
తిరుపతి శ్రీకోదండరామాలయంలో సీతారాముల వారి కల్యాణోత్సవంలో మంగళసూత్రం ప్రదర్శిస్తున్న వేదపండితుడు.
తిరుపతి: కోదండరాముడికి శ్రీవారి అపురూప కానుక
కనుల పండువగా సాగిన సీతారాముల కల్యాణం
తిరుపతిలో శ్రీకోదండరామాలయంలో శ్రీసీరాములవారి కల్యాణం కనుల పండువగా సాగింది. ఈ కార్యక్రమానికి తిరుమల శ్రీవారి ఆలయం నుంచి అపురూప కానుక (Lord Srivari's Exquisite Gift) లు అందించారు. తిరుపతికి తీసుకుని వచ్చిన కానుకలను ఏనుగు అంబారీపై కానుకలు తీసుకుని వచ్చిన టీటీడీ అధికారులు అమ్మవారికి బంగారు గజలక్షిపతకం, వెండి దీప స్తంభాలు సమర్పించారు.
తిరుపతిలోని కోదండరామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల తరువాత శ్రీరామనవమి వేడుకలు వైభంగా నిర్వహించారు. శనివారం సీతారాముల వారి కల్యాణం కమనీయంగా సాగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఓ ముద్దాడి రవిచంద్ర పాల్గొన్నారు. ఆలయంలో కార్యక్రమాలను ఆలయ డిప్యూటీ ఈఓ నాగరత్నకు అందించారు. టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్ పర్యవేక్షించారు.
అంబారీపై ఊరేగింపు
తిరుపతిలోని శ్రీకోదండరామాలయంలో స్వామి, అమ్మవారికి టీటీడీ విలువైన కానుకలు సమర్పించడం ఆనవాయితీ. అందులో భాగంగా శనివారం
శ్రీవారి ఆలయం నుంచి 62.44 లక్షల విలువైన బంగారు ఆభరణాలు తీసుకుని వచ్చారు. వాటిలో ఒక బంగారు గజలక్ష్మీ పతకం, రెండు వెండి దీప స్తంభాలు రూ. 62.44 లక్షలు విలువ చేసే ఆభరణాలు తిరుమల ఆలయం నుంచి పేష్కార్ రామకృష్ణ, బొక్కసం ఇన్ చార్జి గురురాజ గట్టభద్రత మధ్య తిరుపతికి తీసుకుని వచ్చారు.
టీటీడీ పరిపాలనా భవనం నుంచి ఈ ఆభరణాలు తిరుమల వేదపండితులు ఏనుగు అంబారీపై తిరుపతి నగరంలో ఊరేగింపుగా తీసుకుని బయలుదేరారు. ఏనుగుల ముందు కళాకారులు ప్రదర్శనలు అలరించాయి. కోదండరామాలయం వద్దకు చేరుకోగానే ఆభరణాలు ఆలయ డిప్యూటీ ఈఓ నాగరత్నకు అందించారు.
కల్యాణోత్సవానికి ముందు..
శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో శనివారం రాత్రి శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఉత్సవానికి ముందు అర్చకులు పుణ్యాహవచనం, సద్యో అంకురార్పణ, రక్షాబంధనం, విశేషారాధన చేశారు. ఆ తరువాత రక్షాబంధన, అగ్నిప్రతిష్ఠ, మధుపర్కం, కన్యాదానం, మహాసంకల్పం, స్వామి, అమ్మవారికి ప్రవరలు, మాంగళ్యపూజ చేపట్టారు. అనంతరం మాంగళ్యధారణ, ఉక్తహోమాలు, పూర్ణాహుతి, నివేదన, అక్షతారోహణం, ముత్యాల తలంబ్రాల సమర్పణ, విశేష నివేదన, మాలమార్పిడి, అక్షతారోహణ, హారతి, చతుర్వేద పారాయణం, యజమానికి వేద ఆశీర్వాదం, హారతి ఇచ్చారు. కల్యాణం అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను ఆలయ ప్రాంగణంలో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.
కల్యాణోత్సవ వేడుకలో చిత్రమాలిక
తిరుపతి శ్రీకోదంరామాలయం వద్ద సాయంత్రం నుంచి రాత్రి వరకు సీతారాములవారి కల్యాణోత్సవ వేడుకగా శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఆ కార్యక్రమానికి టీటీడీ ఈఓ ముద్దాడి రవిచంద్ర దంపతులు, టీటీడీ అధికారులు అమ్మవారికి సమర్పించడానికి తిరుమల నుంచి తీసుకుని వచ్చిన ఆరణాలతో పాటు పూలదండలు, ముత్యాలు వంటి కానుకలు వేదపండితులకు అందించారు.
Next Story

