
వరి చేలోనే ఇద్దరి దారుణ హత్య..
నెల్లూరు జిల్లా కొడవలూరు వద్ద ఏమి జరిగింది?
నెల్లూరు జిల్లాలో వరి కోతలు ఆధిపత్య పోరుకు దారి తీసినట్లు తెలుస్తోంది. దీని పర్యవసానం పాత కక్షల తో నెల్లూరు నగరానికి సమీపంలో ఇద్దరు హత్యకు గురయ్యారు. ఈ సంఘటన స్నేహితుల కుటుంబాల మధ్య మరింత ఉద్రిక్తతకు దారి తీసినట్లు సమాచారం అందింది.
నెల్లూరు జిల్లాలో వరి పంట కోత దశకు వచ్చింది. ఈ పంట నూర్పిడికి భారీ వరి కోత యంత్రాలను వినియోగిస్తున్నారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం పొలాల్లోని ఇద్దరు వరి కోత యంత్రాల యజమానులు హత్యకు గురైన సంఘటన కలగలం రేపింది. ఈ సమాచారం అందిన వెంటనే
నెల్లూరు రూరల్ డిఎస్పి ఘట్టమనేని శ్రీనివాస్, కొడవలూరు ఎస్సై ప్రతాప్ కందుల సంఘటన ప్రదేశాన్ని పరిశీలించారు. హత్యకు గురయింది దస్తగిరి మండలానికి చెందిన వెంకటేష్ (29), సంఘం మండలానికి చెందిన బాల వెంకటయ్య (26) గా గుర్తించారు. ఈ సంఘటన జరగడం వెనక పాత కక్షలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
ప్రత్యర్థులు ఎవరు?
కొడవలూరు మండలం గండవరం పొలాల్లో వరి కోతల కోసం ఆదివారం రాత్రి యంత్రాలకు డీజిల్ పట్టించుకుని వెంకటేష్, బాల వెంకటయ్య వస్తున్నట్లు ప్రాథమికంగా సమాచారం అందింది. పొలాల్లోనే వారిద్దరిని హత్య చేసి పడేసినట్లు పోలీసులు సందేహిస్తున్నారు.
కొడవలూరు మండలం గండవరం పొలాల్లో ఇద్దరి మృతదేహాలు పడి ఉన్నాయని సమాచారంతో ఎస్సై ప్రతాప్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే నెల్లూరు రూరల్ డిఎస్పి ఘట్టమనేని శ్రీనివాస్ కూడా హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. హత్యకు గురైన ఇద్దరికీ కొందరితో విరోధం ఉన్నట్లు సమాచారం అందింది. వరి కోత యంత్రాల విషయమా లేకుంటే వ్యక్తిగత కక్షల అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
Next Story

