తిరుమల యాత్రకు ఏప్రిల్ లో రావాలనుకుంటున్నారా...
x

తిరుమల యాత్రకు ఏప్రిల్ లో రావాలనుకుంటున్నారా...

రేపు ఉదయం పది గంటలకు ఆర్జిత సేవా టికెట్లు బుక్ చేసుకోండి ఇలా..


వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవాలనుకుంటున్నారా? తిరుమల యాత్రికు ఏప్రిల్ నెలలో వచ్చే యాత్రికులు ప్లాన్ చేసుకునేందుకు టీటీడీ అవకాశం కల్పించింది. ఈ నెల 19వ తేదీ ఆన్ లైన్ లో ఆర్జిత సేవా టికెట్లతో పాటు వసతి కోసం గదులు కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ ఏడాది మార్చి నెలలో శ్రీవారిసేవ, పరకామణి సేవకు వచ్చే సేవకుల కోసం కూడా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.

తిరుమల శ్రీవారిని ఏప్రిల్ నెలలో దర్శనం తోపాటు తిరుపతి, తిరుమలలో గదుల కోసం ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లు (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) ఏప్రిల్ నెల కోటా 19వ తేదీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.
ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం జనవరి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్ల కోసం నమోదు చేసుకున్న వారు జనవరి 21వ తేదీ నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు నగదు చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి.
22న ఆర్జిత సేవా టికెట్లు
తిరుమల శ్రీవారికి కల్యాణోత్సవం టికెట్లు 22 తేదీ ఆన్ లైన్ లో విడుదల చేస్తారు. దీనితోపాటు శ్రీవారి ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకారసేవ, శ్రీ‌వారి సాల‌క‌ట్ల‌ వ‌సంతోత్స‌వాల‌ టికెట్లు కూడా ఆ రోజు ఉదయం ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేస్తారు.
1) వర్చువల్ సేవలు, వాటి దర్శనస్లాట్ల కోటా 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది.
2) అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటా 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
3) శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటా 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు.
వృద్ధులకు ప్రాధాన్యత
తిరుమల శ్రీవారి దర్శనవంలో వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులు ఉన్న‌ వారికి కూడా టీటీడీ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. వారి కోసం కూడా మూడు నెలలకు ఒకసారి ఆన్ లైన్ లో ప్రత్యేకంగా ఉచిత దర్శనానికి టికెట్లు విడుదల చేస్తోంది. ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటా 23న మధ్యాహ్నం మూడు గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేస్తుంది.
4) ఈ నెల 24వ తేదీ ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది.
వసతి సదుపాయం..
తిరుమల యాత్రకుల వచ్చే యాత్రికులు ఇబ్బందులకు గురికాకుండా తిరుపతి, తిరుమలలో కూడా వసతి గదులు ఆన్ లైన్ లో బుక్ చేసుకునే సదుపాయం టీటీడీ అమలు చేస్తోంది. తిరుమల, తిరుపతిలో గదులు రిజర్వు చేసుకునేందుకు 24వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
27న శ్రీవారిసేవ, పరకామణి సేవ
తిరుమలలో యాత్రికులకు సేవలు అందించడంలో శ్రీవారి సేవకులది కీలకపాత్ర. శ్రీవారి హుండీ కానుకలు లెక్కించడానికి కూడా సేవకులు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ సంవత్సరం మార్చి నెలలో శ్రీవారి సేవకు రావాలనుకునే స్వచ్ఛంద సేవకుల కోసం టీటీడీ ప్రత్యేక సదుపాయం కల్పించింది. మార్చిలో ఈ సేవలకు రావాలనుకునే సేవకుల కోసం ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా కోటా సేవా విడుదల చేయనున్నారు.
Read More
Next Story