మంటల్లో ఆర్టీసీ బస్సు.. 29 మంది సురక్షితం..
x

మంటల్లో ఆర్టీసీ బస్సు.. 29 మంది సురక్షితం..

తిరుపతి జిల్లా నాయుడుపేట వద్ద ఘటన


వేసవికాలం ప్రారంభం కాకముందే బస్సుల్లో మంటలు పుడుతున్నాయి. తిరుపతి నుంచి వినుకొండకు బయలుదేరిన ఏపీఎస్ఆర్టీసీ బస్సులో మంటలు చేరేగాయి. ఓ ప్రయాణికుడి అప్రమత్త వల్ల 29 మంది ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. అర్ధరాత్రి వరకు రోడ్డుపైనే పడిగాపులు కాశారు. శుక్రవారం వేకువజామున ప్రత్యామ్నాయ బస్సు ఏర్పాటు చేయడంతో స్వప్రాంతాలకు వెళ్లారు. ఈ ఘటనతో బస్సుల్లో ప్రమాద నివారణ పరికరాలు లేకపోవడం అనే అంశం తెరమీదకు వచ్చింది.ఈ సంఘటన వివరాల్లోకి వెళితే..


తిరుపతి శ్రీహరి ఆర్టీసీ సెంట్రల్ బస్ స్టేషన్ నుంచి సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సు గురువారం రాత్రి వినుకొండకు బయలుదేరింది. 29 మంది ప్రయాణికులతో ఉన్న ఈ బస్సు శ్రీకాళహస్తి వరకు ప్రయాణించింది. నాయుడుపేట బస్సు ప్రయాణిస్తుండగా, మార్గమధ్యలో ఎక్కిన ప్రయాణికుల నుంచి డ్రైవర్ టికెట్లు ఇస్తున్నారు. అప్పటికే మరో మరో డ్రైవర్ బస్సు నడుపుతున్నారు. ఈ ఆర్టీసీ బస్సు నాయుడుపేట సమీపంలోని విన్నమాల గ్రామం వద్ద జాతీయ రహదారిపై ప్రయాణిస్తోంది. బస్సు వెనుక భాగంలో పొగలు రావడం గమనించిన ప్రయాణికుడు అప్రమత్తమయ్యారు. ఈ విషయం డ్రైవర్ చెప్పగానే బస్సు ఆపేశారు. దీంతో ప్రాణభీతితో ప్రయాణికులు ఏడుపులతో బస్సులో హాహాకారాలు చెలరేగాయి. అదే సమయంలో వెనుక భాగం నుంచి పగలు రావడంతో ప్రయాణికులు ఆందోళనగా బస్సు నుంచి కిందికి దిగిపోయారు. వేడి వల్ల బస్సు బ్యాటరీ వైర్లలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వ్యాపించినట్లు భావిస్తున్నారు.

స్తంభించిన ట్రాఫిక్
తిరుపతి నుంచి వినుకొండకు బయలుదేరిన బస్సు లో బ్యాటరీ వైర్లు షార్ట్ సర్క్యూట్ వల్ల పొగలు వచ్చాయని భావిస్తున్నారు. దీంతో మంటలు చెలరేగకముందే బస్సు ఆపేశారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై గంటల తరబడి ట్రాఫిక్ కూడా స్తంభించినట్లు సమాచారం అందింది. ఆర్టీసీ బస్సు ప్రమాదంలో ఉందని సమాచారం అందిన వెంటనే నాయుడుపేట అగ్నిమ్యాపక శాఖ అధికారి సత్యం బాబు సారధ్యంలోని సిబ్బంది వెళ్లి మంటలను అదుపు చేశారు. ఆ తర్వాత ప్రయాణికులు తమ లగేజీ కూడా భయం భయంగా బయటికి తెచ్చుకున్నట్లు తెలిసింది. కొన్ని గంటల నిరీక్షణ తర్వాత ఆర్టిసి అధికారులు ప్రత్యామ్నాయ బస్సు ఏర్పాటు చేశారు. దీంతో ప్రయాణికులు శుక్రవారం వేకువజామున తెలుస్తుంది.
ప్రమాద నివారణ పరికరాలు ఏవీ..
గత ఏడాది కర్నూలు వద్ద ప్రయివేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం తరువాత కూడా అధికారులు స్పందించినట్లు కనిపించడం లేదు. అత్యవసర అగ్నిమాపక పరికరాలు కూడా అందుబాటులో ఉంచడం లేదనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. నాయుడుపేట వద్ద ఆర్టీసీ బస్సు నుంచి పొగలు రావడం, మంటలు చెలరేగిన సమయంలో కూడా అగ్నిమాపక నివారణ పరికరాలు లేకపోవడం వల్ల ప్రయాణికులకు ముప్పు పొంచి ఉన్నట్లే కనిపిస్తోంది.
Read More
Next Story