి. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యానికి ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు. భారత్ వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉన్నప్పటికీ, ప్రపంచ వాణిజ్యంలో అనిశ్చితి, భౌగోళిక రాజకీయ పరిణామాలు సవాళ్లుగా మారాయి.

ఈ పరిస్థితుల్లో ఆర్థిక లోటును జీడీపీలో 4.5 శాతం దిగువకు తీసుకెళ్లాలన్న లక్ష్యంపై ప్రభుత్వం దృష్టి సారించింది. గత బడ్జెట్లలో మౌలిక వసతులపై ఖర్చు పెరగగా, అదే ఊపు కొనసాగుతుందా అనే అంశంపై ఆర్థిక వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

బడ్జెట్‌కు ముందు పరిశ్రమ వర్గాలు తమ అంచనాలను వెల్లడించాయి. మౌలిక వసతులు, తయారీ రంగానికి మద్దతు కొనసాగించాలని సూచించాయి. టెక్నాలజీ రంగం, స్టార్టప్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ హైడ్రోజన్ అంశాల్లో స్పష్టమైన విధానాలపై దృష్టి పెట్టాలని కోరాయి.

ఎకనామిక్ సర్వే అంచనాల ప్రకారం వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 6.8 నుంచి 7.2 శాతం మధ్య ఉండే అవకాశం కనిపిస్తోంది. బడ్జెట్ రోజున స్టాక్ మార్కెట్లు సాధారణంగా కొనసాగనున్న నేపథ్యంలో, పన్నుల విధానం, రంగాల వారీ కేటాయింపులపై ఇన్వెస్టర్లు నిశితంగా గమనిస్తున్నారు. మొత్తంగా చూస్తే, యూనియన్ బడ్జెట్ 2026 దేశ ఆర్థిక ప్రయాణంలో మరో కీలక మలుపుగా నిలవనుంది.

Live Updates

  • 1 Feb 2026 11:58 AM IST

    బడ్జెట్ 2026: లక్షపతి దీదీ పథకం విస్తరణ

    యూనియన్ బడ్జెట్ 2026లో మహిళా సాధికారతకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. లక్షపతి దీదీ పథకం విజయాన్ని కొనసాగిస్తూ మహిళలను క్రెడిట్ ఆధారిత జీవనోపాధి నుంచి వ్యాపార యజమానులుగా ఎదగేలా చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

    ఈ పథకం కింద మహిళలు తదుపరి స్థాయికి చేరేందుకు స్వయం సహాయక సంఘాల ఆధారంగా కమ్యూనిటీ యాజమాన్య రిటైల్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. వీటిని ‘సెల్ఫ్ హెల్ప్ ఎంట్రప్రెన్యూర్ మార్ట్స్’గా అభివర్ణించారు.

    ఈ మార్ట్స్ క్లస్టర్ స్థాయి ఫెడరేషన్ల పరిధిలో కమ్యూనిటీ ఆధారిత రిటైల్ అవుట్‌లెట్లుగా పనిచేస్తాయని సమాచారం. మహిళా উদ্যములకు మరింత బలమైన, వినూత్న ఆర్థిక మద్దతు అందించడం ద్వారా వారు వ్యాపార రంగంలో ముందడుగు వేయగలరని ప్రభుత్వం పేర్కొంది.

    ఈ చర్యలతో మహిళలకు ఉపాధి అవకాశాలు విస్తరించడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వారి పాత్ర మరింత బలపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

  • 1 Feb 2026 11:57 AM IST

    NIMHANS 2.0కు ప్రభుత్వం ప్రణాళికలు

    ఉత్తర భారతదేశంలో మెంటల్ హెల్త్ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం NIMHANS 2.0ను ఏర్పాటు చేయనుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

  • 1 Feb 2026 11:49 AM IST

    బడ్జెట్ 2026: ఆస్ట్రో ఫిజిక్స్‌కు ఆధునిక టెలిస్కోపులు

    యూనియన్ బడ్జెట్ 2026లో ఖగోళ శాస్త్రం, ఆస్ట్రోఫిజిక్స్ రంగాలకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రోత్సాహం ప్రకటించింది. విద్యార్థులకు, పరిశోధకులకు మరింత లోతైన అభ్యాస అనుభవాలు అందించేలా ఆస్ట్రోఫిజిక్స్, ఖగోళ శాస్త్రాన్ని ప్రోత్సహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

    ఈ లక్ష్యంతో దేశవ్యాప్తంగా టెలిస్కోప్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం లేదా ఇప్పటికే ఉన్న వాటిని అప్‌గ్రేడ్ చేయడం జరుగుతుందని బడ్జెట్‌లో పేర్కొన్నారు.

    ఈ ప్రాజెక్టుల్లో నేషనల్ లార్జ్ సోలార్ టెలిస్కోప్, నేషనల్ లార్జ్ ఆప్టికల్ ఇన్‌ఫ్రారెడ్ టెలిస్కోప్, హిమాలయన్ చంద్ర టెలిస్కోప్, కోస్మోస్ 2 ప్లానెటేరియం వంటి కీలక సదుపాయాలు ఉన్నాయి.

    ఈ చర్యలతో భారతదేశంలో ఖగోళ పరిశోధనలు మరింత బలపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

  • 1 Feb 2026 11:47 AM IST

    బడ్జెట్ 2026: ప్రతి జిల్లాలో బాలికల హాస్టల్ ఏర్పాటు

    యూనియన్ బడ్జెట్ 2026లో బాలికల విద్యకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. చదువు, ల్యాబ్ పనుల కోసం ఎక్కువ సమయం కేటాయించాల్సి రావడం వల్ల బాలిక విద్యార్థినులు ఎదుర్కొంటున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ప్రతి జిల్లాలో ఒక బాలికల హాస్టల్ ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

    విజిబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF) పథకం కింద ఈ హాస్టళ్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. దీని ద్వారా బాలికలకు సురక్షిత వసతి సదుపాయాలు అందించి వారి విద్యాభ్యాసానికి మరింత మద్దతు ఇవ్వడం లక్ష్యంగా ఉన్నట్లు సమాచారం.

    ఈ నిర్ణయం వల్ల జిల్లాల స్థాయిలో ఉన్నత విద్య కోసం బయటకు వెళ్లే బాలికలకు సౌకర్యాలు మెరుగుపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

  • 1 Feb 2026 11:44 AM IST

    ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్స్

    ప్రజల ప్రయాణాలకు పెంచేలా పర్యావరసహిత ప్రయాణాన్ని ప్రమొట్ చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోందని నిర్మలా సీతారామన్ చెప్పారు. దీని కోసం మొత్తం ఏడు హైస్పీడ్ రైల్వే కారిడార్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

    ముంబై-పూణె,

    పూణే-హైదరాబాద్

    హైదరాబాద్-బెంగళూరు

    బెంగలూరు- చెన్నై

    హైదరాబాద్-చెన్నై

    చెన్నై- బెంగళూరు

    ఢిల్లీ-వారణాసి

    వారణాసి-సిలిగురి

    2. అదే విధంగా ఆర్థిక రంగంలో కూడా కీలక ప్రకటనలు చేశారు నిర్మలా సీతారామన్. బలమైన బ్యాలెన్స్ షీట్స్, రికార్డ్ ప్రాఫిటబిలిటీ, ఆస్తుల క్వాలిటీలో ఇంప్రూవ్‌మెంట్, 98శాతానికి మించిన కవరేజ్ఉన్న బ్యాంకింగ్ సెక్టార్ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ కమిటీ సదరు రంగం అభివృద్ధికి కావాల్సిన సంస్కరణను ప్రతిపాదిస్తుందని నిర్మలా వెల్లడించారు.

  • 1 Feb 2026 11:42 AM IST

    గ్లోబల్ లీడర్‌షిప్ కోసం కొత్త కమిటీ

    ఇండియా సర్వీస్ సెక్టర్‌కు బూస్ట్ అందించడం కోసం అత్యున్నత అధికారంతో ఎడ్యుకేషన్ టు ఎప్లాయిమెంట్ ఎంట్రప్రైజెస్ స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ కమిటీ అభివృద్ధికి, ఉద్యోగావకాశాల కల్పనకు, ఎగుమతి అవకాశాలు అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తిస్తుంది. తద్వారా సేవా విభాగంలో భారత్ గ్లోబల్ లీడర్‌గా మార్చే ప్రయత్నం జరుగుతుందని చెప్పారు.

  • 1 Feb 2026 11:28 AM IST

    కేంద్ర ప్రభుత్వం ఖాదీ, హ్యాండ్‌లూమ్, హస్తకళ రంగాలను బలోపేతం చేయడానికి మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్ ఇనిషియేటివ్ను ప్రారంభించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2026లో ప్రతిపాదించారు.

    ఈ కార్యక్రమం ద్వారా ఖాదీ, చేనేత, హస్తకళ ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లతో అనుసంధానం కల్పించడం, బ్రాండింగ్‌కు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అలాగే శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, ఉత్పత్తి నాణ్యతను మెరుగుపరచే విధంగా వ్యవస్థను సులభతరం చేయనున్నట్లు పేర్కొన్నారు.

    ఈ ఇనిషియేటివ్ ద్వారా చేనేత కార్మికులు, గ్రామీణ పరిశ్రమలు, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ (ODOP) కార్యక్రమం, గ్రామీణ యువతకు ప్రయోజనం కలగనున్నట్లు అంచనా వేస్తున్నారు.

  • 1 Feb 2026 11:28 AM IST

    భారత సాంకేతిక ఎకోసిస్టంను మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ISM) 2.0ను ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2026లో ప్రకటించారు.

    ఇండియా సెమీకండక్టర్ మిషన్ 1.0 ద్వారా దేశంలో సెమీకండక్టర్ సామర్థ్యాలు విస్తరించాయని ఆమె తెలిపారు. దీనిపై ఆధారంగా ఇప్పుడు ISM 2.0ను ప్రారంభించి, పరికరాలు, ముడి పదార్థాల తయారీ, ఫుల్-స్టాక్ భారతీయ ఐపీ అభివృద్ధి, సరఫరా గొలుసులను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.

    ఈ రంగంలో వృద్ధి వేగాన్ని మరింత ఉపయోగించుకునేందుకు సెమీకండక్టర్ మిషన్‌కు కేటాయింపును రూ.40,000 కోట్లకు పెంచాలని ఆమె ప్రతిపాదించారు.

    అదేవిధంగా పరిశ్రమ ఆధారిత పరిశోధన, శిక్షణ కేంద్రాలపై దృష్టి పెట్టి సాంకేతిక అభివృద్ధి, నైపుణ్యవంతమైన మానవ వనరులను తయారు చేయనున్నట్లు తెలిపారు.

    ఇక ఏప్రిల్ 2025లో ప్రారంభించిన ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మాన్యుఫాక్చరింగ్ స్కీమ్కు రూ.22,999 కోట్ల కేటాయింపు ఉండగా, ఇప్పటికే లక్ష్యాలను మించిన పెట్టుబడి హామీలు వచ్చినట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు

  • 1 Feb 2026 11:27 AM IST

    కార్మికాధారిత టెక్స్టైల్ రంగాన్ని బలోపేతం చేయడానికి ఐదు ప్రధాన భాగాలతో కూడిన సమగ్ర కార్యక్రమాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2026లో ప్రతిపాదించారు.

    మొదటి భాగంగా నేషనల్ ఫైబర్ స్కీమ్ను ప్రవేశపెట్టాలని సూచించారు. దీని ద్వారా పట్టు, గొర్రెమేకల ఉన్ని, జ్యూట్ వంటి సహజ ఫైబర్లతో పాటు మానవ నిర్మిత, కొత్త పరిశ్రమ యుగానికి చెందిన ఫైబర్లలో స్వావలంబన సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

    రెండవ భాగంగా టెక్స్టైల్ ఎక్స్‌పాంశన్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ స్కీమ్ను ప్రతిపాదించారు. సంప్రదాయ టెక్స్టైల్ క్లస్టర్లను ఆధునీకరించేందుకు యంత్రాలు, సాంకేతిక అప్‌గ్రేడ్‌లకు మూలధన మద్దతు ఇవ్వడం, సామూహిక పరీక్షా కేంద్రాలు, సర్టిఫికేషన్ సెంటర్లను ఏర్పాటు చేయడం ఈ పథకం ఉద్దేశం.

    మూడవ భాగంగా *నేషనల్ హ్యాండ్‌లూమ్ అండ్ హ్యాండిక్రాఫ్ట్ ప్రోగ్రామ్ (NHHP)*ను ప్రకటించారు. ఇప్పటికే ఉన్న పథకాలను సమన్వయం చేసి మరింత బలోపేతం చేయడం, చేనేత కార్మికులు, హస్తకళాకారులకు లక్ష్యిత మద్దతు అందించడం ఈ కార్యక్రమం లక్ష్యంగా ఉంటుందని తెలిపారు.

  • 1 Feb 2026 11:25 AM IST

    12.2 లక్షల కోట్లకు చేరిన క్యాపెక్స్

    ఆర్థిక సంవత్సరం 2027కు భారతదేశ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ రూ.12.2 లక్షల కోట్లకు చేరిందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

    దీంతో పాటు ఎస్ఎంఈ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.10వేల కోట్ల నిధులను వెల్లడించింది. తద్వారా భారీ సంఖ్యలో ఉద్యోగావకాశాలు పెరుగుతాయని చెప్పారు.

Read More
Next Story