తిరుపతి:తనిఖీలతో ఉలిక్కిపడిన కపిలతీర్థం...
x
తిరుపతి హోటల్ గదిలో తనిఖీ చేస్తున్న పోలీసులు

తిరుపతి:తనిఖీలతో ఉలిక్కిపడిన కపిలతీర్థం...

హోటళ్లకు మళ్లీ ఆరు నెలల తరువాత బెదిరింపు ఈ-మెయిల్.


హోటళ్లలో బాంబలు పెట్టాం. ఏ క్షణమైనా పేలే ప్రమాదం ఉందనే హెచ్చరికల నేపథ్యంలో తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో మంగళవారం పోలీసులు మరోసారి పరుగులెత్తారు. ఈ మెయిల్ రావడంతో తిరుపతి పోలీసులు అప్రమత్తం అయ్యారు.

"గుర్తు తెలియని వ్యక్తి ఒక ఈ-మెయిల్ ద్వారా Raj Park Hotel మరియు కే.టి. రోడ్ వద్ద ఉన్న Indian Bank శాఖలో ఐఈడీ (IED) బాంబులు ఏర్పాటు చేశాం" అని బెదిరింపు సందేశం వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగారు.

తిరుపతి నగరంలోని కపిలతీర్ధం ప్రాంతంలోని హెటళ్ళలో అలిపిరి పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి రాజ్ పార్క్ హోటల్‌లోని గదులు, సాధారణ ప్రదేశాలు, హోటల్ ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతం తదితర ప్రాంతాలను పూర్తిగా తనిఖీ చేశారు. అలాగే కే.టి. రోడ్‌లోని ఇండియన్ బ్యాంక్ ప్రాంగణాన్ని కూడా బాంబు డిస్పోజబుల్ స్వ్యాడ్ (Bomb Disposable Swad BDS) , డాగ్ స్క్వాడ్ తో పోలీసులు రంగంలోకి దిగారు. అనుమానిత ప్రదేశాల్లో అణువణువునా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎలాంటి ప్రమాదం లేదనే విషయంలో యాత్రికులకు పోలీసులు భరోసా కల్పించారు.

తిరుపతి నగరంలో ఆరు నెలల తరువాత మళ్ళీ ఈ మెయిల్ బెదిరింపులు ప్రారంభం అయ్యారు. గత ఏడాది కూడా జూన్ నెల నుంచి పదేపదే ఈ తరహా బెదిరింపు ఈ మెయిల్స్ వచ్చాయి. అప్పుడు కూడా తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు అప్రమత్తం అయ్యారు. హోటళ్ళను తనిఖీ చేయించడంతో పాటు మెయిల్స్ పంపిస్తున్న వ్యక్తులపై దృష్టి సారించినట్లు చెప్పారు.

అలిపిరిలో కలకలం..

గుర్తు తెలియని వ్యక్తుల మెయిల్ తో పోలీసులు కపిలతీర్ధం సమీపంలోని హెటళ్లలో తనిఖీలు చేపట్టారు. స్థానికులు మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. గతంలో కూడా ఈ తరహా బెదిరింపులు వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్ రంగంలోకి దిగడంతో ఏమి జరిగిందోనని యాత్రికులు ఆందోళనకు గురయ్యారు. హోటళ్లలో పూర్తిగా తనిఖీలు చేసిన తరువాత..

"విస్తృత తనిఖీలు చేశాం. ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభ్యం కాలేదు" అని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు స్పష్టమ చేశారు. రంగా పరిశీలించారు. తనిఖీల సందర్భంగా ఎటువంటి అనుమానాస్పద వస్తువులు, పేలుడు పదార్థాలు లేదా ఇతర అభ్యంతరకర వస్తువులు కనిపించలేదని ఆయన స్పష్టం చేశారు.

కేసు నమోదు

బాంబు బెదిరింపు సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బెదిరింపు ఈ-మెయిల్ పంపిన వ్యక్తిని గుర్తించేందుకు సాంకేతిక ఆధారాల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ సుబ్బారాయుడు

"వదంతులు నమ్మవద్దు. అనుమానాస్పద సమాచారం ఉంటే సమాచారం ఇవ్వండి. ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి సిబ్బంది అండగా ఉంటారు" అని ఎస్పీ సుబ్బారాయుడు తిరుపతి ప్రజలకు భరోసా ఇచ్చారు.

Read More
Next Story