తిరుమల: 19న ఉగాది ఆస్థానం..
x
తిరుమల శ్రీవారి ఆలయం (ఫైల్)

తిరుమల: 19న ఉగాది ఆస్థానం..

శ్రీవారి ఆలయంలో 17న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు


తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఈ నెల 19వ తేదీ ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ పర్వదినానికి మూడు రోజుల ముందు 17వ తేదీ (మంగళవారం) కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆ రోజు ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. దీంతో 16వ తేదీ సిఫారసు లేఖలు అనుమతించండం లేదని టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి చెప్పారు

తిరుమలలో సాధారణంగా ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు ముందు వ‌చ్చే మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించ‌డం ఆనవాయితీ. అందులో భాగంగానే ఉగాదికి ముందు ఈ క్రతువు నిర్వహించనున్నారు.

వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

తిరుమలలో ఉగాది ఆస్థానం నేపథ్యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా మార్చి 17న వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాదపద్మారాధన సేవలు టీటీడీ రద్దు చేసింది. 16వ తేదీ ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించరని టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి తెలిపిరు. మార్చి 19న ఉగాది ఆస్థానం సందర్భంగా ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశామని ఆయన తెలిపారు. మార్చి 18వ తేదీ విఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.
Read More
Next Story